Manchu Manoj: కోటితో తీస్తే చిన్న సినిమా.. వెయ్యి కోట్లతో తీసింది పెద్ద మూవీ అనడానికి లేదు.. మంచు మనోజ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Manchu Manoj: కోటితో తీస్తే చిన్న సినిమా.. వెయ్యి కోట్లతో తీసింది పెద్ద మూవీ అనడానికి లేదు.. మంచు మనోజ్ కామెంట్స్

 

Manchu Manoj About Movies In Jagannath Teaser Launch: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ చేశారు. జగన్నాథ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాక్‌స్టార్ మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.

 
కోటితో తీస్తే చిన్న సినిమా.. వెయ్యి కోట్లతో తీసింది పెద్ద మూవీ అనడానికి లేదు.. మంచు మనోజ్ కామెంట్స్
కోటితో తీస్తే చిన్న సినిమా.. వెయ్యి కోట్లతో తీసింది పెద్ద మూవీ అనడానికి లేదు.. మంచు మనోజ్ కామెంట్స్
 

Manchu Manoj About Movies In Jagannath Teaser Launch: భ‌ర‌త్ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై భర‌త్‌, పీలం పురుషోత్తం నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మూవీ ‘జగన్నాథ్’. ఈ సినిమాకు సంతోష్ దర్శకత్వం వహించారు. జగన్నాథ్ సినిమాలో రాయ‌ల‌సీమ‌ భరత్, ప్రీతి జంటగా హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

 

మంచు మనోజ్ కామెంట్స్

తాజాగా జగన్నాథ్ మూవీ టీజర్‌ను, పోస్ట‌ర్‌ను ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ రాక్‌స్టార్ మంచు మనోజ్‌ రిలీజ్‌ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఘ‌నంగా జ‌రిగిన‌ ‘జగన్నాథ్’ మూవీ టీజర్‌ లాంచ్ వేడుక‌లో జ‌బ‌ర్ద‌స్త్ కామెడియ‌న్స్ అప్ప‌రావు, వినోదిని, గ‌డ్డం న‌వీన్ పాల్గొని వినోదం పంచారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మొదటి సినిమా అయినా ఎంతో ప్రొఫెషనల్‌గా చేశాడు

ఈ సంద‌ర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. “జగన్నాథ్ మూవీ టీజ‌ర్ చాలా అద్భుతంగా ఉంది. త‌మ్ముడు ‘రాయ‌ల‌సీమ’ భర‌త్ చేసిన ఫ‌స్ట్ మూవీ అయిన‌ప్ప‌టికీ ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా చేశాడు. చిత్ర‌యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం క‌నిపిస్తోంది. భర‌త్ ఫ్రెండ్స్ అంతా ముందుకు వ‌చ్చి ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవ‌డం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది” అని తెలిపాడు.

బాగుందా బాగాలేదా అనేదే ఉంటుంది

“ఈ రోజుల్లో సినిమా తీయ‌డం అంత ఈజీ కాదు. అలాంటి ప‌రిస్థితుల్లో ఎంతో ఫ్యాష‌న్‌తో ఈ సినిమా తీశారు. కోటి రూపాయ‌ల‌తో తీసిన‌ సినిమా చిన్న‌ది, వెయ్యి కోట్ల‌తో తీసింది పెద్ద సినిమా అన‌డానికి లేదు. ఏదైనా సినిమానే. కాక‌పోతే, బాగుందా? బాగాలేదా? అనేదే ఉంటుంది. ఈ సినిమా ‘జగన్నాథ్’ మూవీ హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్” అని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.

 

ఐదేళ్లు సొంత తమ్ముళ్లా కష్టాలు పంచుకున్నారు

అనంతరం హీరో రాయ‌ల‌సీమ‌ భరత్ మాట్లాడుతూ.. ”మంచు మనోజ్ అన్న మంచి మ‌నసున్న వ్య‌క్తి. ‘జగన్నాథ్’ మూవీ వేడుక కోసం ఆయ‌న స్వ‌చ్ఛందంగా వ‌చ్చారు. నిజంగా గ్రేట్ ప‌ర్స‌న్. సినిమాల మీద ఇష్టంతో ఎంతో క‌ష్ట‌ప‌డి ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నిరంత‌రం ప‌ని చేస్తూ 5 సంవ‌త్స‌రాల శ్ర‌మ‌తో ‘జగన్నాథ్’ మూవీని పూర్తి చేశాము. ఈ ఐదేళ్లు వెంకీ, చైతూ.. నా వెంటే ఉంటూ సొంత త‌మ్ముళ్ల మాదిరిగా క‌ష్టాలు పంచుకున్నారు. స‌పోర్టుగా నిలిచిన క‌దిరి భాష‌కు థ్యాంక్యూ. సినిమా బాగా వ‌చ్చింది” అని చెప్పుకొచ్చాడు.

ఇతర కీలక పాత్రలు

ఇదిలా ఉంటే, జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమా టీమ్ అంతా పాల్గొన్నారు. ఇక జగన్నాథ్ మూవీలో రాయలసీమ భరత్, ప్రీతిరెడ్డితోపాటు సారా, నిత్యశ్రీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముదినే దుర్గరావు, బుక్కే వేణు మాధవి, బుట్టమనేని వెంకటేష్, నాగ చైతన్య రాయల్స్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024