



Best Web Hosting Provider In India 2024

Mexican Chicken: మెక్సికన్ చికెన్ రెసిపీ ఒకసారి ప్రయత్నించండి, దీన్ని స్నాక్న్‌లా తింటే అదిరిపోతుంది
Mexican Chicken: ఎప్పుడూ ఒకేలాంటి చికెన్ వంటకాలు కాకుండా ఓసారి విదేశీ వంటకాలు కూడా ప్రయత్నించాలి. ఇక్కడ మేము మెక్సికన్ చికెన్ వంటకం ఇచ్చాము. దీన్ని రెసిపీ అద్భుతంగా ఉంటుంది.
చికెన్‌తో చేసిన వంటకాలు అన్నీ టేస్టీగానే ఉంటాయి. విదేశాల్లో కూడా ఎన్నో చికెన్ వంటకాలు ఉంటాయి. ఎలాంటి వాటిల్లో సులువైనది మెక్సికన్ చికెన్. ఇది చైనీస్ వంటకంలా కనిపిస్తుంది. కానీ మెక్సికోకు చెందినది. ఈ వంటకాన్ని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. పైగా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ మెక్సికెన్ చికెన్ వేడి వేడిగా సాయంత్రం వేళల్లో తింటే అద్భుతంగా ఉంటుంది. చాలా రెస్టారెంట్లలో కూడా చికెన్ అందుబాటులో ఉంది. దీన్ని ఆర్డర్ పెట్టుకునే బదులు ఇంట్లోనే ఇలా చేసుకుంటే తక్కువ ధరలోనే అయిపోతుంది.
మెక్సికన్ చికెన్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ ముక్కలు – అరకిలో
తాజా ఎర్ర మిరపకాయలు – పది
ఉల్లి కాడలు – రెండు
టమాట కెచప్ – ఒక కప్పు
వంట నూనె – నాలుగు స్పూన్లు
మిరియాల పొడి – ఒక స్పూను
క్యాప్సికం తరుగు – నాలుగు స్పూన్లు
వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
వెనిగర్ – రెండు స్పూన్లు
టమోటోలు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
మెక్సికన్ చికెన్ రెసిపీ
1. ఎముకలు లేని చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి.
3. ఒక గిన్నెలో ఈ చికెన్ ముక్కలను వేసి వెల్లుల్లి తరుగు, ఉప్పు, వెనిగర్, తెల్ల మిరియాల పొడి వేసి బాగా కలిపి 20 నిమిషాలు పాటు ఫ్రిజ్లో ఉంచి మ్యారినేట్ చేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. ఆ నూనెలో మ్యారినేట్ చేసిన చికెన్‌ని తీసి బాగా వేయించాలి.
6. చికెన్ లో నీరు దిగి ఇంకిపోయేదాకా అలా వేయించాలి.
7. తర్వాత టమోటోలను మిక్సీలో వేసి మెత్తగా ఫ్యూరీలా చేసుకుని అందులో వేసి బాగా కలపాలి.
8. ఈ టమాటోలు మెత్తగా ఇగురులాగా అయ్యే వరకు వేయించాలి.
9. తర్వాత టమోటో కెచప్ కూడా వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
10. ఇప్పుడు తాజా ఎర్ర మిరపకాయలు తరుగు, క్యాప్సికం తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది జ్యూసీగా ఉంటుంది.
11. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని పైన స్ప్రింగ్ ఆనియన్స్ తరిగి గార్నిష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
12. అంతే స్పైసీగా ఉండే మెక్సికన్ చికెన్ తినే కొద్ది ఇంకా కావాలనిపిస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు ఇది ఎంతో నచ్చుతుంది.
మెక్సికన్ చికెన్ రెస్టారెంట్లలో అందుబాటులో ఉంటుంది. కానీ ధర ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనము తక్కువ పదార్థాలనే వేసి వండుతాము. ముఖ్యంగా టమాటో కెచప్ ఎక్కువగా వేయడం వల్ల దీనికి జ్యూసీ ఆకృతి వస్తుంది. దీంట్లో ఎక్కువగా వేసేది టమోటో, ఎర్ర మిరపకాయలు, క్యాప్సికం, చికెన్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేదే. ఇక్కడ మేము చేసిన పద్ధతిలో ఒక్కసారి మీరు మెక్సికన్ చికెన్ రెసిపీ చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.
సంబంధిత కథనం