


Best Web Hosting Provider In India 2024

Kousalya Supraja Rama OTT: ఏడాదిన్నర తర్వాత తెలుగులో ఓటీటీలోకి వస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Kousalya Supraja Rama OTT: కన్నడ ఇండస్ట్రీలో ఏడాదిన్నర కిందట వచ్చిన సంచలన విజయం సాధించిన మూవీ ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది.
Kousalya Supraja Rama OTT: ఓటీటీలోకి మరో కన్నడ హిట్ మూవీ తెలుగులో రాబోతోంది. ఈ సినిమా పేరు కౌసల్యా సుప్రజా రామా. జులై, 2023లో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ ఇది. ఇప్పటికే కన్నడ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండగా.. తాజాగా తెలుగులోనూ ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది.
కౌసల్యా సుప్రజా రామా ఓటీటీ రిలీజ్ డేట్
కన్నడలో కౌసల్యా సుప్రజా రామా టైటిల్ తో రిలీజైన ఈ రియలిస్టిక్ డ్రామా మూవీని తెలుగులోనూ అదే పేరుతో నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాను గురువారం (ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ తెలిపింది.
“కౌసల్యా సుప్రజా రామా ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో.. మనసును హత్తుకునే ప్రేమ, పరివర్తన, తనను తాను తెలుసుకునే ఓ వ్యక్తి కథ మీ భాషలో.. ఫిబ్రవరి 27 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ మంగళవారం (ఫిబ్రవరి 25) ట్వీట్ చేసింది.
కౌసల్యా సుప్రజా రామా మూవీ గురించి..
కన్నడ రియలిస్టిక్ డ్రామా ఈ కౌసల్యా సుప్రజా రామా. జులై 28, 2023లో థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర రూ.15 కోట్లు వసూలు చేయడంతోపాటు ఐఎండీబీలోనూ 7.2 రేటింగ్ సాధించడం విశేషం. శశాంక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య, మిలనా నాగరాజ్ లాంటి వాళ్లు నటించారు.
ఇదొక నిలువెల్లా పురుష అహంకారం ఉన్న రామా అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథ. తన తండ్రి ద్వారా ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకుంటాడు. తాను కూడా స్త్రీ ద్వేషిగా మారతాడు. అయితే అనుకోకుండా శివానీ అనే అమ్మాయి ప్రేమలో పడటంతో అతని జీవితం కీలకమైన మలుపు తిరుగుతుంది.
రామా పురుషాహంకారంతో పెట్టే బాధలను తట్టుకోలేక ఆమె అతనికి గుడ్ బై చెబుతుంది. ఆ తర్వాత రామా తల్లి కౌసల్య చనిపోతుంది. దీంతో తాను మారాలని నిర్ణయించుకొని ముత్తులక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె తాగుడుకు బానిసైన అమ్మాయి. ఆమె ద్వారా తాను గతంలో చేసిన తప్పులను తెలుసుకొని, మందు నుంచి ఆమెను రక్షించుకోవడానికి రామా ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ కౌసల్యా సుప్రజా రామా మూవీ స్టోరీ.
కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి తెలుగులో నేరుగా ఓటీటీలోకే వస్తున్న ఈ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు ఎంత మేర ఆదరిస్తారో చూడాలి. ఫిబ్రవరి 27 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం