



Best Web Hosting Provider In India 2024

Singer Sunitha Son: రొమాంటిక్ లవ్‌స్టోరీతో సింగర్ సునీత కొడుకు సెకండ్ మూవీ – హీరోయిన్‌గా భైరవి
Singer Sunitha Son: సర్కారు నౌకరి తర్వాత సింగర్ సునీత తనయుడు రొమాంటిక్ లవ్‌స్టోరీలో హీరోగా నటిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ద్వారా భైరవి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
సర్కారు నౌకరి మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సింగర్ సునీత కొడుకు ఆకాష్. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఆకాష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సర్కారు నౌకరి తర్వాత రొమాంటిక్ లవ్‌స్టోరీతో సెకండ్ మూవీ చేస్తోన్నాడు ఆకాష్. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో…
ఈ లవ్‌స్టోరీలో ఆకాష్‌కు జోడీగా భైరవి హీరోయిన్‌గా నటిస్తోంది. కథానాయికగా భైరవి కూడా ఈ మూవీతోనే తెలుగు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోంది. రొమాన్స్, లవ్‌తో పాటు సస్పెన్స్ కామెడీ అంశాల కలబోతగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆకాష్ పాత్ర డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.
హీరో మరదలిగా…
ఈ సినిమాలో ఆకాష్ మరదలిగా భైరవి కనిపించబోతున్నది. బావామరదళ్లుగా ఆకాష్, భైరవి కెమిస్ట్రీ, రొమాన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రకు భైరవి వందశాతం న్యాయం చేసిందని అంటున్నారు. ఇదే మొదటి మూవీ అయినప్పటికీ భైరవి మెచ్యూర్డ్ యాక్టింగ్‌ను కనబరిచిందని, సెంటిమెంట్, ఎమోషనల్ సీన్లలో ఆమె నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని యూనిట్ పేర్కొన్నారు. రిలీజ్ తర్వాత భైరవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమని వెల్లడించారు.
త్వరలో రిలీజ్ డేట్…
ఈ విలేజ్ లవ్ డ్రామా మూవీలో సీనియర్ యాక్టర్స్ రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని. త్వరలోనే సినిమా టైటిల్, విడుదల తేదీ అనౌన్స్‌చేస్తామని ప్రొడ్యూసర్ తాటి బాలకృష్ణ చెప్పాడు. ఈ సినిమాకు యశ్వంత్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ…
ఆకాష్ హీరోగా నటించిన సర్కారు నౌకరి మూవీ గత ఏడాది జనవరి 1న థియేటర్లలో రిలీజైంది. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేలా మంచి మెసేజ్‌తో దర్శకుడు గంగనమోని శేఖర్ రూపొందించాడు. దిగ్గజ దర్శకుడు కే రాఘవేంద్రారావు ఈ సినిమాను నిర్మించాడు. కమర్షియల్‌గా సర్కారు నౌకరి ఫెయిలైనా మంచి ప్రయత్నంగా ప్రేక్షకుల మన్ననలను అందుకున్నది.
సంబంధిత కథనం