పులివెందుల‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్రజాదర్బార్ 

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వాళ్ల విజ్ఞప్తులను స్వీకరించారు. వైయ‌స్ జ‌గ‌న్ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  అభిమాన నేత‌తో కరచలనం, సెల్ఫీలు..ఫొటోల కోసం ఎగబడుతున్నారు.  మరో వైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి వైయ‌స్ జ‌గ‌న్‌ సూచించారు.  

Best Web Hosting Provider In India 2024