



Best Web Hosting Provider In India 2024

OTT Bold Web Series: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న తమిళ బోల్డ్ వెబ్ సిరీస్.. రొమాంటిక్ సీన్లతో..
OTT Bold Web Series: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ తెలుగు రాబోతోంది. 2022లో తమిళంలో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ ను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండటం విశేషం.
OTT Bold Web Series: తమిళంలో రెండేళ్ల కిందట వచ్చిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఎమోజీ (Emoji). కాస్త బోల్డ్ సీన్స్, డైలాగులతో యువతను ఆకట్టుకునేలా మేకర్స్ ఈ సిరీస్ తీశారు. అయితే దీనికి చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. ఇప్పుడీ వెబ్ సిరీస్ ను అదే పేరుతో తెలుగులోకీ తీసుకొస్తున్నారు. ఆహా వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఎమోజీ ఓటీటీ రిలీజ్ డేట్
ఎమోజీ అనే తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం (ఫిబ్రవరి 28) నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మంగళవారం ఆహా వీడియో ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా నిమిషం నిడివి ఉన్న ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది.
“లవ్, ప్యాషన్, డెస్టినీ.. వాళ్లు మళ్లీ కలుసుకుంటారా? ఎమోజీ ఫిబ్రవరి 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కాస్త బోల్డ్ గానే ఉంది. ఓ అమ్మాయి, అబ్బాయి సహజీవనం, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం అనే కాన్సెప్ట్ తో ఈ ఎమోజీ వెబ్ సిరీస్ రూపొందింది.
ఎమోజీ వెబ్ సిరీస్ గురించి..
ఎమోజీ వెబ్ సిరీస్ లో మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ముఖ్యమైన పాత్రలు పోషించారు. గతంలో తెలుగు, తమిళం కలిపి 20 వరకు సినిమాల్లో నటించాడు మహత్ రాఘవేంద్ర. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు.
తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్, సైకిల్ లాంటి సినిమాల్లో నటించాడు. అతడు లీడ్ రోల్లో ఈ ఎమోజీ వెబ్ సిరీస్ రూపొందింది. ఇక రోషన్ కనకాలతో కలిసి బబుల్‌గమ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మానస. ఆమె ఈ వెబ్ సిరీస్ ఫిమేల్ లీడ్ గా నటించింది. బబుల్‌గమ్ లోనే రెచ్చిపోయిన ఆమె.. ఈ సిరీస్ లోనూ అలాంటి పాత్రే పోషించింది.
ఈ ఎమోజీ వెబ్ సిరీస్ ను సేన్ రంగస్వామి డైరెక్ట్ చేశాడు. ఈ ఆధునిక జీవితంలో యువతీయువకుల మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో ఈ వెబ్ సిరీస్ చూపించింది. ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆమెతో విడిపోతాడు.
మరో అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే కొన్నాళ్లకు అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ తిరిగి అతని జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలుసుకుంటారన్నదే ఈ ఎమోజీ స్టోరీ. ఫిబ్రవరి 28 నుంచి ఆహా వీడియో ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో చూడొచ్చు.
సంబంధిత కథనం