OTT Action Movie: తెలుగులో నేరుగా ఓటీటీలోకి వస్తున్న నిహారిక కొణిదెల తమిళ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..

Best Web Hosting Provider In India 2024

OTT Action Movie: తెలుగులో నేరుగా ఓటీటీలోకి వస్తున్న నిహారిక కొణిదెల తమిళ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..

Hari Prasad S HT Telugu
Feb 25, 2025 05:05 PM IST

OTT Action Movie: ఓటీటీలోకి నిహారిక కొణిదెల నటించిన తమిళ మూవీ తెలుగు వెర్షన్ వస్తోంది. పొంగల్ సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగలగా.. ఇప్పుడు తెలుగులో మాత్రం నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

తెలుగులో నేరుగా ఓటీటీలోకి వస్తున్న నిహారిక కొణిదెల తమిళ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..
తెలుగులో నేరుగా ఓటీటీలోకి వస్తున్న నిహారిక కొణిదెల తమిళ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..

OTT Action Movie: తమిళ యాక్షన్ మూవీ ఒకటి ఇప్పుడు తెలుగులో నేరుగా ఓటీటీలోకే వస్తోంది. నిహారిక కొణిదెల నటించిన ఈ సినిమా పేరు మద్రాస్కారణ్ (Madraskaaran). ఈ తమిళ యాక్షన్ మూవీ పొంగల్ సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ నెల మొదట్లో తమిళ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పుడు తెలుగులోనూ అడుగుపెడుతోంది.

మద్రాస్కారణ్ తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్

మద్రాస్కారణ్ మూవీ తెలుగు వెర్షన్ ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమా బుధవారం (ఫిబ్రవరి 26) నుంచే ఇందులో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“కొత్త వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న వాగ్వాదం వాళ్ల జీవితాలను మార్చే సంఘర్షణకు దారి తీసింది. ఒక్క క్షణం ఎప్పటికీ మన దృక్ఫథాన్ని, పరిస్థితులను మార్చేస్తుందో చూడండి. మద్రాస్కారణ్ ఫిబ్రవరి 26 నుంచి ఆహాలో” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ స్ట్రీమింగ్ విషయం తెలిపింది.

మద్రాస్కారణ్ మూవీ గురించి..

యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కిన మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీలో షేన్ నిగ‌మ్, క‌లైయరాస‌న్‌, ఐశ్వ‌ర్య ద‌త్తా కీల‌క పాత్ర‌లు పోషించారు. రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వాలి మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న మ‌ద్రాస్‌కార‌ణ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో పాటు రొటీన్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవలం రూ.80 లక్షలే రాబట్టడం గమనార్హం.

ఈ సినిమాతో హీరోయిన్‌గా హిట్టు కొట్టాల‌నే నిహారిక క‌ల తీర‌లేదు. మ‌ద్రాస్కారణ్ మూవీలో మీరా అనే యువ‌తిగా గ్లామ‌ర్ రోల్‌లో నిహారిక కొణిదెల క‌నిపించింది. మ‌ల‌యాళ న‌టుడు అయినా షేన్ నిగ‌మ్ ఈ మూవీతోనే కోలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మద్రాస్కారణ్ మూవీ స్టోరీ ఏంటంటే?

స‌త్య‌(షేన్ నిగ‌మ్‌)తో మీరా (నిహారిక కొణిదెల‌)పెళ్లి ఫిక్స‌వుతుంది. పెళ్లి ప‌నుల్లో ఉండ‌గా స‌త్య ఓ యాక్సిడెంట్ చేస్తాడు. ఈ ప్ర‌మాదంలో క‌ళ్యాణి గాయ‌ప‌డుతుంది. స‌త్య‌పై దురైసింగం ప‌గ‌ను పెంచుకుంటాడు.

ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన గొడ‌వ ఈగో కార‌ణంగా పెద్ద‌ది అవుతుంది. స‌త్య‌తో పాటు అత‌డి కుటుంబంపై దురైసింగం ఎటాక్ చేస్తాడు? ఆ త‌ర్వాత ఏమైంది? దురై సింగాన్ని ఎదురించి స‌త్య త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాల‌తో ద‌ర్శ‌కుడు వాలిమోహ‌న్‌దాస్ ఈ మూవీని రూపొందించాడు.

మ‌ద్రాస్కారణ్ నిహారిక న‌టించిన రెండో త‌మిళ సినిమా . గ‌తంలో విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో 2018లో వ‌చ్చిన ఒరు న‌ల్ల నాల్ పాథు సొల్రెన్ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషించింది నిహారిక‌. ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ద్రాస్కారణ్ తో కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం తెలుగులో యాక్ట‌ర్‌గానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024