


Best Web Hosting Provider In India 2024
KTR vs Revanth : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకున్నా.. రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు : కేటీఆర్
KTR vs Revanth : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకున్నా.. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై.. కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోందని వ్యాఖ్యానించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందన్న కేటీఆర్.. 14 నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకున్నా.. రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు.
నీరో చక్రవర్తిలా..
‘సీఎం రేవంత్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌పై కోపంతో కాంగ్రెస్ కరవు తీసుకొచ్చింది. రేవంత్‌కు బీజేపీ రక్షణ కవచంగా మారింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారు.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్‌ని ఖతం చేయాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయి. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
గాలి మోటార్లో ఢిల్లీకి..
‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లు రేవంత్ రెడ్డి తీరు ఉంది. ఓ వైపు 48 గంటల్లో 7 మంది రైతులు చనిపోయారు. సొంత జిల్లాలో 8 మంది కార్మికులు ప్రమాదంలో ఉన్నారు. అవన్నీ గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి గాలి మోటర్లో తిరుగుతూ.. 36వ సారి ఢిల్లీకి పోయారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసింది. బీజేపీని రేవంత్ పల్లెత్తు మాట అనరు’ అని కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్‌లో చేరిక..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరిపై సెటైర్లు పేల్చారు. శకునం చెప్పే బల్లి కుడితిల పడ్డట్టు అయింది కడియం శ్రీహరి పరిస్థితి అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రా కడియం శ్రీహరి అంటూ సవాల్ చేశారు.
శివుడు గంగను కిందకు దించినట్టు..
అప్పుడు శివుడు గంగను కిందకి దించినట్టు.. కేసీఆర్ గంగను 618 మీటర్ల పైకి తీసుకొచ్చి.. కాళేశ్వరం అనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు అని కేటీఆర్ వివరించారు. కానీ.. కేసీఆర్‌పై కోపంతో.. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఎండబెడుతోందని ఆరోపించారు. రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలు తడుపుకునే దుస్థితి దాపురించిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాపిక్