



Best Web Hosting Provider In India 2024

Flop Movies: ఈ తెలుగు సెలబ్రిటీలు కలిసి చేసిన సినిమాలన్నీ ఫ్లాప్- ప్రభాస్, రామ్ చరణ్, తారక్ ఫెయిల్యూర్ కాంబినేషన్స్ ఇవే!
Prabhas Ram Charan Jr NTR Failed Combinations: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని హిట్ కాంబోలుగా రికార్డ్స్ క్రియేట్ చేస్తే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్ కాంబినేషన్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. మరి ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇతర సెలబ్రిటీలతో కలిసి చేస్తే ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
Flop Movies Of Failed Combinations In Telugu: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వారి కలయికలో సినిమాలు వస్తున్నాయంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అలా కొన్ని కాంబినేషన్స్ హిట్ కొడితే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోయాయి. మరి ఫెయిల్యూర్ కాంబినేషన్స్‌గా మిగిలిన తెలుగు సెలబ్రిటీలు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
రామ్ చరణ్-కియారా అద్వానీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ గ్లామర్ బ్యూటి కియారా అద్వానీ కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్‌గానే మిగిలిపోయాయి. బాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుని గోల్డెన్ హీరోయిన్ అనిపించకున్న కియారా అద్వానీ వినయ విధేయ రామ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా రెండోసారి నటించిన సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్‌కు బాక్సాఫీస్ ఫలితం, ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలిసిందే.
మెహర్ రమేష్-జూనియర్ ఎన్టీఆర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెహర్ రమేష్ డైరెక్టర్‌గా చేసిన సినిమాలన్నీ ప్లాప్‌గా నిలిచాయి. ఇక మెహర్ రమేష్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కూడా శక్తి, కంత్రి వంటి రెండు సినిమాలు వచ్చాయి. కానీ, ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. శక్తి సినిమాపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగేంతలా ఆ మూవీ రిజల్ట్ ఉంది.
శ్రీనువైట్ల-మెగా ఫ్యామిలీ
ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్‌గా శ్రీను వైట్ల మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో శ్రీను వైట్ల తెరకెక్కించిన సినిమాలు మాత్రం ఫ్లాప్‌గా నిలిచాయి. వరుణ్ తేజ్‌తో మిస్టర్, రామ్ చరణ్‌తో బ్రూస్ లీ, మెగాస్టార్ చిరంజీవితో అందరివాడు సినిమాలను డైరెక్ట్ చేశారు శ్రీను వైట్ల.
వీటిలో 2005లో విడుదలైన అందరివాడు సినిమా కమర్షియల్‌గా ఆ ఏడాది అత్యధిక గ్రాసర్‌గా నిలిచినప్పటికీ టాక్ పరంగా మాత్రం నెగెటివిటీ మూట గట్టుకుంది. అయితే, నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ రాబట్టి చిరు మేనియా ఏంటో చూపించింది. ఇక మిస్టర్, బ్రూస్ లీ సినిమాలు కమర్షియల్‌గా కూడా ఫ్లాప్ అయ్యాయి.
ప్రభాస్-కృష్ణంరాజు
ప్రభాస్, కృష్ణంరాజు ఇద్దరికి వీపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు చూడాలని ఫ్యాన్స్ తెగ ఆరాటపడేవారు. కానీ, ప్రభాస్-కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన 3 సినిమాలు ప్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. బిల్లా స్టైలిష్ మూవీగా పేరు తెచ్చుకున్నప్పిటికీ కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది.
అలాగే, రెబల్, రాధేశ్యామ్ సినిమాలు అయితే, ఏకంగా డిజాస్టర్స్‌గా మిగిలిపోయాయి. రెబల్ మూవీలో ప్రభాస్ తండ్రిగా కృష్ణంరాజు నటిస్తే.. రాధేశ్యామ్ చిత్రంలో గురువుగా నటించారు. అయితే, మిగతా వారికంటే ప్రభాస్-కృష్ణంరాజు కాంబినేషన్ సినిమాలే ఎక్కువగా ఫెయిల్ అయ్యాయి.
సంబంధిత కథనం
టాపిక్