RK Roja Re Entry: బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన ఆర్కే రోజా- ఎక్కువ మాట్లాడితే పళ్లు రాల్తాయ్ అన్న హీరో శ్రీకాంత్ (వీడియో)

Best Web Hosting Provider In India 2024

RK Roja Re Entry: బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన ఆర్కే రోజా- ఎక్కువ మాట్లాడితే పళ్లు రాల్తాయ్ అన్న హీరో శ్రీకాంత్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Feb 25, 2025 04:07 PM IST

RK Roja Re Entry With Zee Telugu Super Serial Championship: బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు ఆర్కే రోజా. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా సెల్వమణి జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అయ్యే సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్‌ షోతో సందడి చేయనున్నారు.

బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన ఆర్కే రోజా- ఎక్కువ మాట్లాడితే పళ్లు రాల్తాయ్ అన్న హీరో శ్రీకాంత్ (వీడియో)
బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన ఆర్కే రోజా- ఎక్కువ మాట్లాడితే పళ్లు రాల్తాయ్ అన్న హీరో శ్రీకాంత్ (వీడియో)

RK Roja Re Entry With Zee Telugu Super Serial Championship: నటిగా, పొలిటిషియన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆర్కే రోజా సెల్వమణి. రాజకీయాల్లో ప్రత్యర్థులకు మాస్ డైలాగ్స్‌తో సమాధానం చెప్పే రోజా జబర్దస్త్ కామెడీ షోలో కొన్నిసార్లు కమెడియన్లకో పంచ్‌లు వేసి నవ్వించారు.

ఓడిపోయిన ఆర్కే రోజా

హీరోయిన్‌గా, నటిగా బ్రేక్ తీసుకున్న రోజా బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ షోలతో ఫుల్ బిజీగా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎలాంటి టీవీ షోలలో పాల్గొనని, పూర్తిగా ప్రజల సేవలోనే ఉంటానని రోజా చెప్పారు. అయితే, మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం, నగరి నియోజకవర్గంలో రోజా ఓడిపోయిన విషయం తెలిసిందే.

జీ తెలుగులో రోజా రీ ఎంట్రీ

దీంతో ఇప్పుడు బుల్లితెరపై ఆర్కే రోజా రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కానున్న సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ రియాలిటీ షోలో రోజా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. దీంతో రోజా బుల్లితెర రీ ఎంట్రీ టాపిక్ వైరల్‌గా మారింది.

సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ రియాలిటీ షో

సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ రియాలిటీ షో ప్రోమోలో హీరో శ్రీకాంత్, సీనియర్ హీరోయిన్స్ రోజా, రాశితోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు ఎంట్రీ ఇచ్చారు. షో మధ్యలో రోజా, రాశి మధ్యలో శ్రీకాంత్ నిల్చున్నారు. అప్పుడే ఆర్కే రోజాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో శ్రీకాంత్.

ముత్యాలు రాలుతాయి

“ఈవిడ (రాశి) నవ్వితేనోమే ముత్యాలు రాలుతాయి.. ఈవిడ దగ్గర ఎక్కువ మాట్లాడితేనేమో పళ్లు రాల్తాయ్..” అని హీరో శ్రీకాంత్ చెప్పారు. దాంతో అంతా నవ్వేశారు. రోజా కూడా ఆ మాటలకు నవ్వేశారు. దీంతో ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, ఈ సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ రియాలిటీ షోకి యాంకర్ రవి, బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు.

పోటీలో 16 సీరియల్స్

అలాగే, సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ టైటిల్ ట్రోఫీ కోసం ఏకంగా జీ తెలుగులోని 16 సీరియల్స్ పోటీ పడనున్నాయి. ఈ షోకు జడ్జ్‌లుగా శ్రీకాంత్, రాశితోపాటు ఆర్కే రోజా కూడా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ షో మార్చి 2 నుంచి ప్రారంభం కానుంది. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ సాయంత్రం 6 గంటలకు లాంచ్ కానున్నట్లు ప్రోమోలో తెలిపారు.

సీరియళ్ల జాబితా

ఆ తర్వాత ప్రతి ఆదివారం సాయంత్రం ఈ షో ప్రసారం కానుంది. ఇక ఈ సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం నిండు నూరేళ్ల సావాసం, మేఘ సందేశం, ఎన్నాళ్లో వేచిన హృదయం, భాగ్యవతి, చామంతి, ప్రేమ ఎంత మధురం, అమ్మాయి గారు, జగద్ధాత్రి, గుండమ్మ కథ, సీతే రాముడి కట్నం, పడమటి సంధ్యారాగం, ముక్కు పుడక, ఉమ్మడి కుటుంబం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి వంటి 14 సీరియళ్లతోపాటు మరో 2 ధారావాహికల నటీనటులు పోటీ పడనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024