



Best Web Hosting Provider In India 2024

Tips for cleaning copper items: రాగి వస్తువులను, పూజా సామాగ్రిని ఈజీగా ఇలా రెండు నిమిషాల్లో శుభ్రంగా చేయండి!
Tips for cleaning copper items: ఇంట్లో అలాగే దేవుడి దగ్గర ఉండే రాగి వస్తువులను శుభ్రం చేయడానికి కష్టపడుతున్నారా? మార్కెట్లే దొరికే పౌడర్ లతో రుద్దీ రుద్దీ విసిగిపోయారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే.
ఇంట్లో అలాగే దేవుడి దగ్గర చాలా రకాల రాగి వస్తువులు ఉంటాయి. చాలా మంది వీటిని ఉపయోగించడం చాలా పవిత్రంగా, ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. అయితే వీటిని శుభ్రం చేయడం విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఏ చిన్న తేడా వచ్చిన రాగి వస్తువులు అందవిహీనంగా కనిపిస్తాయి. మార్కెట్లో దొరికే పౌడర్లతో ఎంత రుద్దినా రాగి వస్తువులు శుభ్రంగా కావు.
మీరు కూడా ఇలాగే రాగి వస్తువులను శుభ్రం చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ కోసం ఇక్కడ ఓ చక్కటి చిట్కా ఉంది. ఈ టిప్స్ తో రాగి వస్తువులను క్లీన్ చేశారంటే మీ ఇంట్లోని, పూజ గదిలోని రాగి దీపాలు, రాగి పాత్రలు, రాగి చెంబులు వంటివన్నీ కొత్తవాటిలా తలతలా మెరిసిపోతూ కనిపిస్తాయి.
రాగి వస్తువులను శుభ్రం చేయడానికి కావాల్సిన పదార్థాలు
- రెండు స్పూన్ల శనగపిండి
- ఒక స్పూన్ ఉప్పు
- ఒక స్పూన్ పసుపు
- అర స్పూన్ నిమ్మరసం
రాగి వస్తువులను శుభ్రం చేసే విధానం..
- రాగి వస్తువులను శుభ్రం చేయడం కోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి, ఉప్పు, పసుపులతో పాటు నిమ్మరసం వేసి బాగా కలపండి.
- దీంట్లో ఒకటి రెండు స్పూన్ల నీటిని కూడా వేసి బాగా కలపండి.
- తర్వాత ఈ మిశ్రమాన్ని మీ పూజా సామాగ్రితో పాటు ఇంట్లోని ఇతర రాగి, ఇత్తడి వస్తువులన్నింటికీ అప్లై చేసి పక్కకు పెట్టిండి.(కేవలం అప్లై చేస్తే చాలు గట్టిగా రుద్దాల్సిన పనేం లేదు)
- పేస్టును అప్లై చేసిన తర్వాత వస్తువులను అలాగే ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టండి.
- తర్వాత చేత్తో సున్నితంగా రుద్దుతూ కడిగేయండి.
అంతే మీ పూజ గదిలోని సామాగ్రితో పాటు ఇంట్లోని ఇతర రాగి, ఇత్తడి వస్తువులన్నీ తలతలా మెరిసిపోతాయి.
మరో పద్ధతిలో కూడా శుభ్రం చేసుకోవచ్చు..
ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే..
- శనగపిండి – నాలుగు స్పూన్లు
- పుల్లటి పెరుగు- నాలుగు స్పూన్లు
- కల్ల ఉప్పు(దొడ్డు ఉప్పు) – ఒక స్పూన్
- నిమ్మరసం- సగం నిమ్మకాయ చెక్క
శుభ్రం చేసే పద్ధతి..
- పైన తెలిపిన పదార్థాలన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకుని బాగా కలుపుకుని చిక్కటి పేస్టులా తయారు చేసుకోండి.
- ఈ పేస్టును మీరు శుభ్రం చేయాలనుకున్న రాగి పాత్రలు, దీపాలు చెంబులు, బాటిల్ వంటి రాగి వస్తువులన్నింటికీ ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.
- అప్లై చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు అలాగే ఉంచేయండి.
- తర్వాత నీటితో ఈ వస్తువులన్నింటినీ శుభ్రంగా కడిగేయండి.
- అంతే మీ రాగ్రి పాత్రలు అన్నీ చక్కగా మెరుస్తూ కనిపిస్తాయి.
ఈ టిప్స్ పాటించారంటే ఎలాంటి శ్రమ లేకుండానే మీ రాగి,ఇత్తడి వస్తువులకు కొత్తదనాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు.
రాగి వస్తువుల వల్ల కలిగే ఉపయోగాలు..
రాగి వస్తువుల్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఆహార పదార్థాలకు ఆయుర్వేద ఉపయోగాలు తోడవుతాయి. అలాగే రాగి వస్తువులను ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కీళ్లనొపపులు, జీర్ణ సమస్యలు, శక్తిహీనత వంటి సమస్యలను నయం చేయడంలో రాగి వస్తువులు, రాగి ఆభరణాలు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత కథనం