



Best Web Hosting Provider In India 2024

Nirmal News : శభాష్ ఆదిత్య, హిమాలయాల్లోని కేదార్ ఖండ్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ కుర్రాడు
Nirmal News : నిర్మల్ పట్టణానికి చెందిన లక్కాకుల ఆదిత్య హిమాలయ పర్వతాలలోని కేదార్ ఖండ్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. 15 రాష్ట్రాలకు చెందిన 300 మందితో కూడిన బృందం హిమాలయ పర్వతాధిరోహణకు బయలుదేరగా… కేవలం ఏడుగురు మాత్రమే శిఖరం పైవరకు చేరుకున్నారు.
Nirmal News : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ లక్కాకుల తుకారాం కుమారుడు లక్కా కుల ఆదిత్య హిమాలయ పర్వతాలలోని కేదార్ ఖండ్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఆదిత్య 12,500 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు 15 రాష్ట్రాలకు చెందిన 300 మందితో కూడిన బృందంతో బయలుదేరాడు. వీరిలో కేవలం ఏడుగురు మాత్రమే శిఖరం పైవరకు చేరుకున్నారు. ఇందులో ఆదిత్య మిగతా వారి కన్నా ముందుగా అధిరోహించి మొదటి స్థానంలో నిలిచాడు.
ఆదిత్య పంజాబ్లోని ఎల్పీయూ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్నాడు. ఆదిత్య దాదాపు 12,500 అడుగుల ఎత్తున ఉన్న సమ్మిట్ క్యాంప్ నకు చేరుకున్నాడు. విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలి మధ్యన ఐదు రాత్రులపాటు శ్రమించి లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపాడు. తెలంగాణ నుంచి 8 మంది వరకు లక్ష్యాన్ని చేరుకోగా ఇందులో నిర్మల్ జిల్లా వాసి ఉండడం విశేషం. పర్వతారోహణ పూర్తయిన అనంతరం యూనివర్సల్ అడ్వెంచర్స్ వారితో ప్రత్యేక ధ్రువీకరణపత్రాన్ని స్వీకరించారు.
తండా నుంచి శాస్త్రవేత్తగా ఎదిగిన యువకుడు
అతనికి కాన్వెంట్ చదువులంటే తెలియదు. కార్పొరేట్ కళాశాలలో చేరలేదు. లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ పొందలేదు. పట్టుదలతో చదివి తన కల సాకారం చేసుకుని శాస్త్రవేత్త అయ్యి యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఆయనే నార్నూర్ మండ ‘లంలోని మహాగావ్ తండాకు చెందిన చౌహాన్ ఆకాశ్, ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ అసోసియేట్ సైంటిస్ట్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ (సీ-మెట్), హైదరాబాద్ కు ఎంపికయ్యాడు. 15 రోజుల క్రితం శాస్త్రవేత్తగా విధులు చేరాడు. ఈయన తల్లిదండ్రులు జీజాబాయి, ప్రహ్లాద్. వీరికి ఇద్దరు సంతానం. వ్యవసా యం చేస్తూ వారిని కష్టపడి చదివించారు.
చిన్న కుమారుడైన ఆకాశ్ 1 నుంచి పదో తరగతి వరకు నార్నూర్ ప్రభుత్వ పాఠశాల లో చదివాడు. ఐటీడీఏ సహకారంతో హైదరాబాద్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ఏఐఈఈఈ పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 178వ ర్యాంకు సాధించి వరంగల్ నిట్లో బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో చేరి మెటీరియల్ ఇంజినీరింగ్లో ఐదేళ్లపాటు పరిశోధన చేశాడు. ప్రస్తుతం సీమెట్లో రీసెర్చ్ అసోసియేట్, సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. తండా నుంచి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆకాశ్ ని గ్రామస్తులు అభినందించారు.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడిదలాబాద్ జిల్లా హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్