Maha shivaratri Wishes: భక్తితో నిండిన శివరాత్రి శుభాకాంక్షలను మీ ప్రియమైన వారికి పంపండి

Best Web Hosting Provider In India 2024

Maha shivaratri Wishes: భక్తితో నిండిన శివరాత్రి శుభాకాంక్షలను మీ ప్రియమైన వారికి పంపండి

Haritha Chappa HT Telugu
Feb 26, 2025 05:00 AM IST

Maha shivaratri Wishes: మహాశివరాత్రి పవిత్రమైన పండుగ. శివరాత్రి సందర్భంగా మీ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు పంపాలనుకుంటున్నారా? ఇక్కడ భక్తితో నిండిన విషెస్ ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన శుభాకాంక్షలను ఎంపిక మీ ప్రియమైన వారికి పంపండి.

మహా శివరాత్రి శుభాకాంక్షలు
మహా శివరాత్రి శుభాకాంక్షలు (Pixabay)

మహాశివరాత్రి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. భారతదేశంలోని ప్రతి మూల శివరాత్రి రోజు శివునికి అభిషేకాలు, పూజలు, ఉపవాసాలు, జాగరణలు చేస్తారు. ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని అంటారు. ధార్మిక నమ్మకాల ప్రకారం ఈ రోజునే శివుడు, పార్వతిల వివాహం జరిగింది.

పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తమ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు భోళానాథుడు, పార్వతి ఆశీర్వాదాలను మీ ప్రియమైన వారికి పంచాలనుకుంటే, మహాశివరాత్రి సందేశాలు, కోట్స్ మీకు సహాయపడతాయి.

మహా శివరాత్రి శుభాకాంక్షలు

1. శివుడే సత్యం, శివుడే అనంతం,

శివుడే ఆది, శివుడే భగవంతుడు,

శివుడే ఓంకారం, శివుడే బ్రహ్మం,

శివుడే శక్తి, శివుడే భక్తి.

మహాశివరాత్రి శుభాకాంక్షలు.

2. ఓం లోనే విశ్వాసం, ఓం లోనే నమ్మకం

ఓం లోనే శక్తి, ఓం లోనే సమస్త ప్రపంచం

ఓం తోనే మంచి రోజు ప్రారంభం

జై శివ శంకర్!

హ్యాపీ మహాశివరాత్రి!

3. శివుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి,

మీకు అదృష్టం దక్కాలి

జీవితంలో మీరు కోరుకున్నది లభించాలి,

ఓం నమః శివాయ!

మహాశివరాత్రి శుభాకాంక్షలు.

4. కాలం నువ్వే, మహాకాలుడివి కూడా నువ్వే

లోకం నువ్వే, త్రిలోకం కూడా నువ్వే

శివుడు నువ్వే, సత్యం కూడా నువ్వే!

మహాశివరాత్రి శుభాకాంక్షలు.

5-ఒక పుష్పం

ఒక బిల్వపత్రం

ఒక కలశం నీరు

భోళా శివుడికి ఇవి సమర్పిస్తే చాలు

అతడు మిమ్మల్ని రక్షిస్తాడు!

మహాశివరాత్రి శుభాకాంక్షలు.

6. భోళానాథుని అనుగ్రహంతో

మీ జీవితం ఆనందంతో నిండిపోవాలి,

శివుని మహిమతో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలి,

మహాశివరాత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు!

7. దుష్టులకే శిక్ష

మహాకాల భక్తులకు ఎప్పుడూ రక్షే

జై మహాకాల! మహాశివరాత్రి శుభాకాంక్షలు

8. కైలాశరణ శివ చంద్రమౌళి

ఫణీంద్ర మాతా ముకుటీ జలాలీ

కారుణ్య సింధు భవ దుఃఖ హారీ

తుజవీన శంభో మజ కోన తారీ

మీకు మీ కుటుంబసభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు

9. గౌరీ వల్లభ కామారే

కాల కూట విషాసన

మాం ఉద్ధరే పదాంభోజే

త్రిపుర అజ్ఞాత కాంటక

మహా శివరాత్రి శుభాకాంక్షలు

10. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ ధిగంబరాయ

తస్మై న కారాయ నమశివాయ నమ శివాయ

మీకు శివరాత్రి శుభాకాంక్షలు

11. వామదేవం మహాదేవం లోకనాథం

జగత్గురుం నమామి శిరసదేవంకిమ్నో

మృత్యు కరిష్యతే

హ్యాపీ మహా శివరాత్రి

12. నీలకంఠం విరూపాక్షం నిర్మలం

నిలయప్రదత్తం నమామి శిరస దేవం

కిమ్నో మృత్యు కరిష్యతీ

మీకు మీ కుటుంబసభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు

13. స్వచ్ఛమైన హృదయంతో శివుడిని పూజించండి,

ఆయన మీకు శాంతిని అనుగ్రహిస్తాడు

మీకు మీ కుటుంబానికి శివరాత్రి శుభాకాంక్షలు

14. ఈ మహా శివరాత్రి మీ మార్గంలోని

అన్ని అడ్డంకులను తొలగించి,

అంతులేని ఆనందాన్ని కలిగించుగాక

హ్యాపీ శివరాత్రి

15. ఈ శివరాత్రికి

మీరు బలం, జ్ఞానం, ఆనందాన్ని పొందాలని

శివుని ఆశీస్సులు మీకు లభించాలని

మహాశివరాత్రి శుభాకాంక్షలు

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024