



Best Web Hosting Provider In India 2024

Mazaka: యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ నాకు చాలా నచ్చుతున్నాయి, అందుకే ఇలా.. మజాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన కామెంట్స్
Mazaka Director Trinadha Rao Nakkina On YouTube Private Songs: సందీప్ కిషన్, రీతు వర్మ జోడీగా తెరకెక్కిన మాస్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ మజాకా. ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్‌పై కామెంట్స్ చేశారు.
Mazaka Director Trinadha Rao Nakkina On YouTube Private Songs: యంగ్ హీరో సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మాస్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం మజాకా. ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు.
ఇవాళ మజాకా రిలీజ్
సందీప్ కిషన్ కెరీర్‌లో 30వ సినిమాగా వస్తోన్న మజాకా సినిమా ఇవాళ (ఫిబ్రవరి 26) మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 25) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన. ఈ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పిన ఆయన యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్‌పై కామెంట్స్ చేశారు.
మజాకా ఎలా ఉండబోతోంది?
-మజాకా వందశాతం హిట్ ఫిల్మ్. ఆ రేంజ్ ఏమిటనేది ఫస్ట్ షో పడ్డాక డిసైడ్ అవుతుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారంతా సూపర్ ఉంది. హిట్ ఫిల్మ్ అన్నారు.
మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి పబ్లిసిటీ టైం సరిపోలేదనిపిస్తోంది?
-టైం తక్కువైన మాట నిజమే. నిర్మాతలు వాళ్ల బెస్ట్ ఎఫర్ట్ పెట్టారు. శివరాత్రికి రిలీజ్ చేయాలని అందరం డే అండ్ నైట్ కష్టపడ్డాం. శివరాత్రి ఈ సినిమాకి మంచి డేట్.
ఈ కథ ఎప్పుడు విన్నారు?
-‘ధమాకా‘ సమయంలోనే ప్రసన్న కుమార్ ఈ కథ చెప్పారు. రావు రమేష్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. హీరోగా ఎవరు చేస్తారని అడిగాను. ఈ కథ కొందరి దగ్గరరికి వెళ్లింది. ఫైనల్‌గా రావు రమేష్ గారి కాంబినేషన్‌లోనే వచ్చింది. నిజానికి ఈ కథని సందీప్ కిషన్ ఒప్పుకోవడం చాలా గ్రేట్.
ఈ కథకి బ్రోడాడీ స్ఫూర్తి ఉందా?
-లేదండీ. నేను ఆ సినిమా చూశాను. ఆ కథే వేరు ఇది వేరు.
మజాకా కథ ఏమిటి?
-సింగిల్ లైన్‌లో చెప్పాలంటే.. ఆడదిక్కులేని ఇద్దరు మగాళ్లు ఎప్పటికైన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలనుకునే వారి తపనే ఈ కథ. దిని కోసం వాళ్లు పడే బాధలు, ప్రయత్నాలు ఫుల్ ఫన్ జోన్‌లో ఉంటాయి. చివరి ఇరవై నిముషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.
రాములమ్మ పాట సెలెక్షన్ మీదేనా?
-అవును. నాకు యూట్యూబ్‌లో ప్రైవేట్ ఆల్బమ్స్ (సాంగ్స్) చాలా నచ్చుతున్నాయి. చాలా చక్కగా చేస్తున్నారు. అలా జనాల్లోకి వెళ్లిన ఓ పాటని మళ్లీ మన స్టయిల్‌లో వినిపిస్తే బావుంటుందనే ఆలోచనతో ఆ పాటని చేశాం. నిజానికి అలా యూట్యూబ్‌లో హిట్ అయిన ఓ నాలుగు పాటలు ఒక సినిమాలో పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. మంచి కమర్షియల్ కథ కుదిరితే అలా చేయొచ్చు.
సంబంధిత కథనం