


Best Web Hosting Provider In India 2024

OTT: ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 8.3 ఐఎండీబీ రేటింగ్- తలలు నరికి తీసుకెళ్లే సైకో- టాప్ 1లో ట్రెండింగ్!
Dhakshina OTT Streaming And Trending In Top 1 Place: ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దక్షణి. కబాలి ఫేమ్ సాయి ధన్సిక నటించిన సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ దక్షిణ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన నాలుగు రోజుల్లోనే టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. అలాగే, ఐఎండీబీ 8.3 రేటింగ్ ఇచ్చింది.
Dhakshina OTT Release And Trending In Top 1 Place: ఓటీటీల కంటెంట్‌పై ఆడియెన్స్ అమితంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అలాగే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి.
టాప్ 1 ప్లేస్‌లో ఓటీటీ ట్రెండింగ్
ఇటీవల మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన నాలుగు రోజుల్లోనే టాప్ 1 ప్లేస్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రజనీకాంత్ కబాలి ఫేమ్ సాయి ధన్సిక నటించిన తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ దక్షిణ. ఈ సినిమాకు ‘మంత్ర’ ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించారు.
లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో
గతేడాది అక్టోబర్ 4న రిలీజై మంచి టాక్ సంపాదించుకున్న దక్షిణ మూవీ ఇటీవల ఓటీటీ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 21 నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో దక్షిణ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదివరకు లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు డబ్బింగ్ సినిమాలు చాలా ఉన్నాయి. అయితే, ఇలా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓ తెలుగు మూవీ ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ అయిన లయన్స్ గేట్ ప్లేలోకి స్ట్రీమింగ్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి.
తలలను వేరు చేసి
ఇకపోతే లయన్స్ గేట్ ప్లేలో టాప్ 1 ప్లేసులో దక్షిణ ఓటీటీ ట్రెండింగ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. లయన్స్ గేట్ ప్లేలో దక్షిణ ఓటీటీ రిలీజ్ అయిన నాలుగైదు రోజుల్లోనే టాప్ 1లోకి ట్రెండింగ్‌కు వచ్చి అదరగొడుతోంది. అమ్మాయులనే టార్గెట్ చేసిన ఓ సైకో వారి తలలు నరికి తీసుకెళ్లిపోతుంటాడు. అమ్మాయిల తలలను వేరు చేసి మొండెలాను మాత్రం వదిలేసే వంటి హారిఫిక్ క్రైమ్ సీన్స్‌తో దక్షిణ సాగుతుంది.
మద్యానికి బానిస అయిన పోలీస్
దక్షిణ కథ చూస్తే.. వైజాగ్ సిటీలో సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను హత్య చేస్తుంటాడు. సంబంధిత కేసును ఏసీబీ దక్షిణ (సాయి ధన్సిక) టేకప్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి..?, హించని విధంగా ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. దీంతో పోలీస్ జాబ్‌కు రిజైన్ చేసి మద్యానికి బానిసవుతుంది.
దక్షిణ మూవీ ట్విస్టులు, హైలెట్స్
ఆ తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి.?, ఆ కిల్లర్‌కు, దక్షిణకు ఉన్న సంబంధం ఏంటి.? సైకో కిల్లర్‌ను దక్షిణ పట్టుకుందా.? కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను అంత దారుణంగా చంపాడు? వారికి అతనికి ఉన్న సంబంధం ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.
దక్షిణ ఐఎండీబీ రేటింగ్
ఇకపోతే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోన్న దక్షిణ సినిమాకు ఐఎండీబీ నుంచి ఏకంగా 8.3 రేటింగ్ వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు ఎంత థ్రిల్లింగ్ కంటెంట్ ఉందనేది. కాగా దక్షిణ సినిమాలో సాయి ధన్సికతోపాటు స్నేహా సింగ్, రిషవ్ బసు, అంకిత ములర్, హిమ శైలజ, కరుణ, మేఘన చౌదరి, నవీన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం
టాపిక్