Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: బాలుకు అడ్డంగా దొరికిపోయిన మనోజ్ – ప్రభావతికి పంచ్ – మీనాపై రోహిణి జెలసీ
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో మీనా పూల కొట్టుకు సంబంధించిన పాంప్లెంట్స్ పంచడానికి పార్కుకు వస్తాడు బాలు. అక్కడ మనోజ్‌ను చూస్తాడు. జాబ్ అంటూ అబద్ధం చెప్పి రోజు పార్కుకు వచ్చిన మనోజ్ టైమ్‌పాస్ చేస్తోన్న సంగతి వాచ్‌మెన్ ద్వారా తెలుసుకుంటాడు బాలు.
పూల దండల కోసం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపు కొడతారు. దండలు లేవు ఏం లేవు వెళ్లిపొమ్మని వాళ్లను కసురుకుంటుంది ప్రభావతి. నేను మీకు పూలు అమ్మే దానిలా కనిపిస్తున్నానా అని అంటుంది. ప్రభావతి అంటే ఎవరు అని వచ్చిన వాళ్లు అడుగుతారు. నేను అని బదులిస్తుంది. అయితే పూల షాప్‌కు మీ పేరే ఉంది కదా అని వాళ్లు అంటారు. అది నా పేరుకు పట్టిన దరిద్రమని, ప్రొప్రైటర్ లేదని పూలు అమ్మడం కుదరదని వచ్చిన వాళ్లతో కోపంగా అంటుంది ప్రభావతి.
పూలు అమ్మేదానివి నీకు అంత కోపం పనికిరాదని కస్టమర్స్ క్లాస్ ఇస్తారు. పెద్ద కోటీశ్వరురాలిగా బిల్డప్‌లు ఇస్తున్నావేంటి అని ప్రభావతి గాలి తీసేస్తారు. మీనా పూల కొట్టువల్లే తనకు ఇన్ని కష్టాలు అని కోపంతో చిందులు తొక్కుతుంది. . మీనా షాప్‌కు ముగింపు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది.
మీనా ఆన్సర్…
బాలు సోఫాపై కూర్చొని టిఫిన్ చేస్తుంటాడు. డైనింగ్ టేబుల్ అక్కడుందని ప్రభావతి అంటుంది. దానిపై నాలుగు గబ్బిలాలు ఉన్నాయని మనోజ్, రోహిణితో పాటు శృతి, రవిపై సెటైర్లు వేస్తాడు బాలు. చట్నీ కోసం మీనాను పిలుస్తుంది రోహిణి. పక్కనే ఉంది కదా నువ్వే వేసుకో అని మీనా ఆన్సర్ ఇస్తుంది. ఏంటి ఆ సమాధానం అని మీనాపై ప్రభావతిపై ఫైర్ అవుతుంది.
మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారని, నాకు మాత్రం నిద్ర లేకుండా చేశావని మీనాను కోప్పడుతుంది ప్రభావతి. ఇంటి ముందు పూల కొట్టు పెట్టి ప్రశాంతత లేకుండా చేశావని అంటుంది. రాత్రి పూట ఎవరో వచ్చి దండలు కావాలని అడిగి తనను నానా మాటలు అన్నారని జరిగిన సంగతి చెబుతుంది. పూలు అమ్మేకునేవాళ్లు అని నువ్వు మీనా పుట్టింటి వాళ్లను తిడతావుగా…ఇప్పుడు ఆ బాధ ఏమిటో నీకు అర్థమైందా అని బాలు అంటాడు.
కష్టపడి సంపాదిస్తున్నా…
వీధిలో అందరూ ప్రభావతి పూటకొట్టులో పూలు బాగున్నాయని అంటుంటే నీకు అవమానంగా అనిపిస్తుందని రచ్చ చేస్తుంది. అందులో అవమానం ఏముంది…నేనేం తప్పు చేయడం లేదని, కష్టపడి సంపాదిస్తున్నానని మీనా బదులిస్తుంది. నీ కష్టం వల్లే నాకు అవమానం…రాను రాను నీకు నోరు ఎక్కువైపోతుందని మీనాపై కోపంతో ఎగిరిపడుతుంది.
అరిస్తే భయపడరు…
నోరు ఎక్కువ కావడం గురించి నువ్వే మాట్లాడాలి అని బాలు బదులిస్తాడు. నువ్వు అరిస్తే ఎవరూ భయపడరని ఆన్సర్ ఇస్తాడు. కస్టమర్స్ డే టైమ్ వస్తే సమస్య లేదు కానీ…నైట్ టైమ్ వస్తే ప్రాబ్లమే కదా అని శృతి అంటుంది. మా అమ్మకు ఆవిడ పేరుతో షాప్ పెట్టమన్నదే అసలు బాధ, ఈ గొడవలో నువ్వు జోక్యం చేసుకోవడం మంచిది కాదని శృతితో అంటాడు రవి.
పెద్ద కంపెనీలోజాబ్…
ఎక్కడ చోటు దొరకనట్లు ఇంటి ముందే షాప్ పెట్టారని మనోజ్ అంటాడు. తాను పెద్ద కంపెనీలో పనిచేస్తున్నానని, తనను కలవడానికి వచ్చిన వాళ్లు ఏం అనుకుంటారని బిల్డప్‌లు ఇస్తాడు. నిన్ను చూడటానికి ఇప్పటివరకు ఒక్క కుక్క రాలేదని, మనుషులు ఎలా వస్తారని కౌంటర్ ఇస్తాడు బాలు. నీ భార్య పార్లర్ పెట్టుకుంది అది నీకు గొప్ప…నా భార్య పూల కొట్టు పెట్టుకుంది అది నాకు గొప్ప…పూల కొట్టు పెడితే నీకు ఎలా అవమానం అవుతుందని క్లాస్ ఇస్తాడు. తన మాటలతో అందరి నోళ్లు మూయిస్తాడు బాలు. ఇక నుంచి ఎవరైనా దండ కావాలని వస్తే ఎవరైనా వస్తే బాగోదని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.
రోహిణి జెలసీ…
మీనా పూల షాప్ గిరాకీ చూసి జెలసీగా ఫీలవుతుంది రోహిణి. మీనా సంపాదిస్తే మనకు విలువ ఏం ఉంటుంది. అబద్దాలు చెప్పేవాళ్లు…మోసం చేసేవాళ్లు పైకి గొప్పగా ఉన్నట్లు నటించేవాళ్లు చాలా మంది ఉంటారు. వారి కంటే మీనా గ్రేట్ అని, చాలా కష్టపడి సంపాదిస్తుందని శృతి సపోర్ట్ చేస్తుంది.
దొరికిపోయిన మనోజ్…
మీనా పూల షాప్‌కు సంబంధించిన పాంప్లెంట్స్‌ను పంచడానికి పార్క్‌కు వస్తాడు బాలు. వాచ్‌మెన్‌కు పాంప్లెంట్స్ ఇస్తాడు. ఆ పార్క్‌లో మనోజ్‌ను చూస్తాడు బాలు. తన స్నేహితులతో కూర్చొని కబుర్లు చెబుతూ కనిపిస్తాడు. డ్యూటీకి వెళుతున్నామని చెప్పి రోజు పార్క్‌కు వచ్చి సాయంత్రం వరకు టైమ్‌పాస్ చేస్తారని మనోజ్‌ను చూపిస్తూ అసలు నిజం బయటపెడతాడు వాచ్‌మెన్.
ఓపెన్ చేయడానికంటే ముందే మనోజ్ రోజు పార్కుకు వస్తుంటాడని చెబుతాడు. రెండు, మూడు నెలల నుంచి ఈ వ్యవహారం సాగుతుందని అంటాడు. వాచ్ మెన్ మాటలతో పాటు ఫ్రెండ్‌తో కలిసి మనోజ్ ఆడుతోన్న గేమ్స్‌ను బాలు ఫోన్‌లో రికార్డ్ చేస్తాడు. లంచ్ చేసి పార్క్‌లోని ఊయలలో నిద్రపోతాడు మనోజ్.
ఈ రోజు బాగా ఏంజాయ్ చేశామని, రేపు కలుద్దామని తన ఫ్రెండ్‌తో చెప్పి మనోజ్ పార్కు నుంచి బయలుదేరుతాడు.
షార్ట్ ఫిల్మ్…
కుటుంబసభ్యులందరిని పిలుస్తాడు బాలు. అందమైన, అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ చూపిస్తానని చెప్పి మనోజ్ పార్కులో టైమ్‌పాస్ చేస్తున్న వీడియోను చూపిస్తాడు. మనోజ్ పార్కులో ఏం చేస్తున్నాడని సత్యం అంటాడు. పెద్ద ఉద్యోగం అని బాలు అంటాడు. మీ ఆయన వెలగబెడుతున్న ఉద్యోగం చాలా బాగుందని రోహిణితో అంటుంది మీనా.
మనోజ్ మోసం బయటపడటంతో రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనోజ్ జాబ్ చేయకుండా పార్కులో టైమ్‌పాస్ చేస్తోన్న విషయం అమ్మకు ఎప్పటి నుంచో తెలుసునని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం