


Best Web Hosting Provider In India 2024

Mazaka Review: మజాకా రివ్యూ – సందీప్ కిషన్, రీతూ వర్మ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Mazaka Review: సందీప్‌కిషన్ హీరోగా నటించిన మజాకా మూవీ బుధవారం థియేటర్లలో రిలీజైంది. త్రినథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Mazaka Review సందీప్‌కిషన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన మజాకా మూవీ శివరాత్రి సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో రావురమేష్, అన్షు (మన్మథుడు ఫేమ్) కీలక పాత్రలు పోషించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. మజాకా ఏ మేరకు ఆడియెన్స్‌ను నవ్వించింది? సందీప్‌కిషన్‌కు హిట్టు దక్కిందా? లేదా? అంటే?
తండ్రీకొడుకుల కథ…
వెంకటరమణ (రావురమేష్) భార్య చనిపోతుంది. మరో పెళ్లి చేసుకోకుండా కొడుకు కృష్ణను(సందీప్‌కిషన్) పెంచి పెద్ద చేస్తాడు. కృష్ణకు గ్రాండ్‌గా పెళ్లి జరిపించి ఫ్యామిలీ ఫొటోను ఇంట్లో పెట్టుకోవాలన్నది వెంకట రమణ కల. కానీ కృష్ణకు ఒక్క పెళ్లి సంబంధం సెట్ కాదు. ఆడదిక్కు లేకుండా ఇద్దరు మగాళ్లు ఉన్న ఇంట్లోకి అమ్మాయిని పంపించేది లేదంటూ చాలా మంది రిజెక్ట్ చేస్తుంటారు.
బీచ్‌లో మీరాను (రీతూ వర్మ) చూసిన కృష్ణ ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు. మరోవైపు మిడిల్ ఏజ్‌లో వెంకటరమణ యశోద (అన్షు) అనే మహిళతో ప్రేమలో పడతాడు. అనుకోకుండా వీసా వర్క్ కోసం తన ఆఫీస్‌కే వచ్చిన యశోదతో పరిచయం పెంచుకుంటాడు. అప్పటి నుంచి యశోదను ఫాలో కావడమే పనిగా పెట్టుకుంటాడు.
తండ్రి ప్రేమ కథ తెలిసి కృష్ణ ఏం చేశాడు? మీరాకు కృష్ణ…యశోదకు రమణ తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎలాంటి పాట్లు పడ్డారు? మీరా,యశోద ఒకే ఇంట్లో ఎందుకు ఉన్నారు? వాళ్ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వెంకటరమణ, కృష్ణలపై భార్గవ వర్మ పగతో రలిగిపోవడానికి కారణం ఏమిటన్నదేఈ మూవీ కథ.
కామెడీతో మ్యాజిక్…
లాజిక్స్‌తో పాటు సంబంధం కామెడీతో మ్యాజిక్ చేస్తూ హిట్టు కొట్టచ్చని ఇటీవల కాలంలో రిలీజైన పలు సినిమాలు రుజువు చేశాయి. ఆ సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ వచ్చిన మూవీ మజాకా. సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌ను రెండున్నర గంటలు ఎంటర్‌టైన్ చేస్తే చాలనే లక్ష్యంతోనే చేసిన సినిమా ఇది.
బోలెడంత డ్రామా…
మజాకాలోని పాయింట్‌ను ఎమోషనల్‌గా కూడా చెప్పొచ్చు. తండ్రీకొడుకుల కథలో బోలెడంత డ్రామా ఉంది. దర్శకరచయితలు మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ దారినే ఎంచుకున్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ నుంచి కామెడీ జనరేట్ అయ్యేలా సీన్లు రాసుకున్నారు.
సందీప కిషన్, రావురమేష్ ఇద్దరు ప్రేమలో పడటం, తమ ప్రేమను వ్యక్తం చేయడానికి వారు పడే పాట్లు, ప్రేమలేఖలు రాయడం లాంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది.కథ అంటూ పెద్దగా లేకపోయినా కామెడీతో నెట్టుకొచ్చాడు డైరెక్టర్.
ఇంటర్వెల్ ట్విస్ట్…
మీరా, యశోద ఇద్దరు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రివీలయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. వారిమధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? తమ ఫ్యామిలీతో పగపై రగిలిపోతున్న భార్గవవర్మకు ఆ కుటుంబానికి సంబంధం ఉందంటూ సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తించారు.
కీలకమైన సెకండాఫ్‌లో కామెడీతో పాటు డ్రామా సరిగ్గా పండలేదు. చాలా వరకు కామెడీ ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తుంది. మీరా, యశోద ఒకరంటే మరొకరికి ఎందుకు పడదు? వారిని కలపడం కోసం కృష్ణ, రమణ ఏం చేశారన్నది ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా చెబితే బాగుండేది. కామెడీపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల కథలో ఎమోషన్స్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. రావురమేష్, రీతూవర్మ కాంబినేషన్‌లో వచ్చే ఓ సీన్ మాత్రం ఉద్వేగభరితంగా సాగుతంది. అలాంటివి మరికొన్ని పడుంటే బాగుంటేది.
ఇరికించినట్లుగా…
కామెడీ విషయంలో కొన్ని ఎపిసోడ్స్ హిలేరియస్‌గా అనిపిస్తే మరికొన్ని మాత్రం తెచ్చిపెట్టినట్లుగా అనిపిస్తాయి. నవ్వించాలనే ఆలోచనతో బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. గతంలో తెలుగులో వచ్చిన పలు కామెడీ సినిమాలను మజాకా గుర్తుచేస్తుంది.
కామెడీ టైమింగ్…
సందీప్‌కిషన్‌కు ఇలాంటి జోవియల్ క్యారెక్టర్లు అలవాటే. కృష్ణ పాత్రలో కామెడీ టైమింగ్ బాగుంది. హీరోకు సమానంగా కనిపించే క్యారెక్టర్‌లో రావురమేష్ మెప్పించాడు. మిడిల్ ఏజ్‌లో ప్రేమలో పడే వ్యక్తిగా నవ్వించాడు. కొన్ని ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. సందీప్‌కిషన్, రావురమేష్ ఇద్దరు పోటీపడి నటించారు. రీతూవర్మ కమర్షియల్ హీరోయిన్ టైప్ క్యారెక్టర్‌లో కనిపించింది. మాజాకా మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అన్షు ఉన్నంతలో మెప్పించింది. యాక్టింగ్ పరంగా పెద్దగా స్కోప్ లేని పాత్రల్లో రీతూవర్మ, అన్షు కనిపించారు. హైపర్ ఆది, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. లియోన్ జేమ్స్ పాటలు ఓకే.
క్లీన్ కామెడీ…
కథ, కథనాల గురించి పెద్దగా ఆలోచించకుండా ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ఆడియెన్స్‌కు మజాకా నచ్చుతుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా క్లీన్ కామెడీతో తెరకెక్కిన మూవీ ఇది.
రేటింగ్: 2.5/5
సంబంధిత కథనం