Mahesh Babu: మ‌హేష్‌బాబు తండ్రిగా ర‌జ‌నీకాంత్ – సూప‌ర్ కాంబో మిస్ – త‌లైవార్ రిజెక్ట్ చేసిన తెలుగు మూవీ ఏదో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Mahesh Babu: మ‌హేష్‌బాబు తండ్రిగా ర‌జ‌నీకాంత్ – సూప‌ర్ కాంబో మిస్ – త‌లైవార్ రిజెక్ట్ చేసిన తెలుగు మూవీ ఏదో తెలుసా?

Nelki Naresh HT Telugu
Feb 26, 2025 01:56 PM IST

వెంక‌టేష్, మ‌హేష్‌బాబు హీరోలుగా న‌టించిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీ మార్చి 7న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్ చేసిన‌ తండ్రి పాత్ర కోసం ర‌జ‌నీకాంత్‌ను తీసుకోవాల‌ని డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల అనుకున్నారు. ర‌జ‌నీకాంత్‌కు క‌థ కూడా వినిపించారు. కానీ…

రజనీకాంత్, మహేష్ బాబు
రజనీకాంత్, మహేష్ బాబు

మ‌హేష్‌బాబు కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఒక‌టి. వెంక‌టేష్‌, మ‌హేష్‌బాబు హీరోలుగా న‌టించిన ఈ మూవీ 2013లోనే యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నంది, ఫిల్మ్‌పేర్‌తో పాటు అనేక అవార్డుల‌ను గెలుచుకుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దిల్‌రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ కోసం…

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీలో స‌మంత‌, అంజ‌లి హీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీలో మ‌హేష్‌బాబు, వెంక‌టేష్‌ల‌కు తండ్రి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించారు. అయితే ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌ కోసం తొలుత ర‌జ‌నీకాంత్‌ను తీసుకోవాల‌ని భావించార‌ట ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల‌. ర‌జ‌నీకాంత్‌కు క‌థ కూడా వినిపించార‌ట‌.

ర‌జ‌నీకాంత్‌కు న‌చ్చింది…

మ‌హేష్‌బాబు, వెంక‌టేష్‌ల‌కు ఫాద‌ర్‌గా ర‌జ‌నీకాంత్ అయితేనే బాగుంటుంద‌ని అనిపించింది. క‌థ విన‌డానికి ర‌జ‌నీకాంత్ కూడా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు క‌థ ర‌జ‌నీకాంత్‌కు న‌చ్చింది. తెలుగులో సినిమా చేయ‌డానికి నాకు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పారు.

తండ్రిగా న‌టించ‌డానికి సుముఖ‌త చూపించారు. కానీ ఆ టైమ్‌లో ర‌జ‌నీకాంత్‌గారికి ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతో ఈ సినిమా చేయ‌లేక‌పోయార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల చెప్పిన పాత వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

డైరెక్ట‌ర్ శంక‌ర్ ద్వారా…

ర‌జ‌నీకాంత్ లాంటి ఇమేజ్ ఉన్న యాక్ట‌ర్ అయితేనే ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌ రిక్షావాళ్ల ద‌గ్గ‌ర నుంచి కోటీశ్వ‌రుల వ‌ర‌కు అంద‌రికి రీచ్ అవుతుంద‌ని అనిపించింది. అందుకే ర‌జ‌నీకాంత్‌ను అప్రోచ్ అయ్యాన‌ని శ్రీకాంత్ అడ్డాల ఈ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు, డైరెక్ట‌ర్ శంక‌ర్ ద్వారా ర‌జ‌నీకాంత్ అపాయింట్‌మెంట్ దొరికింద‌ని తెలిపాడు.

ర‌జ‌నీకాంత్ సినిమా చేయ‌లేక‌పోయినా ఆయ‌న‌కు క‌థ చెప్పాన‌నే సంతృప్తి మాత్రం దొరికింద‌ని అన్నాడు.ర‌జ‌నీకాంత్ రిజెక్ట్ చేయ‌డంతో ఈ రోల్ కోసం ప్ర‌కాష్ రాజ్‌ను సెలెక్ట్ చేశారు. ర‌జ‌నీకాంత్ గురించి శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఈ సీక్రెట్ తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

మార్చి 7న రీ రిలీజ్‌

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీ మార్చి 7న రీ రిలీజ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత ఈ మూవీ మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024