


Best Web Hosting Provider In India 2024

Pathaan Prequel: షారుక్ ఖాన్ పఠాన్ విలన్ పాత్రపై సెపరేట్‌గా ప్రీక్వెల్ మూవీ.. హింట్ ఇచ్చిన జాన్ అబ్రహం!
John Abraham Hints Pathaan Prequel On His Character Jim: షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా జాన్ అబ్రహం విలన్‌గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్ 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే, పఠాన్ విలన్ పాత్రపై మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కించనున్నట్లు జాన్ అబ్రహం హింట్ ఇచ్చాడు.
John Abraham Hints Shahrukh Khan Pathaan Prequel: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన పఠాన్ 2023లో విడుదలైన బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో షారుక్, దీపికా కెమిస్ట్రీ, యాక్షన్స్ అదిరిపోగా విలన్‌గా జాన్ అబ్రహం ఎంతగానో ఆకట్టుకున్నాడు.
పఠాన్‌కు ప్రీక్వెల్
సొంత సంస్థ తనను ఆదుకోలేదన్న కోపంతో రగిలిపోయే జిమ్ పాత్రలో ఆవేదన, ఆక్రోషం, పగ వంటి ఎమోషన్స్‌ను జాన్ అబ్రహం బాగా పలికించాడు. అయితే, ఇప్పుడు ఆ పాత్రపై సెపరేట్‌గా సినిమా తెరకెక్కించునన్నారట. ఈ విలన్ రోల్‌పైనే పఠాన్‌కు ప్రీక్వెల్ తీసే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు జాన్ అబ్రహం.
లేని పఠాన్ సీక్వెల్
హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్ తన పాత్ర జిమ్‌తో పఠాన్ ప్రీక్వెల్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. అయితే, అయితే పఠాన్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మాత్రం చెప్పలేదు. అలాగే, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్, ఇన్నేళ్లుగా తనకు వచ్చిన పాత్రల గురించి చెప్పుకొచ్చాడు జాన్ అబ్రహం.
సరిగ్గా అర్థం చేసుకుంటాడని
పఠాన్ గురించి జాన్ అబ్రహం మాట్లాడుతూ.. “పఠాన్ నిజంగా చాలా కూల్ అండ్ చాలా స్పెషల్ సినిమా. ఆది (ఆదిత్య చోప్రా), నేను కలిసి ధూమ్, కాబూల్ ఎక్స్‌ప్రెస్, న్యూయార్క్ సినిమాలు చేశాం. ఆ తర్వాత వచ్చిందే పఠాన్. అతను (ఆదిత్య చోప్రా) నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను. అతనికి ఓపిక నశించకముందే మేము జిమ్ పాత్రతో ప్రీక్వెల్ చేస్తామని ఆశిస్తున్నాను. అది కచ్చితంగా జరగాలి” అని చెప్పాడు.
జిమ్ పాత్రతో
ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో జాన్ అబ్రహం కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో పఠాన్‌కు ప్రీక్వెల్‌గా జిమ్ పాత్రతో ఓ సినిమా కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా సమర్పణలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా పఠాన్.
ప్రీక్వెల్ అవసరమని
అంతకుముందు పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ ఆనంద్ కూడా పఠాన్ ప్రీక్వెల్ అవకాశాల గురించి మాట్లాడారు. “ప్రీక్వెల్ ఉండాలి. కానీ, దాని గురించి ఏదైనా మాట్లాడటం తొందరపాటుతనం అవుతుంది. జిమ్ పాత్రకు ప్రీక్వెల్ అవసరమని నా అభిప్రాయం” అని సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు.
7 రోజుల్లో 634 కోట్లు
ఇకపోతే పఠాన్ సినిమా విడుదలైన ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 634 కోట్లతో హిందీ సినిమా బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ఇందులో జాన్ అబ్రహం ప్రతినాయకుడుగా నటించి షారుక్ ఖాన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. కాగా, జాన్ అబ్రహం చివరిసారిగా వేద సినిమా చేశాడు.
ది డిప్లోమాట్ రిలీజ్ డేట్
ఇప్పుడు జాన్ అబ్రహం నటిస్తున్న సినిమా ది డిప్లోమాట్. రియల్ లైఫ్ ఇండియన్ దౌత్యవేత్త జేపీ సింగ్ పాత్రలో నటిస్తున్న ది డిప్లోమాట్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమా మొదట మార్చి 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, దానిని హోలీ సందర్భంగా రిలీజ్ చేయాలని డేట్ మార్చారు. కాబట్టి, మార్చి 14న ది డిప్లోమాట్ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం