Shreya Ghoshal: అలాంటి ఐటెమ్ సాంగ్ పాడినందుకు సిగ్గుగా అనిపించింది.. పిల్లలూ పాడేస్తున్నారు.. ఇది సరికాదు: శ్రేయా ఘోషాల్

Best Web Hosting Provider In India 2024

Shreya Ghoshal: అలాంటి ఐటెమ్ సాంగ్ పాడినందుకు సిగ్గుగా అనిపించింది.. పిల్లలూ పాడేస్తున్నారు.. ఇది సరికాదు: శ్రేయా ఘోషాల్

Hari Prasad S HT Telugu
Feb 26, 2025 03:02 PM IST

Shreya Ghoshal: ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషాల్ ఓ ఐటెమ్ సాంగ్ పాడినందుకు తాను సిగ్గు పడుతున్నట్లు చెప్పింది. అలాంటి పాటను చిన్న పిల్లలు కూడా పాడుతుండటం తనకు చాలా ఇబ్బందిగా అనిపించినట్లు ఆమె చెప్పడం గమనార్హం.

అలాంటి ఐటెమ్ సాంగ్ పాడినందుకు సిగ్గుగా అనిపించింది.. పిల్లలూ పాడేస్తున్నారు.. ఇది సరికాదు: శ్రేయా ఘోషాల్
అలాంటి ఐటెమ్ సాంగ్ పాడినందుకు సిగ్గుగా అనిపించింది.. పిల్లలూ పాడేస్తున్నారు.. ఇది సరికాదు: శ్రేయా ఘోషాల్

Shreya Ghoshal: ఐటెమ్ సాంగ్స్ ఏవైనా ఆడవాళ్లను కాస్త ఇబ్బంది పెట్టేవే. ఆ పాటల్లోని లిరిక్స్, వాటిపై హీరోయిన్స్ వేసే స్టెప్పులు దారుణంగా ఉంటాయి. అలాంటి ఓ పాట పాడిన ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషాల్.. ఇప్పుడు తనకు చాలా సిగ్గుగా అనిపిస్తోందని అనడం విశేషం. దాని అర్థం ఏంటో తెలియకుండా పిల్లలు పాడుతుండటం సరికాదని ఆమె అంటోంది.

చికినీ చమేలీ సాంగ్‌పై శ్రేయా ఘోషాల్

శ్రేయా ఘోషాల్ గతంలో బాలీవుడ్ లో వచ్చిన అగ్నిపథ్ మూవీలోని చికినీ చమేలీ అనే పాట పాడింది. ఈ ఐటెమ్ సాంగ్ పై కత్రినా కైఫ్ వేసిన స్టెప్పులు ఇప్పటికే పాపులరే. దీనిపై తాజాగా లిలీ సింగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయా స్పందించింది. తాను ఇలాంటి అసభ్యకరమైన పాటను కొన్ని పాడినట్లు ఆమె చెప్పింది.

“సెన్సువల్, సెక్సీగా ఉండటానికి, పూర్తి అభ్యంతకరంగా ఉండటం మధ్య ఓ చిన్న రేఖ ఉంటుంది. ఈ విషయం నేను కాలం గడుస్తున్న కొద్దీ తెలుసుకున్నాను. చిన్న పిల్లలు కూడా వాటి అర్థమేంటో తెలియకుండా పాడేస్తున్నారు. వాటిపై డ్యాన్స్ లు చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చి మీ పాట చాలా బాగుంది.. మీకోసం పాడతా అని అంటున్నారు. అప్పుడు నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఓ ఐదారేళ్ల పిల్ల అలాంటి లిరిక్స్ పాడటం సరికాదు” అని శ్రేయా ఘోషాల్ చెప్పింది.

మగాళ్లు కాదు.. ఆడాళ్లు రాయాలి

ఇక ఇలాంటి ఐటెమ్ సాంగ్స్ చాలా వరకు మగాళ్లే రాస్తుంటారు. అందువల్లే వీటిలోని పదాలు కూడా మహిళలను కాస్త కించపరిచేలా ఉంటాయన్నది శ్రేయా అభిప్రాయంగా కనిపిస్తోంది. “నేను దీని గురించి తెలుసుకున్నాను. సెక్సీగా ఉండటం గురించి మాట్లాడటం తప్పు కాదు. కానీ దానిని రాసే విధానం ముఖ్యం. ఒక మహిళ వాటిని రాసి ఉంటే మరింత సొగసైన విధంగా రాసేవారు.

ఇది మన దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. మన సమాజంలో ముఖ్యంగా ఇండియాలో కొన్ని ప్రమాణాలను సెట్ చేయడం చాలా అవసరం. సినిమాలు, మ్యూజిక్ ప్రజల జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఏ బ్లాక్‌బస్టర్ సాంగ్ లేదా సినిమా చరిత్రలో అలా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో నేను భాగం కాదలుచుకోలేదు” అని శ్రేయా స్పష్టం చేసింది.

ఆమె అభిప్రాయంతో కొందరు అభిమానులు ఏకీభవించారు. చికినీ చమేలీ పాట మరీ దారుణంగా ఉందని, అందులో కత్రినా తనకు ఎప్పుడూ నచ్చలేదని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు. కానీ మరో యూజర్ మాత్రం ఆమెను తప్పుబట్టారు. ఈ మధ్యే ఇండియన్ ఐడల్ షోలో ఇదే పాటను ఆమె మళ్లీ పాడిందని, అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ కనిపించిందని, ఇంత కపటం పనికి కాదని అనడం గమనార్హం.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024