


Best Web Hosting Provider In India 2024

Thriller OTT: నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన, కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో…
Thriller OTT: సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ రైటర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీకి తంగలాన్ డైరెక్టర్ పా రంజిత్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఆహా ఓటీటీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
Thriller OTT: కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన రైటర్ మూవీ థియేటర్లలో రిలీజైన నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. శుక్రవారం నుంచి ఈ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా తమిళ్ ఓటీటీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
పా రంజిత్ ప్రొడ్యూసర్…
రైటర్ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఫ్లాంక్లిన్ జాకబ్ దర్శకత్వం వహించాడు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్‌తో పాటు సముద్రఖని యాక్టింగ్ బాగుందంటూ కామెంట్స్ వచ్చాయి.
పోలీస్ వ్యవస్థలోని లోతుపాతులతో పాటు పై స్థాయి ఆఫీసర్స్ కిందిస్థాయి ఉద్యోగులను ఏ విధంగా చులకనగా చూస్తుంటారు? వారి చేత ఎలాంటి పనులు చేయిస్తుంటారన్నది సందేశాత్మకంగా ఈ మూవీలో చూపించారు దర్శకుడు. సినిమాలోని ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని మలుపు ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.
రైటర్ మూవీ కథ ఇదే…
తంగరాజు (సముద్రఖని) పోలీస్ స్టేషన్ రైటర్‌గా పనిచేస్తుంటాడు. కింది స్థాయి పోలీస్ ఉద్యోగుల కోసం ఓ యూనియన్‌ను ఏర్పాటుచేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తుంటాడు. రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న సమయంలో తంగరాజును వైజాగ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు.
డిప్యూటీ కమీషనర్‌తో పాటు మిగతా పోలీస్ సిబ్బంది దేవకుమార్(హరీష్ కృష్ణన్) అనే స్టూడెంట్ పై అక్రమంగా నక్సలైట్ అనే ముద్రవేసి జైలుపాలు చేయాలని చూస్తున్నారనే నిజం తంగరాజుకు తెలుస్తుంది. దేవకుమార్‌ను నిర్దోషిగా నిరూపించడం కోసం తంగరాజు ఏం చేశాడు ఉన్నతాధికారులపై అతడి పోరాటం ఫలించిందా? దేవకుమార్‌పై పోలీసులు అక్రమంగా ఎందుకు కేసు పెట్టారు? అతడు చేసిన తప్పేమిటి? అన్నదే ఈ మూవీ కథ.
రైటర్ సినిమాకు గోవింద్ వసంత మ్యూజిక్ అందించాడు. సముద్రఖనితో పాటు హరీష్ కృష్ణన్, ఇనియా, బోస్ వెంకట్ కీలక పాత్రల్లో నటించారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్…
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ యాక్టర్‌గా బిజీగా ఉన్నాడు సముద్రఖని. ఈ ఏడాది తెలుగులో సంక్రాంతి రిలీజైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో ఓ కీలక పాత్ర పోషించాడు. సముద్రఖని ప్రదాన పాత్రలో నటించిన రామం రాఘవం మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి కమెడియన్ ధన్‌రాజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ధన్‌రాజ్ ఓ కీలక పాత్ర పోషించాడు.
సంబంధిత కథనం