Chhaava in Telugu: గుడ్ న్యూస్.. రూ.500 కోట్ల వసూళ్ల హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెలుగులోనూ వస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Chhaava in Telugu: గుడ్ న్యూస్.. రూ.500 కోట్ల వసూళ్ల హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెలుగులోనూ వస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Feb 26, 2025 05:19 PM IST

Chhaava in Telugu: రూ.500 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ హిస్టారికల్ డ్రామా ఛావా తెలుగులోనూ వస్తోంది. హిందీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాను తెలుగులో తీసుకురావాలన్న ఇక్కడి ప్రేక్షకుల డిమాండ్ మేకర్స్ కు వినిపించింది.

గుడ్ న్యూస్.. రూ.500 కోట్ల వసూళ్ల హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెలుగులోనూ వస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే
గుడ్ న్యూస్.. రూ.500 కోట్ల వసూళ్ల హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెలుగులోనూ వస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Chhaava in Telugu: రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా ఇది. 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తానికి మరో వారంలో తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.

తెలుగులో రిలీజ్ కానున్న ఛావా

ఛావా మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు క్రమంగా పెరుగుతూ వెళ్లాయి. ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ మార్క్ కూడా దాటేసింది. మూవీకి వస్తున్న పాజిటివ్ రివ్యూల నేపథ్యంలో తెలుగులోనూ తీసుకురావాలని ఇక్కడి ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.

మొత్తానికి మార్చి 7న ఛావా మూవీ తెలుగులో రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయనుండటం విశేషం. తెలుగు రిలీజ్ విషయాన్ని బుధవారం (ఫిబ్రవరి 26) ఆ సంస్థే ట్వీట్ ద్వారా వెల్లడించింది. “భారతదేశ సాహస పుత్రుడి అద్భుతమైన కథ ఛావా అందరి డిమాండ్ మేరకు ఇప్పుడు తెలుగులోనూ వస్తోంది. అతిపెద్ద దృశ్యకావ్యం ఛావా తెలుగులో మార్చి 7న రిలీజ్. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఛావాను తెలుగులో రిలీజ్ చేస్తోంది” అనే క్యాప్షన్ తో రిలీజ్ విషయం తెలిపింది.

ఛావా మూవీ గురించి..

ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత కూడా మరాఠా సామ్రాజ్యాన్ని మొఘలు చక్రవర్తి ఔరంగాజేబు నుంచి కాపాడే ప్రయత్నం చేస్తూ కన్నుమూసిన ఆయన తనయుడు ఛత్రపతి శంభాజీ జీవితం ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కించారు.

లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను ఇప్పుడు ఇండియాతోపాటు ప్రపంచాన్నే ఊపేస్తోంది. ఏకంగా రూ.500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. త్వరలోనే ఇండియాలోనూ రూ.400 కోట్ల నెట్ వసూళ్లు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన భార్య యశు బాయిగా రష్మిక మందన్నా నటించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా.. మొఘలు చక్రవర్తి ఔరంగాజేబుగా కనిపించాడు.

ఈ సినిమాలో విక్కీ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత శంభాజీ వీరత్వానికి ఫిదా అవుతున్నారు. ఎంతోమంది భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఛావా మూవీకి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024