AIIMS Recruitment 2025 : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ – ముఖ్య వివరాలివే

Best Web Hosting Provider In India 2024

AIIMS Recruitment 2025 : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ – ముఖ్య వివరాలివే

HT Telugu Desk HT Telugu Feb 26, 2025 07:06 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Feb 26, 2025 07:06 PM IST

AIIMS Mangalagiri Recruitment 2025: మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యా అర్హతల పరిశీలనతో పాటు కేవలం ఇంట‌ర్వ్యూల‌తోనే రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 2వ తేదీలోపు వివరాలను మెయిల్ చేయాల్సి ఉంటుంది.

ఎయిమ్స్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్
ఎయిమ్స్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), మంగళ‌గిరిలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కేవ‌లం ఇంట‌ర్వ్యూతోనే ఉద్యోగాలకు ఎంపిక చేయ‌నున్నారు. ఇందులో ఎన్ఎంహెచ్ఎస్ స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్‌, రీసెర్చ్ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్ పోస్టుల‌కు మార్చి 4న ఇంట‌ర్వ్యూలు జ‌ర‌గ‌నున్నాయి. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు మార్చి 2 లోగా సీవీని మెయిల్ చేయాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా నేష‌న‌ల్ మెంట‌ర్ హెల్త్ స‌ర్వే ప్రాజెక్టు స్టాప్‌ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. అయితే ఎన్ఎంహెచ్ఎస్ స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్‌ పోస్టులకు ఎంపికైన వారు ఆరు నెల‌ల ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఉంటారు. అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక అయిన వారు 11 నెల‌ల పాటు ఒప్పందం ప్రాతిప‌దిక‌న ఉంటారు. అభ్య‌ర్థుల‌ ప‌నితీరు ఆధారంగా పని చేసే కాలాన్ని పొడిగిస్తారు. సీవీలు మెయిల్ చేసిన అభ్య‌ర్థులు మార్చి 4న మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కావాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు…?

మొత్తం ఆరు పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. అందులో ఎన్ఎంహెచ్ఎస్ స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్‌ పోస్టులు ఐదు, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టు ఒక‌టి భ‌ర్తీ చేస్తున్నారు.

  • ఎన్ఎంహెచ్ఎస్ స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్‌ పోస్టులకు విద్యా అర్హ‌త సైకాల‌జీ, సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, రూర‌ల్ డ‌వ‌ల‌ప్‌మెంట్ త‌దిత‌ర సంబంధిత విభాగాల్లో మాస్ట‌ర్స్ చేసి ఉండాలి. రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టులు, ప్రొగ్ర‌ామ్స్‌లో ప‌ని చేసే అనుభ‌వం ఉండాలి. స్థానిక భాష‌పై ప‌ట్టు ఉండాలి.
  • రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు మైక్రోబ‌యోలజీ, వైరాల‌జీ, మెడిక‌ల్ జెనిటిక్స్‌, మ‌లిక్యూల‌ర్ బ‌యోల‌జీ, బ‌యో టెక్నాల‌జీలో ఎంఎస్సీ చేయాలి.
  • ఎన్ఎంహెచ్ఎస్ స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్‌ పోస్టులకు- రూ.45,000 తోపాటు ట్రావెల్ అలివెన్స్ త‌దిత‌ర స‌దుపాయాలు క‌ల్పిస్తారు.
  • రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు- రూ.35,000 జీతం చెల్లిస్తారు.
  • ఎన్ఎంహెచ్ఎస్ స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్‌ పోస్టులకు వ‌యో ప‌రిమితి 40 నుంచి 45 ఏళ్లుగా ఉంది.
  • రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు వ‌యో ప‌రిమితి 30 ఏళ్ల‌ు. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ప్ర‌కారం వ‌య‌స్సు నిబంధనల్లో స‌డ‌లింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం….

1. ఎన్ఎంహెచ్ఎస్ స‌ర్వే ఫీల్డ్ డేటా క‌లెక్ట‌ర్‌ పోస్టులకు సంబంధించి మార్చి 2 తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు అధికారిక మెయిల్ ఐడీ ap.nmhs2cen@nimhans.net కి సీవీని మెయిల్ చేయాల్సి ఉంటుంది. మార్చి 4న ఉద‌యం 8.30 గంట‌ల‌కు మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేష‌న్ బ్లాక్‌లోని స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ చేస్తారు. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ప్రారంభం అవుతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలను అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ పై క్లిక్ చేసి తెలుసుకోవ‌చ్చు.

2. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి మార్చి 4 తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు అధికారిక మెయిల్ ఐడీ vrdlicmr.aiims@gmail.com కి సీవీని మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూ తేదీ త్వ‌ర‌లో వెల్ల‌డిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలను అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ పై క్లిక్ చేసి తెలుసుకోవ‌చ్చు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

RecruitmentJobsAndhra Pradesh News
Source / Credits

Best Web Hosting Provider In India 2024