



Best Web Hosting Provider In India 2024

Lucky Baskhar Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న దుల్కర్ సల్మాన్ మూవీ.. అరుదైన రికార్డు
Lucky Baskhar Netflix: నెట్‌ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ. తాజాగా తమ సినిమా సాధించిన రికార్డును ఈ మూవీని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేసింది.
Lucky Baskhar Netflix: లక్కీ భాస్కర్ మూవీ దూకుడు థియేటర్లలోనే కాదు నెట్‌ఫ్లిక్స్ లోనూ మామూలుగా లేదు. గతేడాది అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తూ.. తాజాగా వరుసగా 13 వారాలుగా ట్రెండ్ అవుతున్న తొలి సౌత్ ఇండియన్ మూవీగా నిలిచింది.
లక్కీ భాస్కర్ రికార్డు
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన మూవీ లక్కీ భాస్కర్. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే అంటే నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. అప్పటి నుంచీ ఓటీటీలో మూవీ దూకుడు మొదలైంది.
తొలి వారం నుంచే నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. ఇలా 13 వారాలుగా టాప్ 10లో ఉన్న తొలి సౌత్ ఇండియా మూవీగా లక్కీ భాస్కర్ నిలిచినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ బుధవారం (ఫిబ్రవరి 26) తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“డిజిటల్ ఎరెనాలోనూ లక్కీ భాస్కర్ మైండ్ గేమ్ కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ లో ఉన్న తొలి సౌత్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఆడియెన్స్ కురుస్తున్న ప్రేమకు ఇదే నిదర్శనం. బ్లాక్ బస్టర్ లక్కీ భాస్కర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.
లక్కీ భాస్కర్ మూవీ గురించి..
లక్కీ భాస్కర్ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో నటించారు. ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి ఎలా అన్యాయానికి గురై.. తర్వాత అదే బ్యాంకును అడ్డం పెట్టుకొని కోట్లకు పడగలెత్తాడో ఈ సినిమాలో చూడొచ్చు. 1990ల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.
ఈ సినిమా దుల్కర్ కు తెలుగులో వరుసగా నాలుగో విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పటి వరకూ ఈ సినిమాను చూసి ఉండకపోతే వెంటనే నెట్‌ఫ్లిక్స్ లో చూసేయండి.
సంబంధిత కథనం