



Best Web Hosting Provider In India 2024

SLBC Tunnel Rescue Operation : 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తాం..! మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
SLBC Tunnel Rescue Operation: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారంతా బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశామని చెప్పారు.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… కీలక ప్రకటన చేశారు. మరో రెండురోజుల్లో కార్మికుల ఆచూకీ తెలుసుకుంటామని చెప్పారు. వారంతా బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశామని తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ చేస్తాం – మంత్రి ఉత్తమ్
“ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించాం.రెండు రోజుల్లో SLBC ఘటన రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తాం. 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయింది. చిక్కుకున్న వారిని కాపాడటం కోసం పూడికలోకి వెళ్లాలని నిర్ణయించాం. పూర్తిగా నీటిని తోడేసి గ్యాస్ కట్టర్ సాయంతో బోరింగ్ మిషన్‌ను కట్ చేయాలి. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం తగదు” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కార్మికులను రక్షించే వరకు అన్ని ఏజెన్సీలు సైట్‌లో ఉండాలని ఆదేశించారు.కార్మికులను కాపాడేందుకు ముమ్మరమైన రెస్క్యూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో రెస్క్యూ పూర్తవుతుంది. సొరంగం లోపల నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నాం. శిథిలాల తొలగింపును వేగవంతం చేయాలని నిర్ణయించాం. బలహీనమైన టన్నెల్ విభాగాలను పటిష్టపరచాలని సూచించాం”అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
“సొరంగం యొక్క అంతర్గత పరిస్థితులను మరింత ఖచ్చితత్వంతో అంచనా వేయడానికి రిమోట్-నియంత్రిత పరికరాలను వాడనున్నారు. హైటెక్ ఇమేజింగ్ వ్యవస్థలను ఉపయోగించబడుతున్నాయి. వారిని కాపాడేందుకు గత ఐదు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోంది. చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించింది” మంత్రి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
టన్నెల్లో పూర్తి స్థాయి డీవాటరింగ్ చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నిపుణులైన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ రెండు రోజుల్లో ఆపరేషన్ కొలిక్కి వస్తుందని క్లారిటీ ఇచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్