Best Web Hosting Provider In India 2024

Brahmamudi February 27th Episode: రాజ్‌కు జీవితాంతం చిప్పకూడు.. కోర్టులో అనామిక ఛాలెంజ్.. రుద్రాణి నోరుమూయించిన కావ్య
Brahmamudi Serial February 27th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌లో కోర్టులో సాక్ష్యంగా రాడ్ తీసుకొస్తారు. దానిపై రాజ్ వేలి ముద్రలు ఉండటంతో డిఫెన్స్ లాయర్ పెన్ నాటకం ఆడి బయటపడేస్తాడు. రాజ్ ఫ్యామిలీతో అనామిక ఛాలెంజ్ చేస్తుంది. రాజ్ జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని చెబుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌లో రాజ్‌కు అన్నం తినిపిస్తుంది కావ్య. గుండెనిండా బాధ పెట్టుకుని వెళ్లకు అని రాజ్ అంటే.. లేదు ఇలాంటి సమయంలోనే ఎక్కువ ధైర్యంగా ఉండాలని తెలుసు. నేను అప్పు అదే పనిలో ఉన్నాం సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నాం అని కావ్య అంటుంది.
నేరం ఒప్పుకోమ్మని
నువ్వేమైనా సాహసాలు చేస్తున్నావా. నీకేమైనా అయితే నేను జీవితాంతం జైలులోనే ఉండాల్సి వస్తుంది. అంటే నీకేమైనా అయితే నన్నెవరు విడిపిస్తారు అని రాజ్ అంటాడు. అప్పు రేపటిలో సాక్ష్యాలు సంపాదిస్తానని చెప్పింది. నేను ధైర్యంగానే ఉంటాను అని చెప్పిన కావ్య రాజ్‌ను హగ్ చేసుకుని వెళ్లిపోతుంది. మరుసటి రోజు కోర్టులో అంతా వస్తారు. నిన్ను ఎవరైనా నేరం ఒప్పుకోమ్మని బలవంతం పెట్టారా, సమయానికి భోజనం పెడుతున్నారా అని జడ్జ్ రాజ్‌ను అడుగుతాడు.
దాంతో లేదు, కరెక్ట్ టైమ్‌కు భోజనం పెడుతున్నారు అని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ లాయర్ మర్డర్ వెపన్ దొరికిందని, దానికి రక్తం ఉందని, సామంత్ తల మీద బలంగా కొట్టారని చెబుతాడు. రాడ్‌ను జడ్జ్ ముందు పెడతారు. ఆ రాడ్ చూసి రాజ్ షాక్ అవుతాడు. దాన్ని పట్టుకున్నది గుర్తు చేసుకుంటాడు. అప్పుకు ఏదో చెప్పబోయి ఆగిపోతాడు. సాక్ష్యాధారాల మారుస్తారని అన్నారు కాబట్టి మర్డర్ వెపన్, వేలి ముద్రల రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ నేరుగా కోర్టుకే సమర్పించాం అని లాయర్ అంటాడు.
అవి చూసిన జడ్జ్ ఇద్దరి వేలి ముద్రలు మ్యాచ్ అయ్యాయి. ముద్దాయి వేలి ముద్రలే ఆయుధంపై ఉన్నాయి. దీనికి మీరు కోర్టుకు జవాబు చెప్పాల్సి ఉంటుంది అని జడ్జ్ అంటాడు. కచ్చితంగా చెబుతాను. జరిగింది చెబుతాడు. ఈ రాడ్‌తోనే బెదిరించి తరిమేశాను. అంతేకానీ ఎవరిని కొట్టడం జరగలేదు. తర్వాత దాన్ని అక్కడే పడేశాను. అంతే జరిగింది అని రాజ్ అంటాడు. ఎనీ క్వశ్చన్స్ అని జడ్జ్ అంటే.. అనామిక లాయర్ ఎస్ అంటూ లేస్తాడు.
రాజ్ లాయర్ కొత్త లాజిక్
సామంత్‌ను చంపేస్తానని బెదిరించారు. అందుకు మీ భార్య సాక్ష్యం. మీరు సామంత్‌ను చంపారు అనడానికి ఆయుధంపై మీ వేలి ముద్రలే సాక్ష్యం. మీ మనుషులను పంపించి సామంత్‌ను ఈడ్చుకొచ్చి ఫ్యాక్టరీలో తలపై కొట్టారు అవునా అని లాయర్ అంటే.. లేదు అని రాజ్ అంటాడు. మీరు కాకుండా ఇంకెవరు చేస్తారు. మీరే హంతకుడు ఒప్పుకోండి ఒప్పుకోండి అని గట్టిగా అంటుంటాడు పీపీ లాయర్. దాంతో రాజ్ లాయర్ లేచి నా క్లైంట్‌ను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటాడు.
అసలు అని తన పెన్ కింద పడేస్తాడు రాజ్ లాయర్. తర్వాత తీసుకుందామని ప్రయత్నిస్తూ నడుము నొప్పిగా ఉందని, వాషింగ్ మేషిన్ కొనివ్వలేదని బట్టలన్నీ తనతోనే తన భార్య ఉతికించిందని, మా భార్య మొగుడిని కూడా ఉతికి ఆరేస్తుందని చెబుతాడు. పీపీ గారు పెన్ తీసి ఇస్తారా అని చెప్పడంతో అనామిక లాయర్ అలాగే ఇస్తాడు. దానిని కర్చీఫ్‌తో పట్టుకుని ఇప్పుడు ఈ పెన్ పైనా నా వేలి ముద్రలు ఉన్నట్లా.. పీపీ గారి వేలి ముద్రలు ఉన్నట్లా అని రాజ్ లాయర్ ప్రశ్నిస్తాడు.
పీపీ గారి వేలి ముద్రలే ఉంటాయి అని జడ్జ్ ఉంటాయి. ఇలాగే, నా క్లైంట్‌కు జరిగి ఉంటుందని డిఫెన్స్ లాయర్ చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు. దీన్ని బట్టే నా క్లైంట్ మర్డర్ చేశాడని అనడానికి లేదు. బాడీని తనతో తీసుకెళ్లిన నా క్లైంట్ ఆయుధాన్ని అక్కడ పడేయడు. ఈ చిన్న లాజిక్ చాలు నా క్లైంట్ ఈ నేరం చేయలేదు అనడానికి అని రాజ్ లాయర్ అంటాడు. కోర్టుకు కావాల్సింది బలమైనా సాక్ష్యాలు అని పీపీ అంటాడు.
మరింత ఇరికిస్తుందని
సరే బలం లేదు. కానీ నేను చెప్పిన కథనమే జరిగి ఉంటుంది కదా. నా క్లైంట్ నిరపరాధి కూడా అయిండొచ్చు కదా. కాబట్టి నేను నా క్లైంట్‌ను నిరపరాధిగా నిరూపించడానికి పోలీసులకు, నాకు కాస్తా టైమ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని రాజ్ లాయర్ అంటాడు. దాంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ చెబుతాడు. తర్వాత ఇంట్లోవాళ్లందరితో రాజ్ మాట్లాడుతాడు. అపర్ణ బాధపడుతుంటుంది. నువ్ బయటపడటానికి సాక్ష్యం దొరికిందని అనుకున్నాం, కాని అదే నిన్ను మరింత ఇరికిస్తుందని అనుకోలేదని సుభాష్ అంటాడు.
సారీ బావా నువ్ హత్య చేయలేదన్న నమ్మకంతోనే తీసుకొచ్చాను. కానీ, దానిపై నీ వేలిముద్రలు ఉన్నాయంటే నమ్మలేకపోయాను అని అప్పు అంటుంది. ఇంతలో అప్పు అప్పు ఎంత పని చేశావ్ అప్పు. ఎరక్క పోయి ఇరుక్కుపోయావంటే ఇదేనేమో. ఏదో చేయబోయి ఏదో చేశావ్ అని అనామిక అంటుంది. మా బావను తెలివిగా ఇరికించానని సంబరపడిపోతున్నావా అని అప్పు అంటుంది. కేసు కొట్టేస్తారేమో భయపడ్డాను. ఇంతలోనే నువ్ కీలక ఆధారాన్ని తీసుకొచ్చి ఇంత ఫేవర్ చేస్తావనుకోలేదు డియర్. థ్యాంక్యూ సోమచ్. చచ్చి ఎక్కడున్నాడో కానీ సామంత్ నిన్ను దీవిస్తాడు అని అనామిక అంటుంది.
ఎక్కువ మాట్లాడితే మర్యాద ఉండదని కల్యాణ్ అంటాడు. ఇది భయం నుంచి బాధగా వచ్చిన ఉక్రోశం కావొచ్చు అని అనామిక అంటుంది. మరి నీదేంటీ పొగరులో నుంచి అహంకారం నుంచి వచ్చి అత్యుత్సాహమా అని రాజ్ అంటాడు. అరెస్ట్ అయిన వాళ్లు ఎక్కువ మాట్లాడితే శిక్షలు పెరుగుతాయ్ రాజ్. ఎందుకు కష్టాలు కొని తెచ్చుకుంటావ్. కూల్ డౌన్ అని అనామిక అంటుంది. తప్పుడు కేసులు బనాయించి ఎగురుతుంది నువ్వు. తగ్గితే మంచిది అని కావ్య అంటుంది.
జీవితాంతం జైల్లో చిప్పకూడు
రేపటిలోగా అన్ని బయటకొస్తాయి. అప్పుడు మా పోలీసులు నీకు లూస్ అయిన నట్లు బోల్టులు అన్ని టైట్ చేస్తారు డోంట్ వర్రీ అని అప్పు అంటుంది. రాజ్ బయటకొస్తాడు. నేను లోపలికి వెళ్తాను అని అందరికి చాలా నమ్మకంగా ఉన్నట్లుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏం లాభం లేదు. రాజ్‌కు ఫేవర్‌గా ఏ ఆధారం దొరకదు. రాసి పెట్టుకోండి. రేపు తీర్పు వస్తుంది. రాజ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఆ తర్వాత జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటాడు అని అనామిక అంటుంది.
నువ్ కూడా రాసిపెట్టుకో ఇదే కోర్టులో నువ్ దోషిగా, నిర్దోషిగా నా కొడుకు మళ్లీ మాట్లాడుకుంటాం అని సుభాష్ అంటాడు. అది చూద్దాం అని వెళ్లిపోతుంది అనామిక. తర్వాత ఇంట్లో రాజ్‌ను మరింత ఇరికించేశావ్ ఏంటీ అని ధాన్యలక్ష్మీ, నీకు చేత కాకపోతే చెప్పు ఈ ఇంట్లో వాళ్లకు మినిస్టర్ లెవెల్‌లో ఇన్‌ఫ్ల్యూయెన్స్ ఉంది అని రుద్రాణి అంటుంది. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఏది పనిచేయదు అని అప్పు అంటుంది. చేసింది చాలు తప్పుకో అని ధాన్యలక్ష్మీ అంటుంది.
తప్పుకో ఏంటీ ఈ మహాతల్లి ఇప్పుడు ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే. చేసిందంతా చేసి ఇప్పుడు చేతులెత్తేసి సైలెంట్‌గా నిలబడి ఉంది అని రుద్రాణి అంటుంది. అక్కా. నీ అత్తకు మా ఆయన అంటే ఎంత ప్రేమే. హక్కుల కోసం చిక్కుల కోసమే పోరాటం చేస్తుందనుకున్నా. జైలు నుంచి మా ఆయన విడుదల కావాలని మీ అత్తకు చాలా ఉందక్కా అని కావ్య అంటుంది. ఎంత కుమిలిపోతో మూడు పూటలు తింటుంటునే అనుకున్నాను అని స్వప్న అంటుంది.
రాజ్‌కు శిక్ష పడేలా ఉంది
ఏయ్ వెటకారంగా ఉందా అని రుద్రాణి అంటుంది. ఏ మీకు వెటకారంగా ఉందా. అప్పు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. మీరిద్దరు దాన్నే టార్గెట్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని వాళ్ల మీద వీళ్ల మీద ఎగరడం తప్పా మీకు ఏం చేతనవుతుంది అని స్వప్న అంటుంది. దాంతో నోరుమూసుకుంటారు. ఆంటీ నేను మీకు మాటిచ్చాను. బావను బయటకు తీసుకొస్తాను. ఫ్యాక్టరీలో జరిగింది తెలుసుకుంటాను అని అప్పు అంటుంది.
నిన్న గాక మొన్న సర్వీసులో చేరిన ఈ అప్పు వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. రాజ్‌కు శిక్ష పడేలా ఉంది. మనమే ఏదో ఒకటి చేయాలి అని రుద్రాణి అంటుంది. తప్పకుండా ఏదో ఒకటి చేయండి. అందరికి కావాల్సింది అదే కదా. మీకు ఆ అనామిక ఫ్రెండే కదా. అక్కడ ఏం జరిగిందో కొంచెం కనుక్కుని చెబుతారా. నేను నోరు విప్పితే వేరే లెవెల్‌లో ఉంటుంది అని కావ్య అంటుంది. దాంతో రుద్రాణి నోరు మూసుకుంటుంది. తర్వాత పొట్టేల్ కమలేష్ కావాలని అప్పు, కావ్య ఓ చోటికి వెళ్తారు.
తర్వాత కోర్టులో డిఫెన్స్ లాయర్ గారు వాచ్‌లు, పెన్నులు పారేసుకుని మ్యాజిక్‌లే చేశారు తప్పా ఏ సాక్ష్యాలు చూపించలేదు. ఈ ముద్దాయే నిజమైన హంతకుడు అని అనామిక లాయర్ అంటాడు. మరోవైపు కమలేష్ కోసం బార్‌లో అప్పు, కావ్య వెతుకుతుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్