సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్తశుద్దితో ఇవన్నీ జరుగుతున్నాయి 

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి: రైతులు నష్టపోకుండా ప‌గ‌టి పూటే 9 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ ఇస్తూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చర్యలు తీసుకున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు.  కొత్త సబ్‌స్టేషన్ల ద్వారా అనేక మండలాలకు ఉపయోగకరంగా ఉంటుంది, లో ఓల్టేజ్‌ సమస్యలు లేకుండా చేయవచ్చు అన్నారు. సోలార్‌ ప్రాజెక్ట్‌ల వల్ల కూడా అనేకమందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. నిరంతర విద్యుత్‌ ఇచ్చేందుకు అన్ని ఒడిదుడుకులు తట్టుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేశార‌ని, ఇవ‌న్నీ కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ వర్చువల్‌ విధానంలో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్ధాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవం, ఇవికాక రెండు సోలార్‌ ప్రాజెక్ట్‌లకు శంకుస్ధాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఇంధన శాఖా మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే… 

అందరికీ నమస్కారం, సీఎంగారు ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. నవరత్నాలలో సీఎంగారు మాట ఇచ్చిన ప్రకారం 39.64 లక్షల మంది లబ్ధిదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) రూ. 46, 581 కోట్లు ఈ అక్టోబర్‌ నెలాఖరివరకు టారిఫ్‌ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగనన్న హౌసింగ్‌ కాలనీలకు ఇప్పటివరకు ఐదు లక్షల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది, చాలా ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు ఈ ఆర్ధిక సంవత్సరంలో అదనంగా నిర్ణీత కాలపరిమితిలో ఇవ్వడం జరిగింది, రైతులు ఎప్పుడు అప్లికేషన్‌ పెడితే అప్పుడు కనెక్షన్‌ ఇస్తున్నాం, వచ్చే ఏడాదికి కూడా ఎస్టిమేట్స్‌ వేసుకుని దానికి తగిన విధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. సెకీతో కూడా ఒప్పందం చేసుకున్నాం, అది కూడా తక్కువ ధరకే ఒప్పందం చేసుకున్నాం, దీనివల్ల తొమ్మిది గంటలు పగటిపూట నిరంతర విద్యుత్‌ ఇవ్వచ్చు, స్మార్ట్‌మీటర్స్‌ ఏర్పాటుచేసి డీబీటీ ద్వారా ఇవ్వడం వల్ల రైతులకు కూడా విద్యుత్‌ ఛార్జీలు ఎంత చెల్లించాలో వారికి కూడా అర్ధమవుతుంది, వారు ఎంత లబ్ధిపొందారో వారికి తెలుస్తుంది, పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాల ప్రకారం రూ. 52,015 కోట్లు గ్రౌండ్‌ అయ్యాయి, వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది, ఉద్యోగావకాశాలు కూడా 12,586 మందికి కల్పించడం జరిగింది. ఈ పాలసీలవల్ల అందరూ లబ్ధిపొందుతున్నారు, రైతులు కూడా నష్టపోకుండా సీఎంగారు చర్యలు తీసుకున్నారు, ఈ కొత్త సబ్‌స్టేషన్ల ద్వారా అనేక మండలాలకు ఉపయోగకరంగా ఉంటుంది, లో ఓల్టేజ్‌ సమస్యలు లేకుండా చేయవచ్చు, సోలార్‌ ప్రాజెక్ట్‌ల వల్ల కూడా అనేకమందికి ఉద్యోగావకాశాలు వస్తాయి, రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్‌ ఇచ్చేందుకు అన్ని ఒడిదుడుకులు తట్టుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేశాం. సీఎంగారు చిత్తశుద్దితో ఇవన్నీ జరుగుతున్నాయి, అందరికీ ధన్యవాదాలు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *