


Best Web Hosting Provider In India 2024

Signs Of Mental Illness: మానసికంగా మీరు బలహీనంగా మారుతున్నారని సూచించే 5 లక్షణాలు!
Signs Of Mental Illness: మీ ప్రవర్తనలో ఈ 5 రకాల లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే కౌన్సెలింగ్ చేయించుకోండి. ఇవి మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సూచిస్తాయి.
ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వం, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. శరీరం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి ద్వారా శారీరకరంగా అనారోగ్యంగా ఉన్నామని తెలుసుకుని దానికి అనుగుణంగా చికిత్స చేయించుకుంటాం. అదే విధంగా ప్రవర్తనలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు, మార్పులు కనిపించడం ప్రారంభించినప్పుడు అది మానసిక ఆరోగ్యం సరిగా లేదని సూచిస్తుంది. దీన్ని కూడా త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదంలో పడతాం. మీ ప్రవర్తనలో ఈ 5 రకాల లక్షణాలు కనిపిస్తున్నట్లయితే అది మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సంకేతం. దీనికి వెంటనే చికిత్స అవసరం. మానసిక సమతుల్యత క్షీణిస్తున్నట్లు సూచించే ముఖ్యమైన లక్షణాలేంటో తెలుసుకుందాం రండి.
నిద్రలేమి, అతిగా ఆలోచించడం
మీరు రాత్రిపూట సరిపడా నిద్రపోలేక పోతున్నారా? ఏవేవో ఆలోచనల కారణంగా రోజులో కనీసం 7-8 గంటల పాటైనా నిద్రను పొందలేకపోతున్నారా? అయితే మీ మానసిక సమతుల్యత సరిగ్గా లేదని అర్థం చేసుకోండి. ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభించినట్లయితే అది మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలికంగా ఇది అతిపెద్ద మానసిక సమస్యగా మారుతుంది. కనుక ఆలోచన మానేయండి లేదా కౌన్సిలింగ్ తీసుకోండి. యోగా, ధ్యానం వంటి వాటితో సమస్యను అధిగమించే ప్రయత్నం చేయండి.
ప్రేరణ లేకపోవడం, చిరాకు
మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వారికి ఏ పని మీద ధ్యాస ఉండదు. ప్రేరణ, ఉత్సాహం అనిపించవు. ప్రతి చిన్న విషయాలనికి చిరాకు పడుతుంటారు. అందరినీ ఊరికే విసుక్కుంటారు. ఈ లక్షణాలు మీలోనూ కనిపించాయంటే మీ మానసిక స్థితి సరిగ్గా లేదని అర్థం. వెంటనే తగిన చర్యలు తీసుకోవడం లేక మానసిక వైద్యులను సంప్రదించి కౌన్సలింగ్ తీసుకోవడం వంటివి చేయండి.
ఇతరులలో లోపాలను చూడటం
మానసికంగా బలంగాలేని వారు ఎప్పుడూ ఇతరులలో మంచిని చూడలేరు. వారిలోని లోపాలు, తప్పులనే వెతుకుతుంటారు. ఎంత మేలు చేసినా పట్టించుకోరు. మీరు కూడా ఇందుకు కారణం మీలోని అహం, అభద్రతా భావాలు అయి ఉండచ్చు. వీటి కారణంగా మీ దృష్టి మీ తప్పులకు బదులుగా ఇతరుల తప్పు వైపు మళ్లులతుంది. మీ సొంత తప్పులను గుర్తించకపోవడం, మీ తప్పులను ఇతరులపై రుద్దడం వంటివి చేస్తుంటారు. ఎందుకంటే మీరు మీలోని సమస్యలను ఎదుర్కోవటానికి ఇష్టపడరు. ఈ మధ్య ఇలానే చేస్తుంటే మీ మానసిక ఆరోగ్యంగ సరిగా లేదని అర్థం. ఇది మీలో నిరాశకు దారితీస్తుంది. కనుక వీలైనంత వరకూ దీని నుంచి బయట పడండి.
ఓర్పు లేకపోవడం
ఓర్పు లేకపోవడం చాలా ప్రమాదకరం. ఓర్పు లేకపోతే ప్రతి విషయానికీ కోపం వస్తుంది, ప్రతిసారి తొందరపడి అవతలి వ్యక్తులపై అరుస్తుంటారు. ఇతరులను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఏదైనా అనుకున్న వెంటనే అవ్వాలనీ, కావాలనుకున్నప్పుడే అన్నీ రావాలనీ అనుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల కుటుంబీకులు, స్నేహితులు దూరమవుతారు. ఈ మీ మానసకి సమతుల్యత క్షీణిచడం వల్ల మీరిలా చేస్తారు. ఇది మీ సొంత వినాశనానికి దారితీస్తుంది.
ఆందోళన, భయం
చిన్న విషయాలకు కూడా ఆందోళన, భయం పచెందడం. ఎప్పుడూ అసంతృప్తితో, అశాంతిగా ఫీలవడం వంటివి కూడా మానసిక స్థితి బాగోలేదని చెప్పే సూచనలేే. తెలియని విషయానికి కూడా భయ పడటం, ఏమీ జరగకున్నా చింతిస్తూ ఉండటం దీర్ఘకాలికంగా చాలా అనారోగ్య ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ఇలా జరుగుతుందంటే మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది అని అర్థం. మీకు వెంటనే కౌన్సెలింగ్ అవసరం.
సంబంధిత కథనం
టాపిక్