



Best Web Hosting Provider In India 2024

Five Kidneys man: అందరికీ రెండే కిడ్నీలు కానీ ఈయనకు మాత్రం ఐదు మూత్రపిండాలు, ఇది ఎలా సాధ్యం?
Five Kidneys man: సాధారణ మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. కానీ ఒక వ్యక్తికి ఐదు మూత్రపిండాలు ఉన్నాయి. వాటితో ఆయన ఎలా జీవిస్తున్నాడో తెలుసుకుందాం.
ఏ మనిషికైనా కిడ్నీలు రెండే ఉంటాయి. ఆ వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు సమర్థవంతంగా పనిచేయాలి. కానీ మన దేశంలో ఐదు కిడ్నీలు ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. అతను డిఆర్డీవోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. పేరు దేవేంద్ర బార్లేవార్. వయసు 45.
దేవేంద్ర గత 15 ఏళ్లగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో తరచూ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ జీవిస్తున్నారు. ఇప్పుడు ఆయన శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఐదు కిడ్నీలు ఆయనకు ఎలా వచ్చాయో కూడా వివరించారు. ఐదు కిడ్నీలు ఉన్నప్పటికీ ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తుంది.
మొదట నాలుగు కిడ్నీలు
ఒక మనిషి రెండు కిడ్నీలతోనే జన్మిస్తాడు. దేవేంద్ర కూడా అలా మొదట రెండు కిడ్నీలతోనే జన్మించారు. అయితే 15 ఏళ్ల క్రితం ఆయనకు తన రెండు కిడ్నీలు పనిచేయడం పూర్తిగా ఆపేసాయి. దీంతో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు. అవి కూడా ఫెయిల్ అయ్యాయి. పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలతో పాటు ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి మరొక రెండు కిడ్నీలను అమర్చారు. దీంతో నాలుగు కిడ్నీలు ఆయన శరీరంలో చేరాయి. కానీ కొత్తగా అమర్చిన ఆ కిడ్నీలు కూడా కొన్నాళ్లకు ఫెయిలయ్యాయి. దీంతో సమస్య మొదటికి వచ్చింది. 2022లో కోవిడ్ 19 బారిన పడ్డాడు దేవేంద్.ర దీంతో కిడ్నీలు సమస్య కూడా పెరిగిపోయింది. కేవలం డయాలసిస్ మీదే జీవించాల్సిన పరిస్థితి వచ్చింది.
అయిదో కిడ్నీ ఇలా
మరొకసారి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో అయినా కిడ్నీ దాతల కోసం వెతికారు. బ్రెయిన్ డెడ్ అయినా ఓ రైతు కుటుంబం అతనికి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకుంది. మళ్లీ మరొక కిడ్నీని శరీరంలో అమర్చుకునేందుకు దేవేంద్ర సిద్దమయ్యారు. వైద్యులు పనిచేయని నాలుగు కిడ్నీల దగ్గరే మరో కిడ్నీని అమర్చేందుకు ప్రయత్నించారు. ఇది వారికి పెద్ద సవాల్ గా మారింది. అయినా కూడా సమర్థవంతంగా కొత్త కిడ్నీని అక్కడ ఏర్పాటు చేశారు.
ఆ కొత్త కిడ్నీ దేవేంద్ర శరీరానికి తగినట్టుగా మారేలా ప్రత్యేక ప్రక్రియను ఫాలో అయ్యారు. కిడ్నీ పెట్టేందుకు నిజానికి అక్కడ స్థలం కూడా కుదరలేదు. నాలుగు కిడ్నీల వల్ల అక్కడ ప్రాంతం ఇరుకుగా మారిపోయింది. నాలుగు కిడ్నీలు అప్పటికే ఉండడంతో ఐదో కిడ్నీ పెట్టడం అనేది కష్టంగా మారింది. అయినా వైద్యులు ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతం చేశారు.
కొత్త కిడ్నీ కూడా చక్కగా పనిచేయడం మొదలైంది. పది రోజుల పాటు కిడ్నీ పనితీరును గమనించాక దేవేంద్రకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇచ్చేశారు. రెండు వారాల తర్వాత ఆయన శరీరంలో సాధారణంగానే కిడ్నీ పనిచేయడం కొనసాగించింది. డయాలసిస్ కూడా అవసరం పడలేదు. దీంతో దేవేంద్ర సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాడు. ప్రస్తుతం ఆయన శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నాయి. అయితే నాలుగు కిడ్నీలు పనిచేయవు. ఒక కిడ్నీ మీదే ఆయన జీవిస్తున్నారు.
అయిదు కిడ్నీలతో వచ్చే సమస్యలు
ఎందుకంటే ఎక్కువ కిడ్నీలు ఒక వ్యక్తి శరీరంలో ఉండడం ఎంతో అరుదుగా జరిగే ప్రక్రియ. కొంతమందికి పుట్టుకతో వచ్చే ఒక రకమైన రుగ్మత వల్ల ఐదు కిడ్నీలు సంభవించవచ్చు. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి కేసులు నమోదవలేదు. దేవేంద్రా లాగా కిడ్నీలు మార్పిడి చేసుకోవడం ద్వారా కూడా రెండు కంటే ఎక్కువ కిడ్నీలు శరీరంలో ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇలా రెండు కంటే ఎక్కువ కిడ్నీలు ఉన్న వారిలో తరచూ మూత్రపిండాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వారు ఎప్పటికప్పుడు వైద్య పర్యవేక్షణలో ఉండడం ఎంతో ముఖ్యం.
సంబంధిత కథనం