


Best Web Hosting Provider In India 2024
FCI Stipend:క్రీడాకారులకు గుడ్‌న్యూస్… గ్రామీణ, పట్టణ క్రీడాకారులకు ఎఫ్‌సీఐ స్టైఫండ్…ఇలా అప్లై చేసుకోండి
FCI Stipend: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ క్రీడాకారులకు ఎఫ్‌సీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. క్రీడాకారులకు నెల నెల స్పోర్ట్స్ స్టైఫండ్ మంజూరు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
FCI Stipend: క్రీడాకారులకు నెలనెల స్టైఫెండ్ మంజూరు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 16 వరకు గడువు ఉంది. ఎఫ్‌సీఐ ఇచ్చే ఈ స్టైఫండ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి
15-24 మధ్య వయసున్న క్రీడాకారులకు 2025-26 సంవత్సరానికి ఎఫ్‌సీఐ ఈ స్టైఫండ్‌ను అందిస్తోంది. 15-18 ఏళ్ల క్రీడాకారులకు జాతీయ స్థాయి క్రీడల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో ఆడినవారు, రాష్ట్ర స్థాయి క్రీడల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో ఆడినవారు, జాతీయ స్కూల్ గేమ్స్, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఆడినవారు అర్హులు.
అలాగే 18-24 ఏళ్ల క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడల్లో సీనియర్, ఇండియన్ యూనివర్శిటీ క్రీడల్లో ఆడినవారు, రాష్ట్రస్థాయి క్రీడల్లో సీనియర్, ఇంటర్ యూనివర్శిటీ, ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో ఆడివారు అర్హులు.
స్టైఫండ్ ఎంత?
క్రీడాకారులకు స్టైఫండ్ రెండు రకాలుగా ఇస్తారు. ఈ రెండు కాల స్టైఫండ్ కూడా ప్రతి నెల ఇస్తారు.
1. ప్రీమియం స్టైఫండ్ః 18-24 ఏళ్ల వారికి నెలకు రూ.20,000, 15-18 ఏళ్ల వారికి రూ.16,000
2. ఎలైట్ స్టైపెండ్ః 18-24 ఏళ్ల వారికి నెలకు రూ.15,000, 15-18 ఏళ్ల వారికి రూ.12,000
ఈ క్రీడాంశాలకు స్టైఫండ్ ఇస్తారు
ఫుడ్‌బాల్, హాకీ, క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చిన బాల, బాలికలు ఎఫ్‌సీఐ ఇచ్చే స్టైఫండ్‌కు అర్హులు.
దరఖాస్తును ఎలా చేయాలి?
క్రీడాకారుల స్టైఫండ్‌కు సంబంధించి దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://fci.gov.in/admin/storage/ckeditor/Application_form_for_stipend_2025_1738922825.pdf ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకుని ఖాళీలను పూర్తి చేయాలి.
అనంతరం సంబంధిత సర్టిఫికేట్ల జెరాక్స్ కాపీలను జత చేసి “The Secretary (HQSPC), Food Corporation of India, Headquarters, (13th Floor) 16-20, Barakhamba Lane, New Delhi110001 అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తుతో జత చేయాల్సిన సర్టిఫికేట్లు
1. పుట్టిన తేదీ సర్టిఫికెట్
2. పెర్ఫ్మమెన్స్ సర్టిఫికెట్లు
3. ఆధార్ కార్డు స
మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింకును
https://fci.gov.in/admin/storage/ckeditor/Stipend_Scheme_Details_25-26_(2)_1738922802.pdf సంప్రదించాలి.
(జగదీశ్వరరావు జరజాపు)
టాపిక్