


Best Web Hosting Provider In India 2024

JD Chakravarthy: అమ్మాయి హగ్ చేసుకుంటున్నా కూడా భయమేస్తోంది.. జేడీ చక్రవర్తి కామెంట్స్
JD Chakravarthy About Raa Raja Movie Release Poster: తెలుగులో అనేక చిత్రాలతో అలరించిన నటుడు, హీరో జేడీ చక్రవర్తి. తాజాగా రా రాజా మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను జేడీ చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!
JD Chakravarthy About Raa Raja Movie Poster: శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు.
రా రాజా రిలీజ్ డేట్ పోస్టర్
ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ మూవీ టీమ్. రా రాజా మూవీకి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన రా రాజా మూవీని మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి రా రాజా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను వెర్సటైల్ యాక్టర్, హీరో జేడీ చక్రవర్తి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు జేడీ చక్రవర్తి.
ముద్దు పెడితే హ్యాపీగా ఉంటుంది
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. “రా రాజా చిత్రానికి సంబంధించిన టైటిల్, పోస్టర్ చూస్తుంటేనే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మాములూగా అమ్మాయి హగ్ చేసుకుని, ముద్దు పెడితే హ్యాపీగా ఉంటుంది. కానీ, ఈ పోస్టర్‌లో అమ్మాయి అలా హగ్ చేసుకుంటున్నా కూడా భయమేస్తోంది” అని అన్నాడు.
చాలా ట్విస్టులు ఉన్నాయని
“రా రాజా పోస్టర్‌లో ఉన్న కలరింగ్, ఫాంట్, ట్యాగ్ లైన్ ఇవన్నీ చూస్తుంటే ఇందులో చాలా చాలా ట్విస్టులు ఉన్నాయని అర్థం అవుతోంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అసలు హీరో హీరోయిన్ల మొహాల్ని కూడా చూపించడం లేదు” అని జేడీ చక్రవర్తి తెలిపాడు.
ఏ హారర్ దర్శకుడు తీయలేదు
“ఒక్క మొహాన్ని కూడా చూపించకుండా భయపెట్టడం మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఏ హారర్ దర్శకుడు కూడా మొహం చూపించకుండా సినిమా తీయలేదు. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చేయడం గ్రేట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.
జేడీ చక్రవర్తి సినిమాలు
‘రా రాజా’ సినిమాను మార్చి 7న భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇదిలా ఉంటే, జేడీ చక్రకవర్తి నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్య, గులాబీ, మనీ, మనీ మనీ, బొంబాయి ప్రియుడు, అనగనగా ఒకరోజు వంటి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
జేడీ చక్రవర్తి ఓటీటీ ఎంట్రీ
ఇటీవల కాలంలో పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు జేడీ చక్రవర్తి. అయితే, 2023లో జేడీ చక్రవర్తి ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన దయ వెబ్ సిరీస్‌లో జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్ రోల్‌లో నటించాడు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు థ్రిల్లర్ సిరీస్ దయాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సంబంధిత కథనం