



Best Web Hosting Provider In India 2024

OTT Bold Web Series: ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ సీజన్ 3 పార్ట్ 2.. మరో ఐదు ఎపిసోడ్లు.. ఫ్రీగా చూసేయండి
OTT Bold Web Series: ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరో ఐదు ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎవరైనా ఫ్రీగా చూసే అవకాశం ఉండటం విశేషం.
OTT Bold Web Series: ఓటీటీలో అత్యంత బోల్డ్ కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ లలో ఒకటి ఆశ్రమ్ (Aashram). ఇప్పటికే రెండు పూర్తి సీజన్లు, మూడో సీజన్ పార్ట్ 1 రాగా.. తాజాగా మూడో సీజన్ పార్ట్ 2 కూడా అందుబాటులోకి వచ్చింది. బాబీ డియోల్, త్రిదా చౌదరి, అదితిలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ను ప్రకాశ్ ఝా డైరెక్ట్ చేశాడు.
ఆశ్రమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ పార్ట్ 2
ఏక్ బద్నాం ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ ప్రస్తుతం అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి నుంచీ ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఉన్న కంటెంట్ మొత్తం ఫ్రీగానే చూసే వీలుంది. ఈ ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో కొత్తగా వచ్చిన ఐదు ఎపిసోడ్లను కూడా ఉచితంగానే చూడొచ్చు.
“భక్తులారా.. బాబా నిరాళాను కలవడానికి వస్తారా లేదా? ఏక్ బద్నాం ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి వచ్చేసింది. ఇప్పుడే చూడండి.. పూర్తి ఉచితంగా” అనే క్యాప్షన్ తో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్స్ ట్వీట్ చేసింది.
కొత్త ఎపిసోడ్లు ఇలా..
ఆశ్రమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ లో మొత్తంగా ఐదు ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి. కోపా-భవన్, ప్రాయశ్చిత్, ప్రేమ్ పాశ్, కాలా సచ్, అగ్ని పరీక్ష పేరుతో ఈ ఎపిసోడ్లు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఈ కొత్త పార్ట్ ట్రైలర్ చూస్తుంటే.. బాబా నిరాళా(బాబీ డియోల్) నిజ స్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టి ఆశ్రమాన్ని మూయించడానికి పమ్మి (అదితి పోహంకర్) కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు బాబా నిరాళాతో సన్నిహితంగా ఉంటూనే ఇటు అతని రైట్ హ్యాండ్ బొప్పాను కవ్విస్తుంది. ఐదు ఎపిసోడ్ల ఈ పార్ట్ 2 ఆశ్రమ్ వెబ్ సిరీస్ కు ముగింపు పలికిందా లేదా చూడండి.
ఆశ్రమ్ వెబ్ సిరీస్ ఇలా..
ఆశ్రమ్ వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. తొలి సీజన్ ఆగస్ట్, 2020లో వచ్చింది. బోల్డ్ సీన్లతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సీజన్లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత అదే ఏడాది నవంబర్లో రెండో సీజన్ కూడా రిలీజ్ చేశారు. ఇందులోనూ 9 ఎపిసోడ్లు ఉన్నాయి.
జూన్ 2022లో మూడో సీజన్ పార్ట్ 1 వచ్చింది. అందులో పది ఎపిసోడ్లు ఉండటం విశేషం. మళ్లీ ఇన్నాళ్లకు అదే సీజన్ పార్ట్ 2 అంటూ కొత్తగా ఐదు ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. ఆశ్రమం పేరుతో బాబా నిరాళా చేసే అక్రమాలు, అమ్మాయిలను అనుభవించడం, వాటిని పమ్మి అనే ఓ రెజ్లర్ ఎలా ఎదుర్కొంది అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
సంబంధిత కథనం