



Best Web Hosting Provider In India 2024

Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 14 సినిమాలు- స్పెషల్‌గా 11, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 11 స్పెషల్ కాగా 8 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రెండు బోల్డ్, 2 హారర్, రివేంజ్ యాక్షన్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్లతో ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 27
డిమోన్ సిటీ (కొరియన్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 27
రన్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
గ్రేవ్‌యార్డ్ సీజన్ 2 (టర్కిష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
జిద్దీ గర్ల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ బోల్డ్ ఆండ్ అడల్ట్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
ఈటీవీ విన్ ఓటీటీ
కౌసల్య సుప్రజ రామా (తెలుగు డబ్బింగ్ కన్నడ రొమాంటికి డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 27
డిటెక్టివ్ కొనన్ కేస్ క్లోజ్‌డ్ ( తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కార్టూన్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
ది సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 27
బాల్ బాహుబలి (తెలుగు డబ్బింగ్ కార్టూన్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
అభిమన్యు కి ఏలియన్ ఫ్యామిలీ (తెలుగు డబ్బింగ్ హిందీ సైన్స్ ఫిక్షన్ కార్టూన్)- ఫిబ్రవరి 27
కిట్టీ ఈజ్ నాట్ ఏ క్యాట్ (తెలుగు డబ్బింగ్ ఆస్ట్రేలియన్ యానిమేషన్ మ్యూజికల్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ బోల్డ్ వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- ఫిబ్రవరి 27
బీటిల్‌జ్యూస్ బీటిల్‌జ్యూస్ (ఇంగ్లీష్ హారర్ కామెడీ సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 27
14 ఓటీటీ రిలీజ్
ఇలా ఇవాళ ఒక్కరోజే 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ హిందీ బోల్డ్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2, మరో తెలుగు డబ్బింగ్ అడల్ట్ కంటెంట్ సిరీస్ జిద్దీ గర్ల్స్, తెలుగు డబ్బింగ్ కన్నడ రొమాంటిక్ మూవీ కౌసల్య సుప్రజ రామా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
11 స్పెషల్-తెలుగులో 8
అలాగే, ఈటీవీ విన్ ఓటీటీలోని ఐదు తెలుగు డబ్బింగ్ యానిమేషన్ సిరీస్‌లు కూడా పిల్లలకు నచ్చే విధంగా ఉన్నాయి. వీటితోపాటు హారర్ కామెడీ మూవీ బీటిల్‌జ్యూస్ బీటిల్‌జ్యూస్, హారర్ థ్రిల్లర్ ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్, రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డిమోన్ సిటీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా 14లో 7 వెబ్ సిరీస్‌లు, 4 సినిమాలతో మొత్తంగా 11 స్పెషల్ కాగా వాటిలో 8 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్