



Best Web Hosting Provider In India 2024

Weight Loss With Rice: అన్నం తింటూనే బరువు తగ్గించుకోవడం ఎలా? ఫిట్‌నెస్ నిపుణులు పాటించే రహస్యం ఇదే!
Weight Loss With Rice: బరువు తగ్గాలంటే అన్నం మానేయాల్సిందేనా అని బాధపడుతున్నారా? చింతించకండి! కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే మీకు ఇష్టమైన అన్నం ప్రతిరోజూ తింటూనే మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
నేడు పెరుగుతున్న బరువుతో దాదాపు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఊబకాయం ఒంటరిగా రాదు బరువు పెరుగుదలను అదుపు చేయకపోతే, శరీరాన్ని అనేక రకాల అనారోగ్యాలకు నిలయంగా మారుస్తుంది. బరువు తగ్గే ప్రయత్నం చేసేవారు ముందుగా డైట్‌ను మార్చుకుంటారు. ఈ సమయంలో చాలామంది తమ ఆహారంలో చాలా వస్తువులను తొలగిస్తారు, వాటిలో ముఖ్యమైనది అన్నం. అన్నం తింటే బరువు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే అన్నంలో పిండి పదార్థాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
కానీ మొదటి నుంచీ ఉన్న అలవాటు కారణంగా రైస్ ప్రేమికులకు పూర్తిగా అన్నానికి దూరంగా ఉండటం అసాధ్యంగా మారుతుంది. అన్నం తినకుండా రోజు గడవటం కష్టమే అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే రైస్ డైట్ మీల్ ప్లాన్. దీనికి అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు పాటించారంటే అన్నం తింటూనే శరీర బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గే ప్రయత్నంలో అన్నం ఎలా తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పరిమాణం చాలా ముఖ్యం..
బరువు తగ్గే ప్రయత్నంలో అన్నం తినాలనుకుంటే, ముఖ్యంగా పరిమాణాన్ని నియంత్రించాలి. బరువు తగ్గడానికి ప్రధాన సూత్రం ఏమిటంటే, మీరు రోజులో తీసుకునే కేలరీల కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలి. అలా అయితే శరరీ బరువు తగ్గుతుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకుంటే తక్కువ పరిమాణంలో అన్నం తినండి. సుమారు అరకప్పు ఉడికించిన తెల్ల అన్నంలో 100-150 కేలరీలు ఉంటాయి. దీన్ని గుర్తుంచుకుని మీ డైట్ కు తగ్గట్టుగా అన్నం పరిమాణాన్ని తగ్గించి, కూరగాయలు లేదా పప్పును ఎక్కువగా తినండి.
తయారుచేసే విధానంలో జాగ్రత్తగా అవసరం..
బరువు తగ్గాలనుకుంటే మీరు అన్నం ఎలా ఉడికించుకుంటున్నారో కూడా చాలా ముఖ్యం. కొంతమంది అన్నం ఉడికించడానికి ఎక్కువ నూనె లేదా నెయ్యి వాడతారు, ఇది మీ బరువును తగ్గించడానికి బదులుగా పెంచుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన అన్నం కూడా శరరీ బరువును పెంచుతుంది. బదులుగా దాన్ని నేరుగా ఉడకబెట్టి తయారు చేయండి. ఇలా చేయడం వల్ల అన్నంలోని పిండి పదార్థాలు ఎక్కువగా తొలగిపోతాయి. అంతేకాకుండా, అన్నం ఉడికించే ముందు కొంతసేపు నీటిలో నానబెట్టండి. ఈ విధంగా అన్నం తయారు చేసి తింటే బరువు తగ్గడం విషయంలో చింత ఉండదు. .
ప్రోటీన్ల కలయిక తప్పనిసరి..
అన్నం తింటూనే బరువు తగ్గాలనుకనే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. అన్నంతో పాటు లీన్ ప్రోటీన్, ఎక్కువ కూరగాయలను తప్పక చేర్చాలి. ఇది సమతుల్య ఆహారాన్ని సిద్ధం చేస్తుంది, బరువు తగ్గే ప్రయత్నంలో చాలా సహాయపడుతుంది. మీరు అన్నంతో పాటు పప్పు, రాజ్మా, పనీర్, చన, గ్రిల్డ్ చికెన్ లేదా చేపలను జోడించవచ్చు. వాస్తవానికి, ప్రోటీన్ జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ శ్రమ పడుతుంది, దీనివల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అన్నంతో పాటు ఎక్కువ కూరగాయలను చేర్చినప్పుడు, ఇది మీ మొత్తం ఆహారాన్ని మరింత పోషకంగా చేస్తుంది, ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచుతుంది.
మరి కొన్ని ముఖ్య విషయాలు..
బరువు తగ్గే ప్రయత్నంలో అన్నం తీసుకునే ముందు మీరు మరికొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.
- అన్నంలో పుష్కలంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి, అన్నాన్ని పగటిపూట తినడానికి ప్రయత్నించండి. పగటిపూట అన్నం తింటే మీ శరీరానికి శక్తి లభిస్తుంది అలాగే కేలరీలను బర్న్ చేయడానికి సమయం కూడా లభిస్తుంది.
- రాత్రిపూట అన్నానికి దూరంగా ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. రాత్రిపూట అన్నం తింటే ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది.
- అంతేకాకుండా, మీ రోజువారీ కార్యక్రమంలో ఏదైనా శారీరక శ్రమను చేర్చడం మర్చిపోకండి. సరైన ఆహారం, వ్యాయామం కలయిక మాత్రమే మీ బరువు తగ్గే ప్రయత్నంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం