



Best Web Hosting Provider In India 2024

Woman Murder: మంత్రాల నెపంతో వృద్ధురాలి హత్య, వారం రోజుల తర్వాత మిస్టరీని ఛేదించిన పోలీసులు
Woman Murder: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మిస్టరీగా మారిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వారం రోజుల కిందట వృద్ధురాలిని గోనె సంచిలో కుక్కి, చేతులు కట్టేసి బావిలో పడేసిన ఘటన జిల్లాలో కలకలం రేపగా.. పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి నిందితులను గుర్తించారు.
Woman Murder: భూపాలపల్లి జిల్లాలో గోనె సంచెలో వృద్ధురాలి మృతదేహం మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ మేరకు అరెస్టుకు సంబంధించిన వివరాలను భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు బుధవారం వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన సొరపాక వీరమ్మ (70) ఉపాధి కోసం గ్రామంలోని చింత చెట్ల వద్ద చింతకాయలు ఏరుకుని, ఆ చింతపండును సమీపంలోని గర్మిళ్లపల్లిలో అమ్ముకునేది.
రోజువారీలాగే ఈ నెల 19న సాయంత్రం నాలుగు గంటల సుమారులో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తాను సేకరించిన చింతపండును గర్మిళ్లపల్లిలో అమ్మేందుకు వెళ్లగా సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటలు దాటినా వీరమ్మ ఇంటికి రాకపోవడంతో కొడుకులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ మాత్రం దొరకలేదు.
వ్యవసాయ బావిలో డెడ్ బాడీ
వీరమ్మ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ క్రమంలో బోయినపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో డెడ్ బాడీ ఉన్నట్టుగా గ్రామానికి చెందిన వ్యక్తులు గమనించి వీరమ్మ కొడుకులకు సమాచారం చేరవేశారు. అదృశ్యమైన ఐదు రోజుల తరువాత వీరమ్మ వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. దీంతో వాళ్లంతా షాక్ అయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వ్యవసాయ బావిలో డెడ్ బాడీ పడి ఉన్న తీరును చూసి కంగు తిన్నారు. వీరమ్మ డెడ్ బాడీ ఓ గోనె సంచిలో కుక్కినట్టు ఉండగా, చేతులు కట్టేసి ఉండటం చూసి అక్కడున్న వాళ్లంతా నివ్వెరపోయారు.
మంత్రాల నెపంతోనే హత్య
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బోయిని మల్లయ్య, పుట్టకొక్కుల శ్రీనివాస్, మద్దెల సిద్దు అనే ముగ్గురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయాన్ని ఒప్పుకున్నారు.
మంత్రాల చేస్తుందన్న అనుమానంతోనే వృద్ధురాలిని హత్య చేసినట్టు అంగీకరించారు. హత్య అనంతరం వృద్ధురాలు వీరమ్మ ఒంటి మీద రెండు తులాల బంగారం, 30 తులాల వరకు వెండి కడియాలు దోచుకుని, ఆమె చేతులు కట్టేసి, గోనె సంచిలో కుక్కి వ్యవసాయ బావిలో పడేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ డీఎస్పీ సంపత్ రావు వివరించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్