



Best Web Hosting Provider In India 2024

OTT Action Thriller: మూడో ఓటీటీలోకి కన్నడ స్టార్ హీరో యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Action Thriller: భైరాతి రణగల్ చిత్రం ఇప్పటికే రెండు ఓటీటీల్లో ఉంది. అయితే, ఇప్పుడు మరో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తోంది. మరో రెండు భాషల్లో అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు ఇవే..
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‍కుమార్ హీరోగా నటించిన భైరాతి రణగల్ చిత్రం మోస్తరుగా ఆడింది. గతేడాది నవంబర్ 15వ తేదీన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో కన్నడలో రిలీజైంది. చాలా అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ సినిమాకు నర్తన్ దర్శకత్వం వహించారు. భైరాతి రణగల్ మూవీ ఇప్పుడు మూడో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఎంట్రీ ఇస్తోంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
భైరాతి రణగల్ మూవీ రేపు (ఫిబ్రవరి 28) తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే కన్నడలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఉంది. తెలుగులో ఇటీవల మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు సన్‍నెక్స్ట్ ఓటీటీలోనూ అడుగుపెడుతోంది.
తెలుగులో ఇటీవలే..
భైరాతి రణగల్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లో ఇటీవలే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఫిబ్రవరి 13న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆహాలో అడుగుపెట్టింది. కన్నడలో ప్రైమ్ వీడియోలో గత డిసెంబర్‌లోనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఇదే నెలలో ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు తమిళం, మలయాళం డబ్బింగ్ వెర్షన్‍లలో సన్‍నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. దీంతో మూడు ఓటీటీల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.
భైరాతి రణగల్ మూవీలో టైటిల్ రోల్ పోషించారు శివ రాజ్‍కుమార్. నమ్మిన వారి కోసం లాయర్ నుంచి గ్యాంగ్‍స్టర్‌గా మారి పోరాడడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుంది. ఈ మూవీలో యాక్షన్‍తో మరోసారి మెప్పించారు శివ రాజ్‍కుమార్. ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కించారు డైరెక్టర్ నర్తన్.
శివ రాజ్‍కుమార్‌తో పాటు రుక్మిణి వసంత్, రాహుల్ బోస్, అవినాశ్, దేవరాజ్, ఛాయా సింగ్, షబీర్ కల్లరక్కల్ ఈ భైరాతి రణగల్ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. గీతా పిక్చర్స్ పతాకంపై గీతా శివరాజ్‍కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.
భైరాతి రణగల్ కలెక్షన్లు
భైరాతి రణగల్ చిత్రం సుమారు రూ.27కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం దాదాపు రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. బాక్సాఫీస్ మోస్తరుగా ఈ చిత్రం పర్ఫార్మ్ చేసింది. ఓపెనింగ్ బాగానే ఉన్నా ఆ తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్లు డ్రాప్ అయ్యాయి.
భైరాతి రణగల్ స్టోరీలైన్
నీటి సమస్యను ఎంత అడిగినా తీర్చకపోయే సరికి ప్రభుత్వ కార్యాలయంలో బాంబు పెడతాడు భైరాతి రణగల్ (శివ రాజ్‍కుమార్). ఈ కేసులో 21 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలులోనే ‘లా’ డిగ్రీ పూర్తి చేసి.. బయటికి వచ్చాక లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. స్టీల్ ఫ్యాక్టరీ యజమాని పరాండే (రాహుల్ బోస్).. చాలా మంది కార్మికులను పనిలో నుంచి తొలగిస్తాడు. వారి భూములను కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటాడు. ఈ కేసును భైరాతి రణగల్ చేపడతాడు. ఈ కేసులో తన ధన, అధికార బలం ఉపయోగించి పరాండే గెలుస్తాడు. దీంతో కార్మికులకు న్యాయం చేసేందుకు గ్యాంగ్‍స్టర్‌గా మారతాడు రణగల్. ఆ తర్వాత ఏం జరిగింది.. కార్మికులకు న్యాయం జరిగేలా భైరాతి రణగల్ చేశాడా అనేదే ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది.
సంబంధిత కథనం