AIIMS Bibinagar Recruitment 2025 : ఎయిమ్స్‌ బీబీనగర్‌లో 75 ఉద్యోగ ఖాళీలు – దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు

Best Web Hosting Provider In India 2024

AIIMS Bibinagar Recruitment 2025 : ఎయిమ్స్‌ బీబీనగర్‌లో 75 ఉద్యోగ ఖాళీలు – దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు

Maheshwaram Mahendra HT Telugu Feb 27, 2025 01:58 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 27, 2025 01:58 PM IST

AIIMS Bibinagar Recruitment 2025: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ లో సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు రేపటితో (ఫిబ్రవరి 28) పూర్తి కానుంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 75 ఉద్యోగాలు ఉన్నాయి.

ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగాలు
ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగాలు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నాన్ – అకడమిక్ కోటాలోని సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు రేపటితో(ఫిబ్రవరి 25) పూర్తి కానుంది. అర్హులైన వారు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 75 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హులైన వారు… ఫిబ్రవరి 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి.

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధింత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి.
  • ఎంసీఐ లేదా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవటంతో పాటు పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
  • వయసు 45 ఏళ్లు మించకూడదు. కొన్ని వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చూడొచ్చు
  • ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో ఏడాది కాలానికి రిక్రూట్ చేస్తున్నారు. పని తీరు ఆధారంగా మూడేళ్ల వరకు పొడిగించవచ్చు.
  • అర్హత కలిగిన అభ్యర్థులు ఎయిమ్స్ బీబీ నగర్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి.
  • జనరల్ అభ్యర్థులు రూ. 1770, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 1416 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు.
  • అభ్యర్థుల ధ్రువపత్రాలు, అర్హతలను పరిశీలించిన తర్వాత… షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
  • మార్చి 5వ తేదీ నుంచి ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆడిటోరియంలో ఉదయం 09. 30 గంటలకు వీటిని నిర్వహిస్తారు. మార్చి 7వ తేదీలోపు అన్ని విభాగాల ఇంటర్వ్యూలు పూర్తవుతాయి.
  • ఏమైనా సందేహాలు ఉంటే sr.aiimsbibinagar@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఆన్ లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫిటెట్, విద్యా అర్హత ధ్రువపత్రాలు, ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన పత్రాలు. యూజీ, పీజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, పని చేసిన అనుభవం ఉంటే సంబంధిత పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలను పొందవచ్చు…

ఈ లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ ను నింపవచ్చు….

 

Whats_app_banner

టాపిక్

RecruitmentJobs
Source / Credits

Best Web Hosting Provider In India 2024