


Best Web Hosting Provider In India 2024

Thalapathy Vijay: నా కెరీర్లో ఇదే చివరి సినిమా.. తర్వాత రాజకీయాలకే అంకితం: విజయ్ కామెంట్స్ వైరల్
Thalapathy Vijay: తమిళ స్టార్ దళపతి విజయ్ తన చివరి సినిమాపై నోరు విప్పాడు. తన పార్టీ తమిళగ వెట్రి కళగమ్ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం (ఫిబ్రవరి 26) విజయ్ మాట్లాడాడు.
Thalapathy Vijay: తమిళనాడులో మరో స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే అంకితం కాబోతున్నాడు. అతని పేరు దళపతి విజయ్. గతేడాదే పార్టీ పెట్టిన అతడు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతాడన్న పుకార్లకు విజయ్ చెక్ పెట్టాడు.
జన నాయగన్ చివరి సినిమా
దళపతి విజయ్ గతేడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే) అనే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పార్టీ వార్షికోత్సవం బుధవారం (ఫిబ్రవరి 26) జరిగింది. తమిళనాడులోని మామళ్లాపురంలో జరిగిన ఈ సభలో విజయ్ తన సినిమా కెరీర్ గురించి కూడా మాట్లాడినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు వెల్లడించింది
ప్రస్తుతం తన కెరీర్లో 69వ సినిమా అయిన జన నాయగన్ చేస్తున్నాడు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదే తన కెరీర్లో చివరి సినిమా అని, తన భవిష్యత్తు మొత్తం ఇక రాజకీయాలకే అంకితమని విజయ్ స్పష్టం చేశాడు. ఇప్పటికీ తమిళనాడులోని టాప్ నటుల్లో ఒకరైన విజయ్.. రాజకీయాల కోసం తన కెరీర్ ను అర్ధంతరంగా ముగిస్తుండటం గమనార్హం.
రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినా, ఎన్నికల్లో తలబడినా అటు సినిమాలు కూడా చేస్తాడని, విజయ్ కూడా పార్ట్ టైమ్ పొలిటీషియనే అన్న విమర్శల మధ్య అతడు తన భవిష్యత్తు గురించి స్పష్టమైన సందేశం ఇచ్చాడు. తన మిగిలిన జీవితం ప్రజా సేవకే అంకితమని అనడం విశేషం.
తమిళగ వెట్రి కళగమ్ పార్టీ
దళపతి విజయ్ గతేడాది తమిళగ వెట్రి కళగమ్ అనే పార్టీ పెట్టాడు. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా అప్పుడే చెప్పాడు. ఇక గతేడాది అక్టోబర్ లో పార్టీ తొలి సభ నిర్వహించాడు. అంతకుముందే అంటే సెప్టెంబర్లోనే విజయ్ 69వ మూవీ కన్ఫమ్ అయింది.
హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో జన నాయగన్ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో విజయ్ ఓ కొరఢా ఝులిపిస్తూ కనిపించాడు. దీంతో అప్పుడే అతన్ని చాలా మంది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎంజీ రామచంద్రన్ తో పోల్చారు.
పొలిటికల్ టచ్ ఉన్న సినిమాతోనే తన కెరీర్ ముగించి.. తర్వాత అదే పాలిటిక్స్ లోకి పూర్తిగా విజయ్ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. ఈ జన నాయగన్ మూవీలో దళపతి విజయ్ తోపాటు పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. నిజానికి ఇది బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ రీమేక్ అనే వార్తలు వచ్చినా.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
సంబంధిత కథనం