



Best Web Hosting Provider In India 2024

AP TG MLC Elections 2025 : ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ – మార్చి 3న ఓట్ల కౌంటింగ్
AP Telangana MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో నిలుచుకున్నవారికి ఓటింగ్ కు అధికారులు అవకాశం కల్పించారు. మార్చి 3వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.
ఏపీ, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే క్యూలైన్లో నిలుచుకున్నవారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా… అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా… పోలింగ్ ప్రక్రియ ముందుకు సాగింది.
ఏపీలో మూడు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగగా… క్యూలైన్లలో ఉన్న ఓటర్లు అందరూ ఓటును వినియోగించుకోనున్నారు. ఆ తర్వాతే పోలింగ్ శాతాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా… తెలంగాణలోనూ ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ స్థానాలకు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే… టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది.
మార్చి 3వ తేదీన ఫలితాలు…
ఏపీ, తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను మార్చి 3వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లను తరలించి… గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
టాపిక్