


Best Web Hosting Provider In India 2024

Kidney Health: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ సంకేతాలు కనిపిస్తే మీ కిడ్నీలు దెబ్బతింటున్నాయని అర్థం
Kidney Health: మూత్రపిండాలు దెబ్బతింటే శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఆ సంకేతాలను ఎంతో మంది విస్మరిస్తారు. ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు చెడిపోయినట్టు అర్థం చేసుకోవాలి.
శరీరంలో పేరుకుపోయిన విషాలు, వ్యర్ధాలను, మురికిని శుభ్రం చేసే పని కిడ్నీలదే. అందుకే మన శరీరంలోని అత్యవసర భాగాల్లో కిడ్నీలు ముఖ్యమైనవి. రక్తంలోని మలినాలను కూడా వడపోసి శరీరం నుంచి బయటికి పంపుతాయి. కిడ్నీలు ఇవి సరిగా పనిచేయకపోతే శరీరంలో టాక్సిన్స్ పేరుకు పోతాయి. దీని వల్ల శరీరంలోని ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి కిడ్నీలు సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
కిడ్నీలు ఎప్పుడైతే చెడిపోవడం ప్రారంభమవుతాయో ఆ లక్షణాలు కొన్ని శరీరం మీకు తెలియజేస్తుంది. ఉదయం లేచిన వెంటనే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మీరు కిడ్నీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది.
కాళ్లల్లో వాపు
ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ పాదాలలో వాపు కనిపిస్తే దానిని అశ్రద్ధ చేయకండి. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా కాళ్లలో వాపు ఉంటే అది మూత్రపిండాల వల్లేనని అర్థం చేసుకోవచ్చు. శరీరంలో ద్రవం, సోడియం పెరగడం వల్ల పాదాలలో వాపు వస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతేనే పాదాలలో ఇలా వాపు కనిపిస్తుంది.
అలసట
రాత్రి బాగా నిద్రపోయాక కూడా ఉదయం లేచాక అలసిపోయినట్టు అనిపిస్తే అది మూత్రపిండాలు చెడిపోయాయని చెప్పే లక్షణమే. రక్తంలో పేరుకుపోయిన మలినాలు శరీరం నుండి బయటకు పోలేవు. దీనివల్ల శరీరం బలహీనంగా మారుతుంది. అలసటగా అనిపిస్తుంది.
కళ్ళ చుట్టూ వాపు
మూత్ర పిండాలు సరిగా పనిచేయకపోతే ఆ ప్రభావం కళ్ల ద్వారా కూడా తెలుస్తుంది. కళ్ల కింద చర్మం వాచినట్టు కనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోకూడదు. మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగినప్పుడు చర్మం లో ఇలా వాపు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కచ్చితంగా వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
మూత్రపిండాల ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాని అనారోగ్యాలు ముదిరిపోతే కిడ్నీ వైఫల్యానికి దారి తీయవచ్చు. ఇది మరింత సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ చెప్పిన లక్షణాలు ఒక్కసారి కనిపించినా కూడా ఓసారి కిడ్నీ టెస్ట్ ను చేయించుకోవడం ఉత్తమం.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్