Best Web Hosting Provider In India 2024

Pavitra Lokesh in New Telugu Serial: తెలుగు టీవీ సీరియల్‍లో కీలకపాత్రలో పవిత్ర లోకేశ్.. టెలికాస్ట్ ఎప్పుడంటే..
Pavitra Lokesh in New Telugu Serial: కొత్తగా వస్తున్న లక్ష్మీ నివాసం టీవీ సీరియల్‍లో పవిత్రా లోకేశ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ప్రోమో వచ్చింది. ఈ సీరియల్ టెలికాస్ట్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.
సీనియర్ నటి పవిత్రా లోకేశ్ ఓ తెలుగు టీవీ సిరీయల్‍లో కీలకపాత్ర పోషించనున్నారు. నటుడు నరేశ్‍ను వివాహం చేసుకున్న తర్వాతి నుంచి వరుసగా వార్తల్లో నిలిచారు పవిత్ర. ఆమెకు ఇది మూడో పెళ్లి కాగా.. నరేశ్‍కు నాలుగోది కావడం పెద్ద చర్చనీయాంశం అయింది. మరోవైపు సినిమాల్లోనూ నరేశ్, పవిత్ర వరుసగా నటిస్తున్నారు. కాగా, తాజాగా ఓ కొత్త తెలుగు టీవీ సీరియల్‍లో పవిత్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రోమో కూడా రావడంతో ఇది కన్ఫర్మ్ అయింది. ఆ సీరియల్ ఏదంటే..
లక్ష్మీ నివాసం సీరియల్‍లో..
లక్ష్మీ నివాసం అనే తెలుగు టీవీ సీరియల్‍లో పవిత్రా లోకేశ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఈ సీరియల్ ప్రసారం కానుంది. పవిత్రకు సంబంధించిన ప్రోమోను తాజాగా ఆ ఛానెల్ తీసుకొచ్చింది. కల్కి రాజా, పవిత్ర జోడీగా ఈ సిరీయల్‍లో నటిస్తున్నారని ప్రోమో ద్వారా అర్థమవుతోంది. ఓ పాప కూడా ఈ ప్రోమోలో ఉంది. మరి పవిత్రది ఈ సీరియల్‍లో ఎలాంటి పాత్రనో చూడాలి.
టెలికాస్ట్ ఎప్పటి నుంచి..
లక్ష్మీ నివాసం సీరియల్ మార్చి 3వ తేదీ నుంచి సాయంత్రం 7 గంటలకు ప్రతీ రోజు జీ తెలుగు ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ అధికారికంగా ప్రకటించింది.
లక్ష్మీ నివాసం సీరియల్‍లో ఛత్రపతి శేఖర్, శ్రీరంజనీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఇద్దరూ ఉన్న ప్రోమోలు ఇప్పటి వరకు చాలా వచ్చాయి. త్వరలో అంటూ ఈ సీరియల్ విషయంలో చాలా రోజులుగా జీ తెలుగు ఊరిస్తూ వచ్చింది. కొన్ని ప్రోమోలు తెచ్చింది. అయితే, మార్చి 3 నుంచి ఈ లక్ష్మీ నివాసం సీరియల్‍ను టెలికాస్ట్ చేయనున్నట్టు తాజాగా వెల్లడించింది.
లక్ష్మీ నివాసం సీరియల్‍లో శ్రీనివాస్ పాత్రలో శేఖర్ నటిస్తుండగా.. అతడి భార్య లక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్నారు శ్రీరంజనీ. భార్యకు ఇల్లు కట్టిస్తానని గతంలో మాట ఇచ్చి ఉంటాడు శ్రీనివాస్. కూతుళ్ల పెళ్లిళ్ల గురించి లక్ష్మీ ఆలోచిస్తుంటుంది. రిటైర్మెంట్ డబ్బుతో ఇల్లు కట్టాలని శ్రీనివాస్ అనుకుంటాడు. అయితే, బండి కోసమని తన కొడుకు, కట్నం బాకీ అని కూతురు డబ్బులు తీసుకుంటారు. మరో కూతురికి పెళ్లి కావాల్సి ఉంటుంది. ఈ ప్రోమో ఇటీవల వచ్చింది. కథ ఎలా సాగుతుందో చూడాలి.
లక్ష్మీ నివాసం సీరియల్ మార్చి 3 నుంచి సాయంత్రం 7 గంటలకు జీ తెలుగులో రానుంది. అయితే, ప్రస్తుతం ఆ టైమ్‍లో వస్తున్న నిండు నూరేళ్ల సావాసం ఏ సమయానికి మారుతుందో జీ తెలుగు వెల్లడించాల్సి ఉంది.
సంబంధిత కథనం