Posani Remand: సినీ నటుడు పోసానికి 14 రోజుల రిమాండ్, 7గంటల పాటు వాదనలు.. రాజంపేట జైలుకు తరలింపు

Best Web Hosting Provider In India 2024

Posani Remand: సినీ నటుడు పోసానికి 14 రోజుల రిమాండ్, 7గంటల పాటు వాదనలు.. రాజంపేట జైలుకు తరలింపు

Posani Remand: సినీనటుడు పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14రోజుల విధించారు. బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోసానిని గురువారం దాదాపు 9 గంటల పాటు విచారించారు. రాత్రి పది గంటలకు కోర్టులో హాజరు పరిచారు.

 
పవన్‌ కళ్యాణ్‌ను దూషించిన కేసులో పోసానికి 14రోజుల రిమాండ్‌
పవన్‌ కళ్యాణ్‌ను దూషించిన కేసులో పోసానికి 14రోజుల రిమాండ్‌
 

Posani Remand: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. పోసానిని రాజంపేట జైలుకు తరలించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లెకు తరలించారు.

 

పోసాని కృష్ణ మురళిని గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు 9 గంటల పాటు విచారించారు. రాత్రి పది గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం 5 గంటల వరకు ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు.

చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ సహా ప్రతిపక్ష నేతలను అసభ్యంగా దూషించిన కేసులో పోసానిపై ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తన వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో పోసానిని ఓబులవారిపల్లె తీసుకొచ్చారు. వైద్యపరీక్షలు చేయించి, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని నివేదిక వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిం చారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎస్సీ వి. విద్యాసాగరా నాయుడు పోసానిని ప్రశ్నించారు.

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు పోసానిని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌లను ఎందుకు తిట్టారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరు ఆదేశిస్తే తిట్టారని, ఎవరైనా ముందుగా స్క్రిప్ట్‌ రాసిచ్చారా అని ప్రశ్నలు వేశారు. విచారణ అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోసానిని రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచారు. పోసాని తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

 

పోసాని వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఆయనపై కేసు పెట్టినట్టు చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్‌ మణి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకుల తల్లి, భార్య, బిడ్డల గురించీ ఇష్టమొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ మీద చేసిన వ్యాఖ్యలు మమ్మల్నెంతో బాధపెట్టాయని పవన్ కల్యాణ్ తల్లి, భార్యల పై అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర మాట్లాడారని జోగినేని మణి చెప్పారు. పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలని గత్లో పోసానిపై ఫిర్యాదు చేస్తే అసలు తీసుకోలేదన్నారు. చర్యలు తీసుకోపోవడంతో ఈ నెల 24న మరోసారి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

 

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
Andhra Pradesh NewsJanasenaYsrcpYs JaganTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024