Brahmamudi February 28th Episode: వైన్ షాపులో కోటర్ అడిగిన కావ్య- సాక్షితో అప్పు ఎంట్రీ- ఖంగుతిన్న అనామిక- నిజం బయటకు!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi February 28th Episode: వైన్ షాపులో కోటర్ అడిగిన కావ్య- సాక్షితో అప్పు ఎంట్రీ- ఖంగుతిన్న అనామిక- నిజం బయటకు!

Brahmamudi Serial February 28th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 28 ఎపిసోడ్‌లో ఫ్యాక్టరీలో తను బయటకు వచ్చినప్పుడు కోటర్ కమలేష్ ఉన్నాడని చెబుతాడు రాజ్. దాంతో అతని కోసం కావ్య, అప్పు వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే వైన్ షాప్‌లో కావ్య కోటర్ అని అడుగుతుంది. దాంతో కోటర్ కమలేష్ అని అప్పు చెబుతుంది.

 
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 28వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 28వ తేది ఎపిసోడ్
 

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మీకు అనామిక ఫ్రెండే కదా. అక్కడ ఏం జరిగిందో కాస్తా అడిగి చెబుతారా. నేను నోరు విప్పితే నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. మీరు ఏనాడు అయినా మీ కొడుకు గురించి తప్పితే కనీసం మనవరాలి మీదైన ప్రేమ పుట్టిందా. అప్పును టార్గెట్ చేయడం ఇక ఆపండి. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్లం మిమ్మల్ని టార్గెట్ చేయడం మొదలుపెడితే మీరు తట్టుకేలేరు అని కావ్య అంటుంది.

 

ఎలా బెదిరిస్తుందో

చూశావా అన్నయ్య ఎలా బెదిరిస్తుందో అని రుద్రాణి అంటుంది. మధ్యలో నీ గొడవ ఏంటీ రుద్రాణి. మనకు ఎక్కువ టైమ్ లేదు. 24 గంటలే ఉంది. రాజ్‌ను కోర్టులో హాజరు పరిచే సమయమే ఉంది. రేపటిలోగా హంతకుడిని పట్టుకోలేకపోతే రాజ్ జీవితాంతం జైలులోనే బతకాలి. దాని గురించి ఏం చేయాలో ఎలా చేయాలో అది ఆలోచిద్దాం ఫస్ట్ అని చెప్పి వెళ్లిపోతాడు సుభాష్. అపర్ణ కుమిలిపోతుంటుంది. తర్వాత రాత్రి రాజ్‌కు కావ్య భోజనం తీసుకొస్తుంది.

త్వరగా వచ్చేయండి అని కావ్యకు చెప్పి రాజ్ దగ్గరికి పంపిస్తుంది కానిస్టేబుల్. ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నట్లు హుమ్ అంటాడు రాజ్. ధైర్యం పోయిందా అని కావ్య అంటే.. నా ఎదురుగానే కూర్చుంది. నా ధైర్యం నువ్వేగా అని రాజ్ అంటాడు. నాలో ధైర్యం కాస్తా సన్నగిల్లింది. నేను మీకు సహాయం చేయకపోగా సమస్యను మరింత పెద్దదిగా చేశానేమో. ఇంట్లో అంతా టెన్షన్ పడుతున్నారు అని కావ్య అంటుంది. తెలుసు వాళ్లకు నమ్మకం పోయింది అని రాజ్ అంటాడు.

నాలో కూడా నమ్మకం పోయింది అని కావ్య అంటుంది. ఓయ్.. నువ్ అలా అంటే ఎలా. నేను ఇక్కడ ఉండాలా. నేను వెంటనే బయటకు రావాలి. బూత్ బంగ్లాకు వెళ్లాలి. పిల్లలను కనాలి అని రాజ్ అంటాడు. దాంతో కావ్య నవ్వుతుంది. తానే తింటానని రాజ్ భోజనం చేస్తాడు. కావ్య దిగాలుగా ఉండి తర్వాత ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోమ్మని. నేరం జరిగిన కోణంలో ఆలోచించండి. కారు ఎక్కడ పెట్టారు అని కావ్య అడుగుతుంది.

 

రూట్ మార్చి అడుగుదాం

ఫ్యాక్టరీ బయటే పెట్టాను. బయటకు రావడానికి 20 నిమిషాలు పట్టింది అని రాజ్ అంటాడు. ఇంట్లో సెక్యూరిటీని దాటి శవాన్ని పెట్టడం కుదరదు. ఫ్యాక్టరీలోనే పెట్టు ఉంటారు. అక్కడ ఎవరైనా ఉన్నారు అప్పుడు అని కావ్య అడుగుతుంది. అప్పుడు రాజ్ ఫ్యాక్టరీలోకి వెళ్లి వచ్చాక ఓ తాగుబోతు ఉండటాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇతనికి మంచి మనసున్నట్టుంది. హెల్ప్ చేసే గుణం ఉంది. ఈసారి కోటర్ కోసం కాకుండా రూట్ మార్చి అడుగుదాం అని తాగుబోతు అనుకుంటాడు.

హలో బాస్.. ఐయామ్ కమలేష్.. పోస్ట్ గ్రాడ్యూయేట్. నో జాబ్, నో ఫుడ్, అంగ్రీ స్టమక్. గివ్ మీ ఓన్లీ 55 రుపీస్ ప్లీజ్ అని తాగుబోతు అంటాడు. దాంతో రాజ్ 500 ఇస్తాడు. దానికి మరింత సంబరపడి మహాత్ముడు మనిషి రూపంలో వచ్చాడు అని కమలేష్ అంటాడు. ఆ విషయం కావ్యకు రాజ్ చెబుతాడు. అంటే మీరు బయటకు వచ్చేసమయానికి వాడు ఉండే ఉంటాడు. కారులో బాడీ పెట్టడం చూసే ఉంటాడు. లేదా అక్కడ ఎవరున్నారో చూసి ఉంటాడు. అతని పేరేంటీ అని కావ్య అడుగుతుంది.

కోటర్ కమలేష్ అని రాజ్ అంటాడు. ఒకదారి దొరికింది. అప్పుతో చెప్పాలి అని కావ్య అనుకుంటుంది. నువ్ భోజనం చేశావా అని రాజ్ అడిగితే.. ముందు చేసినట్లు చెప్పి తర్వాత లేదని అంటుంది కావ్య. దాంతో కావ్యకు రాజ్ భోజనం తినిపిస్తాడు. ఇంకెప్పుడు ఇలా తిన్నానని అబద్ధాలు చెప్పకు అని రాజ్ అంటాడు. తర్వాత దేవుడు మనకు చిన్న దారి చూపించాడు అని అప్పుతో రాజ్ చెప్పిన విషయం చెబుతుంది కావ్య. అతను తాగుబోతు అని బావ చెప్పారు. ఎలా పట్టుకోవడం అని కావ్య అంటుంది.

 

బావను కాపాడొచ్చనే కదా

చుట్టు పక్కల ఉన్న వైన్ షాపులో చూస్తే సరిపోతుందని అప్పు అంటుంది. కానీ, అతన్ని మనం చూడలేదు కదా. బావ కూడా చీకట్లో సరిగా చూడలేదట అని కావ్య అంటుంది. అతని పేరు ఒక్కటి చాలు. అదే మనకు ప్లస్ అవుతుంది. ఇలాంటి పేర్లు పెట్టుకున్నవాళ్లు పదే పదే వాళ్ల పేరు చెప్పి డబ్బులు అడుగుతుంటారు అని అప్పు అంటుంది. రేపే జడ్జిమెంట్ వాడు దొరక్కపోతే అని కావ్య అంటుంది. దారి లేదనుకున్న మనకు ఈ అవకాశం దేవుడు తీసుకొచ్చాడంటే బావను కాపాడొచ్చనే కదా అని అప్పు అంటుంది.

ఆ తాగుబోతోడు ఎక్కడ ఉన్నాడో. అసలు ఈ మర్డర్‌ని వాడు చూశాడో లేదో. దేవుడా ఏదో ఒకటి చేసి వాడికి అన్ని నిజాలు తెలిసేలా చేయి స్వామి అని కావ్య కోరుకుంటుంది. తర్వాత మరుసటి రోజు ఉదయం అంతా దిగాలుగా ఉంటారు. తీర్పు ఏమొస్తుందో మనకు తెలియదు. వాడికి శిక్ష పడితే అది విని తట్టుకునే శక్తి నాకు లేదని అపర్ణ కోర్టుకు రానని చెబుతుంది. రాజ్‌ను నిర్దోషిగా తీసుకొస్తామని అప్పు, కావ్య వెళ్లారు. వాళ్లు ఏం సాధిస్తారో తెలియదు. వాళ్లు హంతకుడుని నిజంగా పట్టుకుంటారో తెలియదు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

 

మంచి జరగలాని, న్యాయం జరగాలని కోరుకోండి. వ్యతిరేకంగా మాట్లాడకండి అని ఇందిరాదేవి అంటుంది. ఇంట్లో ధైర్యంగా నిలబడేది నువ్వే. నువ్వే ఇలా నెగెటివ్‌గా మాట్లాడితే ఎలా. కావ్య, అప్పు మీద నాకు నమ్మకం ఉంది. రాజ్ మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. మనం కనపడకపోతే మరింత కుంగిపోతాడు. వాడికి ధైర్యం చెప్పడానికి అయినా మనం ఉండాలి నచ్చజెప్పి అపర్ణను తీసుకెళ్తాడు సుభాష్. వీళ్లు ఇంత ధీమాగా ఉన్నారేంటీ. నిజంగా అప్పు కావ్య సాక్ష్యాలు తెస్తారా అని రాహుల్ అంటాడు.

మందు కోసం వచ్చారనుకుంటారేమో

వాళ్లు ఏం చేసినా ఈలోపే చేయాలి. వాళ్ల వల్ల కాదు. రాజ్ జైలుకు వెళ్లడం ఖాయం అని రుద్రాణి అంటే.. ఆస్తి మనకు దక్కడం ఖాయం అని రాహుల్ అంటాడు. అప్పు, కావ్య కోటర్ కమలేష్ గురించి వెతుకుతారు. ఒకతన్ని అడిగితే వైన్ షాప్ కౌంటర్ దగ్గర అడగమని చెబుతాడు. అలా వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మందు కోసం వచ్చారనుకుంటారేమోనే అని కావ్య అంటుంది. తప్పదు పదా అని అప్పు తీసుకెళ్తుంది. వాళ్లను అక్కడున్నవాళ్లు అదోలా చూస్తుంటారు.

చెప్పండి ఏం కావాలి అని వైన్ షాప్ అతను అంటే.. కోటర్ కావాలి అని కావ్య అంటుంది. ఏం బ్రాండ్ అని అతను అడుగుతాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. సారీ భయ్యా. కోటర్ కాదు. కోటర్ కమలేష్ కావాలి అని అప్పు అంటుంది. మాకంటే లోపల తాగేవాళ్లకు బాగా తెలుసు అడగండి అని అతను అంటాడు. పర్మిట్ రూమ్‌లోకి వెళ్లి కోటర్ కమలేష్ గురించి అడుగుతారు. వాళ్లకు తెలియదంటారు. నిజం చెప్పండి అని అప్పు అంటే.. నిజమే. తాగుబోతులు ఎప్పుడైనా అబద్ధం చెప్పడం చూశావా అని తాగుబోతు అంటాడు.

 

మరోవైపు కోర్టులో అప్పు, కావ్య సాక్ష్యాల కోసం వెళ్లారు ఇంకా రాలేదేంటి అని రాజ్‌ను లాయర్ అడుగుతాడు. నాకు తెలియదు. కల్యాణ్‌కు చెప్పండి కనుక్కుని చెబుతాడు అని రాజ్ అంటాడు. మళ్లీ వాయిదా అడిగితే బాగుండదు. ఒకవేళ వాళ్లు రాకుంటే అనామిక గురించి చెప్పండి. మిగతాది నేను కంటిన్యూ చేస్తాను అని లాయర్ అంటాడు. తర్వాత కల్యాణ్‌ను వెళ్లి కావ్య అప్పు గురించి అడుగుతాడు లాయర్. ఇంకా సెర్చింగ్‌లోనే ఉన్నారట. ఎలాగైనా పట్టుకుంటారట అని కల్యాణ్ చెబుతాడు.

మీరే పారేసుకుంటారు

తర్వాత ఏంటీ డిఫెన్స్ లాయర్ గారు. మీ సాక్షులు ఇంకా రానట్టున్నారు. ఈసారి ఏం పారేసుకుంటారు పెన్నా, వాచా అని అనామిక లాయర్ అంటాడు. ఈసారి మీరే పారేసుకుంటారు. మీ కేసును అని రాజ్ లాయర్ అంటాడు. మరోవైపు ఒకతను కోటర్ కమలేష్ గురించి తెలుసు అని, కానీ, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో తెలియదు. వాడు ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అమ్మా అని అతను అంటాడు. ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేస్తారా గ్రేటే అని కావ్య అంటుంది. ఎయిర్ ఫోర్స్ జాబ్ అంటే గాలికి తిరిగే బ్యాచ్ అని. మీరింకాసేపు ఇక్కడే ఉంటే దొరికే ఛాన్స్ ఉందమ్మా అని అతను వెళ్లిపోతాడు.

 

ఎలాగైనా పట్టుకోవాలి. అతనే మనకు పెద్ద సాక్ష్యం అవుతారు. తర్వాత జడ్జ్ వచ్చి డిఫెన్స్ గారు మీ వాషింగ్ మెషిన్ బాగైందా అని అడుగుతాడు. ఈసారి కొత్తదే కొన్నాను అని లాయర్ అంటాడు. దాంతో అంతా నవ్వుతారు. మీరు చాలా తెలివైనవారు. మంచి పనే చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూట్ ప్రొసీడ్ కాండి అని జడ్జ్ అంటాడు. రాజ్‌ను మీరు ఇప్పటికైనా ఒప్పుకుంటారా అని లాయర్ అంటాడు. దాంతో జడ్జ్‌తో ఒక్క నిమిషం మాట్లాడేందుకు రాజ్ పర్మిషన్ తీసుకుంటాడు.

నేను నిజంగా నిర్దోషిని. సాక్షి కంటే ఆత్మసాక్షి గొప్పది అంటే కోర్ట్ నమ్మదు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు. చనిపోయిన సామంత్ ప్రియురాలు ఆ అనామిక అని రాజ్ అంటాడు. దాంతో అనామిక కంగు తిని షాక్ అవుతుంది. ఆమె ఇక్కడ ఉందా అని జడ్జ్ అడిగితే అనామికను చూపిస్తాడు పీపీ. ఆమెకు ఏం అవసరం అని జడ్జ్ అంటాడు. అది నేను చెబితాను. అనామిక గురించి మొత్తం చెబుతాడు డిఫెన్స్ లాయర్.

సాక్షితో అప్పు ఎంట్రీ

విడాకుల కేసులో అనామిక క్రిమినల్ మెంటాలిటీ మొత్తం బయటపెట్టడం జరిగింది. అదే పగ, కక్ష కట్టి రాజ్ కంపెనీకి నష్టాలు కలిగేలా మోసాలు, దాడులు చేయించింది అని రాజ్ లాయర్ చెబుతాడు. తర్వాత ఈ హత్య రాజ్ చేసినట్లే అన్ని ఆధారాలు చూపిస్తున్నాయని అనామిక లాయర్ వాదిస్తుంటే.. అప్పు, కావ్య సాక్షి తాగుబోతు కమలేష్‌తో ఎంట్రీ ఇస్తారు. అది చూసి అనామిక షాక్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024