Womens Day Wishes 2025: ప్రతి స్త్రీని గౌరవించేలా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Best Web Hosting Provider In India 2024

Womens Day Wishes 2025: ప్రతి స్త్రీని గౌరవించేలా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Haritha Chappa HT Telugu
Published Mar 07, 2025 03:00 PM IST

Womens Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల బలాన్ని, శక్తిని సూచిస్తుంది. వారిని గౌరవించే విధంగా ఉమెన్స్ డేకు శుభాకాంక్షలు తెలపండి.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు (Pixabay)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం. ఒక మగవాడి విజయం వెనుక ఒక తల్లి, చెల్లి, అక్క, కూతురు…ఇలా ఎవరో ఒక స్త్రీమూర్తి ఉండే ఉంటారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ జీవితంలో మీకు అండగా నిలిచిన మహిళలకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడ ఎన్నో అందమైన కోట్స్ ఉన్నాయి. వీటిని మెసేజులు, వాట్సప్ రూపంలో పంపించండి.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులో

1. ఒక బలమైన స్త్రీ తన కోసమే కాదు

ఇతరుల కోసం కూడా నిలబడుతుంది

పోరాడుతుంది

అలాంటి మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే

2. ఒక అమ్మాయికి స్వేచ్ఛను

మద్దతును ఇచ్చి చూడండి

ఆమె ప్రపంచాన్ని జయించగలదు

హ్యాపీ ఉమెన్స్ డే

3. స్త్రీలే సమాజానికి నిజమైన వాస్తుశిల్పులు

ఇంటి నుండి ఆఫీసుల వరకు దేనినైనా

మహిళలు అందంగా నిర్మించగలరు

అలాంటి స్త్రీలకు హ్యాపీ ఉమెన్స్ డే

4. నాకు తెలిసిన అత్యంత

అద్భుతమైన మహిళకు

ఉమెన్స్ డే శుభాకాంక్షలు

5. మీరు మనలో చాలామందికి ప్రేరణ

మీరు నా జీవితంలో ఉన్నందుకు

నేను ఎంతో అదృష్టవంతుడిని

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

6. ఈ ప్రపంచంలో ఉన్న

అద్భుతమైన మహిళలందరికీ

హ్యాపీ ఉమెన్స్ డే

7. ధైర్యం, సంకల్పం, దయ

మహిళలకు ఉన్న ఈ గుణాలే

ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

8. ప్రపంచంలోని ప్రతి విజయవంతమైన

సమాజం వెనుక ఒక బలమైన

సాధికారిత కలిగిన మహిళ ఉండే ఉంటుంది

హ్యాపీ ఉమెన్స్ డే

9. స్త్రీ అంటే ప్రకృతి ఇచ్చిన శక్తి

ప్రేరణకు మూలం, ఆశా జీవి

ఆమెను గౌరవించడం మనందరి విధి

హ్యాపీ ఉమెన్స్ డే

10. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా

జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ

స్త్రీ ఉనికి లేని జీవమే లేదు

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

11. మీకు ప్రేమ, నవ్వు, విజయంతో కూడిన

జీవితం అందాలని కోరుకుంటున్నాను

హ్యాపీ ఉమెన్స్ డే

12. ప్రతి గొప్ప విజయం వెనుక

దృఢ సంకల్పం ఉన్న ఒక స్త్రీ ఉంటుంది

ఆమె అడ్డంకులను ఛేదిస్తూ ముందుకు వెళుతుంది

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

13. నా జీవితంలోని

అద్భుతమైన స్త్రీ మూర్తులకు

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మీ దయ, బలం, ప్రేమే నన్ను ముందుకు నడిపించాయి

14. స్త్రీ హృదయం అంతులేని ప్రేమకు పునాది

ఆమె ఆత్మ అనంతమైన కలలను మోస్తుంది

ఆ కలలను సాకారం చేసుకునే సహకారాన్ని

మనందరం ఇవ్వాల్సిందే

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

15. మహిళలూ..

మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడూ ఆపకండి

ఎందుకంటే అదే మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తుంది

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

16. ఒక స్త్రీ అందం ఆమె హృదయంలో ఉంటుంది.

ఆమె బలం ఆమె ఆత్మలో ఉంటుంది.

అందుకే మహిళలు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారు

హ్యాపీ ఉమెన్స్ డే

17. మీరే నా మొదటి గురువు

నా ప్రాణ స్నేహితురాలు

నాకు ప్రేరణ

అలాంటి మీకు ప్రత్యేకంగా

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

18. మీ త్యాగాలు, ప్రేమ, అంతులేని సంరక్షణ

నాకు విజయాన్ని అందించాయి

నా ఆనందానికి మీరే మూలం

హ్యాపీ ఉమెన్స్ డే

19. అడ్డంకులను బద్దలు కొట్టి

కొత్త ఎత్తులను సాధించేందుకు

అడుగు ముందుకే వెయ్యండి

ప్రపంచానికి మీలాంటి మహిళలే అవసరం.

హ్యాపీ ఉమెన్స్ డే

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024