Amaravati : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. కొణిదెల నాగబాబు నామినేషన్

Best Web Hosting Provider In India 2024

Amaravati : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. కొణిదెల నాగబాబు నామినేషన్

Basani Shiva Kumar HT Telugu Published Mar 07, 2025 04:18 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Published Mar 07, 2025 04:18 PM IST

Amaravati : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని నారా లోకేష్, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు బలపరిచారు. నాగబాబు నామినేషన్ సందర్భంగా కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

నామినేషన్ సమర్పిస్తున్న నాగబాబు
నామినేషన్ సమర్పిస్తున్న నాగబాబు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు నాగబాబు. ఈ నామినేషన్ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటించిన పవన్..

శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు.. జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ కళ్యాణ్‌.. నాగబాబుకు ఈమధ్యే సమాచారం ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు.

రాజ్యసభ వెళ్తారని ప్రచారం..

నాగబాబు పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేసినట్టు కొన్నిరోజుల కిందటే వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఆయన రాజ్యసభకు మొగ్గు చూపుతున్నట్టు, ఎమ్మెల్సీ కాకుండా నామినేటెడ్ పదవిని చేపడతారని కథనాలు వెలువడ్డాయి. దీంతో గందరగోళం తలెత్తింది. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని.. నాగబాబుకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయాలని సూచించడంతో ఈ వ్యవహారానికి తెరపడింది.

మంత్రివర్గంలోకి నాగబాబు..

ఇటు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. తాజాగా.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ఖరారు చేయడంతో.. త్వరలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత మంత్రిని చేస్తారన్న వార్తలతో.. జనసేన కేడర్ హ్యాపీగా ఫీల్ అవుతోంది.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner

టాపిక్

JanasenaPawan KalyanAp Mlc ElectionsAndhra Pradesh NewsAmaravati
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024