





Best Web Hosting Provider In India 2024

OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం డార్క్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్, తేదీ ఇదే
OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి మలయాళం డార్క్ కామెడీ మూవీ వస్తోంది. ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలో రిలీజైనఈ సినిమా సూపర్ హిట్ టాక్ కొట్టేసింది. స్టార్ హీరో బేసిల్ జోసెఫ్ నటించిన మూవీ కావడం విశేషం.

OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళం మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా పేరు పోన్మ్యాన్ (Ponman). ఈ ఏడాది ఆ ఇండస్ట్రీలో రిలీజైన హిట్ సినిమాల్లో ఇదీ ఒకటి. థియేటర్లలో రిలీజైన నెలన్నర రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
పోన్మ్యాన్ ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీలో మలయాళం సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడి స్టార్ హీరోల్లో ఒకడైన బేసిల్ జోసెఫ్ కు ఇక్కడా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడతడు నటించిన పోన్మ్యాన్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా జియోహాట్స్టార్ ఓటీటీలో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
“ఈ బంగారు మనిషి మెరుస్తాడు. పోన్మ్యాన్ మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో జియోహాట్స్టార్ మలయాళం తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
పోన్మ్యాన్ స్టోరీ ఏంటంటే?
పోన్మ్యాన్ అంటే గోల్డ్ మ్యాన్ అని అర్థం. ఇది ఈ ఏడాది జనవరి 30న రిలీజైన మలయాళం డార్క్ కామెడీ మూవీ. బేసిల్ జోసెఫ్, సజిన్ గోపు, లిజొమోల్ జోస్, ఆనంద్ మన్మధన్, దీపక్ పరంబోల్ లాంటి వాళ్లు నటించారు. జోతిష్ శంకర్ డైరెక్ట్ చేశాడు. నాలంచు చేరుప్పకర్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ మూవీకి థియేటర్లలో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
కేరళలోని కొల్లమ్ లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఇందులో పీపీ అజేష్ అనే పాత్రలో బేసిల్ కనిపించాడు. అతడో చిత్రమైన వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఉన్న బంగారాన్ని పెళ్లికూతురు ఇంట్లో వాళ్లకు ఇస్తాడు. ప్రతిగా పెళ్లిలో అతిథులు ఇచ్చే డబ్బు మొత్తం తనకు ఇవ్వాలని షరతు విధిస్తాడు. అతని వ్యాపారం బాగానే సాగుతుంది.
స్టెఫీ కుటుంబానికి కూడా అలాగే 25 సవర్ల బంగారం ఇస్తాడు. అయితే పెళ్లి తర్వాత ఆ ఫ్యామిలీ కేవలం 13 సవర్లే తిరిగి చెల్లిస్తుంది. మిగిలిన 12 సవర్ల కోసం అజేష్ డిమాండ్ చేస్తాడు. అది కాస్తా ఆ కుటుంబంతో వివాదానికి దారి తీస్తుంది. అది ఎక్కడి వరకు వెళ్తుంది? అజేష్ పరిస్థితి ఏమవుతుంది అన్నది ఈ పోన్మ్యాన్ సినిమాలో చూడొచ్చు. ఈ మూవీ మార్చి 14 నుంచి జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
సంబంధిత కథనం