Womens Day Speech: మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా చక్కగా ప్రసంగించండి, ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతారు

Best Web Hosting Provider In India 2024

Womens Day Speech: మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా చక్కగా ప్రసంగించండి, ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతారు

Haritha Chappa HT Telugu
Published Mar 07, 2025 07:11 PM IST

Womens Day Speech: ఉమెన్స్ డే రోజు మహిళల గొప్పతనం చెబుతూ ప్రసంగించాల్సిన అవసరం కొంతమందికి వస్తుంది. అలాంటి వారికోసం ఇక్కడ సింపుల్ స్పీచ్ ను ఇచ్చాము. ఇవి చాలా స్ఫూర్తివంతంగా ఉంటాయి.

మహిళా దినోత్సవ స్పీచ్ తెలుగులో
మహిళా దినోత్సవ స్పీచ్ తెలుగులో (Pixabay)

ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గౌరవించడానికి ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించుకుంటాము. ఈ వేడుకరోజు ఎంతో మంది మహిళల గొప్పతనం గురించి వేదికపై మాట్లాడుతూ ఉంటారు. మీరు కూడా అందరూ మెచ్చుకునేలా స్పీచ్ ఇవ్వాలనుకుంటే… ఇక్కడ మేము మహిళా దినోత్సవ స్పీచ్ ను సింపుల్‌గా ఇచ్చాము. దీన్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ మీ స్పీచ్ విన్న తర్వాత చప్పట్లు కొట్టడం ఖాయం.

స్పీచ్ 1

మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న మహిళలు అందరికీ నా ధన్యవాదాలు. ఆధునిక మహిళలు ఇకపై పురుషులపై ఆధారపడే అవసరం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఆమె ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. పురుషులతో సమానంగా ప్రతిదీ చేయగలుగుతుంది. స్త్రీ శక్తి అసాధారణమైనది. ఆమె ఎక్కడ పని చేసినా కూడా ఆ ప్రదేశం భోగ భాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పు తెచ్చేందుకు ఎంతో కృషి చేస్తుంది. పిల్లల్ని పెంచడం, కుటుంబాన్ని నిర్మించడం, పెద్దవారి బాగోగులు చూసుకోవడం వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల విజయాలను తలచుకొని నిర్వహించుకోవడానికి ఒక రోజు ప్రత్యేకంగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మన జీవితంలో, సమాజంలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారికి తగిన అవకాశాలను కల్పిస్తారని కోరుకుందాం.

స్పీచ్ 2

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఓ చారిత్రాత్మక ఉద్యమమే మహిళా దినోత్సవంగా మారింది. పనిగంటలు తగ్గించమని కోరుతూ మహిళలు చేపట్టిన ఉద్యమం దేశ దేశాల్లో మహిళా దినోత్సవంగా ఉద్భవించింది. నేటి సమాజంలో మహిళలు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షలను వదిలి, వారికి మగవారితో సమానంగా అవకాశాలు కల్పించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. ఒకప్పుడు మహిళలు ఇంట్లోంచి బయటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మహిళలకు విద్య అందింది. ఓటు హక్కు వచ్చింది. ఉద్యోగాలు చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. అంతరిక్షాన్ని తాకుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. చిన్నప్పుడే పెళ్లిళ్లు చేయడం, సతీసహగమనం వంటి వాటికి నుంచి వారికీ విముక్తి లభించింది. ఇప్పుడు వారు మగవారితో సమానంగా ఎదుగుతున్న మహా వృక్షాలు. ఈ ప్రపంచంలో విజయాలు సాధిస్తున్న ప్రతి మహిళకు నా శుభాభినందనలు.

స్పీచ్ 3

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏడాది మార్చి ఎనిమిదో తారీఖున మనం ప్రత్యేకంగా నిర్వహించుకుంటూ ఉంటాం. వివిధ రంగాలలో మహిళలు సాధించిన కృషి, విజయాలను గుర్తించడానికి… వారిని అభినందించడానికి ఈ దినోత్సవం ఒక ప్రత్యేక వేదిక అని చెప్పుకోవాలి. స్త్రీ దేవుని అత్యంత శక్తివంతమైన సృష్టి. ఆ సృష్టి వెనుక కూడా ఉన్నది ఒక స్త్రీయే. ఒకప్పుడు సమాజంలో స్త్రీలను చాలా తక్కువగా అంచనా వేసేవారు. పురుషులకంటే బలహీనంగా భావించేవారు. ఒక పురుషుడు కూడా స్త్రీ ద్వారానే ఈ ప్రపంచంలోకి రావాలి. జీవితాన్ని సృష్టించే శక్తి ఉన్న స్త్రీ.. పురుషులతో సమానంగా ఏ పనైనా చేయగలదు. ఇప్పుడు వృత్తిపరమైన రంగంలో కూడా మహిళలు ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు. వారికి కావాల్సిందల్లా ప్రజల్లో గుర్తింపు. వారి శక్తిని తక్కువ అంచనా వేయకుండా వారికి సహాయం చేయాల్సిన సమయం ఇది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమాజం నుంచి మద్దతు లభిస్తుందని కోరుకుందాం.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024