







Best Web Hosting Provider In India 2024

OTT Family Drama: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళ ఫ్యామిలీ డ్రామా.. ఐఎండీబీలో మంచి రేటింగ్
OTT Family Drama: ఓటీటీలోకి ఓ మలయాళ ఫ్యామిలీ డ్రామా సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇద్దరు ప్రముఖ మలయాళ నటులు నటించిన మూవీ ఇది. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కు వచ్చింది.

OTT Family Drama: మలయాళ స్టార్ హీరోలు జోజు జార్జ్, సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ (Narayaneente Moonnaanmakkal). ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల తిరక్కుండానే ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ ఓటీటీ స్ట్రీమింగ్
నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. జోజు జార్జ్, సూరజ్ వెంజరమూడులాంటి వాళ్లు నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. శరణ్ వేణుగోపాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
అతనికి ఇదే తొలి సినిమా. శుక్రవారం (మార్చి 7) ఉదయం నుంచే ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ మూవీ గురించి..
నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా టైటిల్ కు తగినట్లు నారాయణికి చెందిన ముగ్గురు కొడుకుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ ఫ్యామిలీ డ్రామాకు థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఓటీటీలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు.
ఈ సినిమాలో జోజు జార్జ్, సూరజ్ వెంజరమూడు, అలెన్సియెర్ లే లోపెజ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ ముగ్గురూ నారాయణి కొడుకులుగా మూవీలో కనిపిస్తారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు తమ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుసుకొని ఎన్నో ఏళ్ల తర్వాత తమ సొంతూరికి వస్తారు. ఆ ఊళ్లో ఆ ముగ్గురి ప్రయాణం ఎలా సాగుతుందన్నది మూవీలో చూడొచ్చు. ఈ కాలం కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయన్నది ఈ మూవీలో మనసుకు హత్తుకునేలా దర్శకుడు శరణ్ వేణుగోపాల్ చూపించాడు.
ఈ ఫ్యామిలీ డ్రామా కోసం మలయాళం ఇండస్ట్రీలోని సీనియర్ నటులైన జోజు జార్జ్, సూరజ్ లాంటి వాళ్లను ఎంచుకోవడం ద్వారానే డైరెక్టర్ సగం సక్సెస్ సాధించాడని చెప్పొచ్చు. ఒరు పాతిరా స్వప్నం పోలె అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా పేరు సంపాదించడమే కాదు.. నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న డైరెక్టర్ ఈ శరణ్ వేణుగోపాల్. ఇప్పుడీ నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.
సంబంధిత కథనం