






Best Web Hosting Provider In India 2024

ANU BEd Exam Paper Leak : బీఎడ్ క్వశ్చన్ పేపర్ లీక్…! ప్రభుత్వం సీరియస్, ఎగ్జామ్ రద్దు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఎగ్జామ్ మొదలయ్యే కంటే ముందే పేపర్ బయటికి వచ్చింది. అయితే ఓ కళాశాల యాజమాన్యం పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని.. ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు.

ఆచార్య నాగార్జున యూవర్సిటీ పరిధిలో జరుగుతున్న బీఎడ్ పరీక్షల్లో లీకేజీ ఘటన వెలుగు చూసింది. మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం అరగంట ముందుగానే బయటికి వచ్చింది. అంతేకాదు… సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా పరిగణిించింది. సమగ్ర విచారణకు ఆదేశించింది.
ప్రాథమిక వివరాల ప్రకారం…. ఓ కళాశాల యాజమాన్యం ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 6వ తేదీ నుంచి ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం జరిగే ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పేపర్ అరగంటే ముందే లీక్ అయింది. ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి రావటంతో… విచారణ జరుపుతున్నారు.
పరీక్ష రద్దు – విద్యాశాఖ మంత్రి లోకేశ్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షాపత్రం లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‍మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
పేపర్ లీక్ నేపథ్యంలో… పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని… భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్