Actor Vijay in Iftar Party: పొలిటికల్ పార్టీ ఇఫ్తార్ విందులో తళపతి విజయ్.. వైరల్ గా స్టార్ హీరో లుక్.. వీడియో ట్రెండింగ్

Best Web Hosting Provider In India 2024

Actor Vijay in Iftar Party: పొలిటికల్ పార్టీ ఇఫ్తార్ విందులో తళపతి విజయ్.. వైరల్ గా స్టార్ హీరో లుక్.. వీడియో ట్రెండింగ్

Chandu Shanigarapu HT Telugu
Published Mar 07, 2025 08:51 PM IST

Actor Vijay in Iftar Party: సూపర్ స్టార్ తళపతి విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నాడు. తలకు ముస్లిం సంప్రదాయ టోపీ (స్కల్ క్యాప్) ధరించాడు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం చెన్నైలో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో వైట్ అండ్ వైట్ లో విజయ్ లుక్ వైరల్ గా మారింది.

ఇఫ్తార్ విందులో తళపతి విజయ్
ఇఫ్తార్ విందులో తళపతి విజయ్ (X/Friday Matinee)

సినిమాల్లో నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తళపతి విజయ్.. పొలిటికల్ జర్నీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించి, తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలని చూస్తున్న విజయ్.. పొలిటికల్ ప్రోగ్రామ్స్ ను జోరుగా నిర్వహిస్తున్నాడు. శుక్రవారం (మార్చి 7) చెన్నైలో తన పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందులో తళపతి లుక్ వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ లో విజయ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

నమాజ్ లో పాల్గొని

ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి తళపతి విజయ్ నమాజ్ చేశాడు. ముస్లింలు ధరించే ట్రెడిషనల్ స్కల్ క్యాప్ ను విజయ్ తలపై ధరించాడు. పూర్తిగా వైట్ అండ్ వైట్ లో మెరిసిపోయాడు. ముస్లిం సోదరుల మధ్యలో కూర్చుని నమాజ్ చేస్తున్న తళపతి ఫొటో వైరల్ గా మారింది. తీక్షణంగా చూస్తున్న ఆయన లుక్ అటు ఫ్యాన్స్ , ఇటు ఫాలోవర్స్ ను ఆకట్టుకుటోంది. రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్ష విరమించే ముందు స్కల్ క్యాప్ ధరించి హాజరైన వారితో కలిసి ప్రార్థనల్లో విజయ్ పాల్గొన్నాడు.

ఉపవాసం విరమించి

తన ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందుకు హాజరైన ప్రతి ఒక్కరికీ తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు, చీఫ్ విజయ్ కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో కూడా ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. రాయపేట వైఎంసీఏ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయ్ హాజరయ్యాడు. ప్రార్థనల తర్వాత ఉపవాసం విరమించి.. ముస్లిం వ్యక్తులతో కలిసి విజయ్ విందు ఆరగించాడు.

ఇఫ్తార్ విందుకు హాజరైన ఆయన అభిమానులు ఆయనతో కలిసి ఫొటోలు దిగుతూ కనిపించారు. లోపలికి వెళ్లే ముందు బయట ఉన్న వారిని కూడా పలకరించాడు విజయ్.

రాజకీయాల్లోకి విజయ్

చివరిసారిగా 2024లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘ది గోట్’ చిత్రంలో విజయ్ నటించాడు. త్వరలో హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘జననాయకన్’ కోసం రంగంలోకి దిగబోతున్నాడు. అదే తనకు చివరి సినిమా అని టీవీకే ర్యాలీలో విజయ్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. 69వ చిత్రంతో తన నటజీవితానికి ముగింపు పలుకుతానని అన్నాడు. ఇకపై రాజకీయాలపై దృష్టి పెడతానని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించాడు. 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళనాడులో పోటీ చేయనుంది.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024